మై మాఫియా డాన్ – 2
ఉదయం 7 గంటలు. ఆమె గదిలో కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతున్నా, దుప్పటి మొహం దాకా ముసుగు పెట్టి పడుకుని ఉంది.
అన్విక లేవే, టైమ్ ఎనిమిది కావస్తోంది. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? అని కింద నుంచి వాసవి గారు అరుస్తోంది.
అన్విక ఒక్కసారిగా దుప్పటి తీసి, అబ్బా.. వాసవీ పొద్దున్నే నీ రేడియో ఆపవా ప్లీజ్ ,అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుంది.
తన ఫోన్ తీసి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు గడిపింది. ఇది తన రోజువారీ దినచర్య.
బద్ధకంగా మొహం కడుక్కుని కిందకి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నపూర్ణమ్మ గారు తన మందుల డబ్బాతో కుస్తీ పడుతోంది.
పూరి! ఆ డబ్బా నీ వల్ల కాదు కానీ ఇటు ఇవ్వు” అంటూ ఆ డబ్బా లాక్కుని మూత తీసి ఇచ్చింది అన్విక.
ఏంటే నీ కాలేజీకి వెళ్లవ,ఎప్పుడూ ఇంట్లోనే కనిపిస్తావు? అని అన్నపూర్ణమ్మ అడిగితే,
నీకు నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదా? అయితే సరే, రేపటి నుంచి నేను రాను, హాస్టల్లో జాయిన్ అవుతాను అప్పుడు నువ్వే ఏడుస్తావు చూడు అని బుంగమూతి పెట్టింది.
అయ్యో,సరదాగా అన్నానే తల్లి ,నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఇల్లులగే ఉండదు అని అన్నపూర్ణమ్మ గారు అనగానే, అన్విక నవ్వుతూ ఆవిడ భుజం మీద తