మనస💞వాచా – 1
మనసా వాచా 💞1
A beautiful wife and husband Love journey.. with strong emotional strings… don’t miss it..😍
subscribe share and like the story..💞💔💞
నల్లని మబ్బులను కప్పుకొని అప్పుడప్పుడు తొంగి చూస్తున్న పున్నమి చంద్రుడు వరుణుడు కరుణిస్తే ఆకాశం అంతా అలుముకోవలని ఎదురు చూస్తున్నట్టు ఉంది.
ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒక అరగంట పాటు బీభత్సంగా కురిసిన వర్షం నిమ్మదిస్తుంటే, అప్పటివరకు వరుణుడి కుంభ వృష్టితో అల్లాడిన చెట్లు నెమ్మదిగా ఒళ్ళు విదుల్చుకొని తలలు ఎత్తే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎటు చూసినా చీకటి రోడ్లు మొత్తం నిండి ప్రవహిస్తున్న వర్షం నీరు.
పెద్ద పెద్ద వెహికల్స్ ట్రాఫిక్ లేని హైవే రోడ్డు మీద చిన్నగా దారి చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక కార్లు బైక్స్ అయితే కదిలే దారి కూడా లేదు.
హైవేకి కనెక్ట్ అయి ఉన్న అన్ని చిన్న రోడ్లు వర్షంతో నిండిపోయి హైవే మీద వెహికల్స్ ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి.
ట్రాఫిక్ కదలడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అది గమనిస్తున్న ఒక కార్ లోని వ్యక్తి వర్షంలో తడుస్తూనే ఆ చుట్టుపక్కల ఎంక్వయిరీ చేస్తున్నాడు.. సిటీకి వెళ్లే రూట్ ఇంకా ఏమైనా ఉందా..?? అని
కొండవలస మీదగా పోతే ఒక గంట ప్రయాణం. రాళ్లు రప్పలతో ఎంత వర్షం పడినా కారు పోవడానికి దారి బానే ఉంటుంది.
అయితే చెట్లు విరిగి పడిన, ఆపైన బిల్లు కాలువ రోడ్డు తెగిపోయిన చేసేది మాత్రం ఏమీ లేదు. ఆగిపోవాల్సిందే.. అని ఉన్న అవకాశాన్ని విపులంగా చెప్పాడు ఒక పెద్దాయన.
అడుగు ఎత్తులో హైవేని కప్పేసిన వర్షం నీరు తగ్గడానికే ఇంకొక గంట పట్టేలా ఉంది.
ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి. వర్షం సన్న సన్నగా పడుతూనే ఉంది, చూస్తుంటే తగ్గేలా లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వెయిట్ చేయడం కన్నా కొండవలస మీదుగా సిటీలోకి వెళ్లడమే బెటర్.
మనం త్వరగా వెళ్లి అమ్మాయి గారిని ఆపలేదో ఆ తర్వాత మన బతుకులేంటో తెలుసుగా..?? అని భయం నిండిన ఆలోచనతో బండిలో ఉన్న అందరినీ చూశాడు అతను.
సఫారీలో ఉన్న అందరిలో ఒకలాంటి టెన్షన్. అవును అనకుండా కాదు అనే మార్గం లేదు వాళ్ళకి.
ఆ వర్షం నీటిలోనే సఫారీ ని వెనక్కి తీసి ట్రాఫిక్ ని దాటి హైవే మీద నుంచి అడ్డదారి తీసుకున్నారు. సఫారీ వెనుక ఫాలో అయింది రెండో బండి కూడా.
ఆ చీకటి అడ్డదారిలో బండి లైట్ లోనే దారి చూసుకుంటూ పోతున్న వాళ్లకు ఒకచోట రోడ్డు ఒకపక్కకి వరిగి కనిపించడంతో రెండు బళ్ళు ఆపి దిగారు.
నెమ్మదిగా ఒక దాని తర్వాత మరొకటి వెళ్లిపోవచ్చు.
కొంచెం అదుపు తప్పిన ఒరిగిపోయిన రోడ్డు మీద నుంచి పది అడుగుల లోతులోకి వెహికల్స్ పడిపోతాయి.
మళ్లీ ఆకాశం ఒక్కసారిగా ఉరుములతో నిండిపోయింది. మెరుపుల మధ్య ఆ ప్రదేశం అంతా భయానకంగా ఉంది.
మరొక కుంభవృష్టి కి ప్రకృతి సిద్ధమవుతుంది.
ఇది దాటేస్తే ఇక సమస్య లేదు. అమ్మాయిగారిని పట్టుకున్నాక అక్కడే జాగ్రత్తగా ఉంచి, సార్ గారికి ఫోన్ చేద్దాం అని మాట్లాడుకొని మళ్లీ కార్స్ స్టార్ట్ చేసారు.
ఈ గ్యాప్ లోనే వెనుక కార్ డిక్కీ లో నుంచి కిందకు దిగిన వ్యక్తి నేల మీద కదలకుండా ముడుచుకొని కూర్చుంది.
కార్లు ముందుకి వెళ్లాయి, మరుక్షణం ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది.
ఆ వెలుతురికి భయపడుతూ పిడుగులు శబ్దానికి గట్టిగా చెవులు మూసుకుని, అరవకుండా గట్టిగా పెదవులు బిగించుకొని.. కూర్చున్న ఆ ఆకారం పెళ్లి బట్టలలో ఉన్న ఒక ఆడపిల్ల.
నుదుటన బాసికం, కూర్చుని ఉండడంతో నేల మీద పడి ఉన్న పూల జడ, ఎర్రటి పారాణి కాళ్ళ కింద నుంచి పారుతున్న నీటితో పాటు చిన్నగా కదులుతూ ఒకదానికి ఒకటి తట్టుకొని సవ్వడి చేస్తున్న జడగంటలు.
భయంతో వణుకుతున్న ఆమె చేతి గాజులు ఆమె శరీరం వణుకుతున్న తీరుకి తోడై శబ్దం చేస్తున్నాయి.
మేఘం విడిచిన పున్నమి చంద్రుడిలా ఉంది ఆమె ముఖం.
కాటుక కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఒక పక్క కొండ, మరొకపక్క మొదలు చివర కనబడని భారీ చెట్లు.
భయంతో నిండిన ఆ కాటుక కళ్ళల్లో కన్నీళ్లు.
కార్లు వెళ్లే వరకు కూర్చుని ఆ తర్వాత మెరుపుల వెలుతురులో ఘన ఘన మంటున్న ఉరుముల శబ్దానికి భయపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా కంగారుతో వేగంగా ముందుకు అడుగు వేసిన ఆ అమ్మాయి వరిగి ఉన్న రోడ్డు అంచు మీద కాలు వేయడమే 10 అడుగుల లోతులోకి పారుతున్న నీళ్లతో పాటు జారిపోయింది.
కాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది.
ఆకాశం ఒళ్ళు విరుచుకున్నట్టు మళ్లీ ఉరిమింది.
ఆ శబ్దానికి ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచిన ఆమె గబాలున చెవులు మూసుకుని లేవడానికి చూసింది.
తన కింద మెత్తగా తగలడంతో కెవ్వుమని అరిచి అదిరి పాటులో వెనక్కి పడిపోయింది.
అక్కడ అంతా మొఖం మునిగిపోయేలా మొత్తం వర్షం నీరు.
గబాలున లేచి కూర్చుని ముఖాన్ని కప్పేసిన జుట్టు వేళ్ళతో వెనక్కి తోసుకుంటూనే నోట్లోకి వచ్చిన వర్షం నీరు బయటికి ఊసేసి.. తన నడుము దగ్గర గుచ్చుకుంటున్న వాటిని పట్టుకుని చూస్తే అవి షూస్.
వెంటనే తన కింద ఉన్నది మనిషి అని గమనించి ముందుకు వంగి ఆ చీకట్లోనే చేతులతో దేవులాడుతూన్న తనకి అది అబ్బాయి అని వేసుకున్న బట్టలను బట్టి అర్థమైంది.
అతని మీద పడడంతోనే ప్రాణాలతో ఉన్నానని కూడా సెన్స్ చేస్తుంది.
వెనకవైపు మొత్తం నీరు, ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో తెలియదు.
భయపడుతూనే అతని ముఖాన్ని పట్టుకొని కదుపుతు.. హలో మీరు బాగున్నారా..?? అని పిలుస్తూ అతని చెంపలు తడుతూ లేపటానికి ట్రై చేస్తుంటే
నిమిషాల మీద ఆమె కష్టంతో చిన్నగా కదిలాడు ఆ వ్యక్తి.
వెంటనే అతని ముఖం దగ్గరికి చేరి నేల మీద చేతులతోనే తడుముతుంది.
చుట్టూ ఏవేవో గుచ్చుకుంటున్నాయి, ఒకచోట మెత్తగా ఒక్కోచోట ముట్టుకోవడానికి కూడా లేని విధంగా ముళ్ళ కంపల ఉంది.
కాకపోతే మనిషి మునిగిపోయే అంత వాటర్ లేదు. అలాగే చుట్టూ చీకటి, పైగా ఉరుములు మధ్య మధ్యలో మెరుపులు.
బహుశా గడ్డి దుబ్బుల మీద పడి ఉంటాడు. ఇతని మీద పడడం వల్ల నేను సేఫ్ అయ్యాను అని సెన్స్ చేస్తున్న తను అతని చెంపలు తట్టి పిలుస్తూ.. హలో ఎవరు మీరు, మీ దగ్గర ఫోన్ ఉందా..??
మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఒకసారి పలకండి.. అని చాలా సేపు అడిగిన తర్వాత అర్జున్.. అంటూ చిన్నగా కదిలిన అతను తన దగ్గర ఫోన్ అతి కష్టంగా తీసి ఇస్తూనే స్పృహ తప్పడంతో ఫోన్ జారిపోయింది.
మళ్లీ మళ్లీ పిలిచి అతను సృహలో లేడు అని కన్ఫామ్ చేసుకున్న తను చేతులతోనే ఆ చీకటిలో నేల మీద వెతికి ఫోన్ కనిపెట్టింది.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత..
హైదరాబాద్ మెట్రో కన్వెన్షన్.
మేఘన వెడ్స్ రిత్విక్ అని పేర్లతో పాటు, రోజ్ పూలతో డెకరేట్ చేసిన 9 అడుగుల ఫ్రేమ్ లో పక్కపక్కగా నిలబడి ఉన్న ఇద్దరు గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నా మ్యారేజ్.
బంధువులు, ఫ్రెండ్స్, పిల్లలు పెద్దలతో కలర్ ఫుల్ గా అట్టహాసంగా, గ్రాండ్ అరేంజ్మెంట్స్ తో జరుగుతుంది బిఫోర్ వెడ్డింగ్ రిసెప్షన్.
నార్త్ అండ్ సౌత్ సైడ్ ఆల్ వెరైటీస్ తో ఇది లేదు అనే విధంగా భారీగా ఉన్నాయి విందు భోజనం ఏర్పాట్లు.
ఫ్రెండ్స్ బంధువులు అందరి నోటి నుంచి ఒకటే మాట.. మేఘన ఇస్ రియల్లీ లక్కీ. గ్రేట్ ఫాదర్ ఇంకా చిన్నప్పటినుంచి అన్ని తెలిసిన బావ ని పెళ్లి చేసుకుంటుంది అని.
షీ ఇస్ రియల్లీ లక్కీ.. బట్ వి ఆర్ నాట్. మార్నింగ్ ముహూర్తం టైం కి మన మోఖాలు ఎలా ఉంటాయో..??
కష్టపడి మేకప్ వేసుకున్నాము, పెళ్లి కోసం స్పెషల్ గా డ్రెస్సెస్ తీసుకున్నాను.. అని ఒకరు ఫీల్ అవుతుంటే
అసలు పెళ్లిలో ఉంటామో లేదో, ఇప్పుడే ఫొటోస్ దిగుదాం అని ఇంకొక అమ్మాయి అనడంతో మేఘన ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం స్టేజ్ మీదకు వచ్చారు.
రిత్విక్ సైడ్ కొంతమంది మేఘన సైడ్ కొంతమంది. ముందు గ్రూప్ ఫోటో తర్వాత సింగల్ ఫొటోస్ తో ఫుల్ హడావిడి చేస్తున్నారు.
నెలవంక నేల మీద నిలిచిందా అన్నట్టు లైట్ సి బ్లూ లెహంగా, దానికి తగ్గ డైమండ్ జ్యువెలరీ తో అప్సరసలా మెరిసిపోతుంది మేఘన.
తనకి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు రాయల్ బ్లూ శర్వానీలో హుందాగా ట్రిమ్ చేసిన మిసపు కట్టు కింద సన్నని నవ్వుతో అందాల బొమ్మని అందుకుంటున్న హ్యాపీనెస్ తో రిత్విక్.
స్టేజ్ కి సెంటర్ లో నిలబడ్డ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా స్టేజ్ మొత్తానికి కంప్లీట్ అట్రాక్షన్ గా ఉన్నారు.
ఒక్కగాను ఒక్క కూతురు సంపాదించింది మొత్తం పెళ్లికే ఖర్చు పెడితే ఇక అల్లుడికి ఏముంటుంది..?? అని చమత్కారంగా జితేంద్ర ను లాక్ చేస్తున్నారు బిజినెస్ ఫ్రెండ్స్.
జితేంద్ర శర్మ డాటర్ పెళ్లంటే వచ్చిన అందరికీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి. లైఫ్ లో ఒక్కసారి వచ్చే పెళ్లి, నా సంపాదన నా యావదాస్తి నా కూతురి కోసమే కదా, అది పెళ్లికి ఖర్చుపెడితే ఏముంది అల్లుడికి ఇస్తే ఏముంది..??
అసలు నా అల్లుడికి నేను ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను బిజినెస్ లో ఒక నెల అంతా కష్టపడి సంపాదించింది నా అల్లుడు ఒక్కసారికే సంపాదిస్తాడు.. అని స్నేహితులకి గొప్పగా చెప్పి ఎంజాయ్ చేయండి అని ముందుకు వెళుతున్న జతేంద్ర భార్య రూపాలి పిలవడంతో వేదిక మీదకి వెళ్లారు.
డిన్నర్ కంప్లీట్ అవ్వడమే పెళ్లికి వచ్చినవారు పలకరించి ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారు.
నెమ్మదిగా ఫంక్షన్ హాల్ జనాలు తగ్గి పలచబడింది.
ఎక్కువసేపు నిలబడి ఉండటం వలన ఏమో.. కాళ్లు పీకుతున్న మేఘన ఒక సైడ్ కి బెండ్ అయ్యి సింగల్ లెగ్ మీద వెయిట్ హ్యాండిల్ చేస్తూ రెండవ కాలు స్ట్రెస్ చేస్తుంటే
గమనించిన రిత్విక్ పెయిన్ గా ఉందా..?? అని చిన్న స్వరంతో భుజం చుట్టి నవ్వుతూ అడిగాడు.
హా బావ, లెహంగా వెయిట్ క్యారీ చేయడం కష్టంగా ఉంది. ఇంకా కాళ్ళు పీకుతున్నాయి అని ముఖం ముడిచి ఇబ్బందిగా చెప్పింది.
టు మినిట్స్ వెయిట్ చెయ్ అని వెనకే ఉన్న రాయల్ పీకాక్ దివాన్ మీద తనని కూర్చోబెట్టి పేరెంట్స్ ని పిలిచి ఇక వెళ్తాము అనడంతో.. ఇద్దరికీ రిచ్యువల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రెస్ట్ తీసుకోమని రూమ్స్ కి పంపారు.
దీని కోసమే వెయిట్ చేస్తున్న మేఘ ముఖంలో అందమైన కన్నింగ్ స్మైల్. కాళ్ళు నొప్పి ఎగిరిపోయి బూస్ట్ బేబీల ఫాస్ట్ గా తన రూమ్ కి చేరింది.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్ బేబీస్..
ఏ ఒక్కరు మిస్ చేయొద్దు..🫶💖🫶
__వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages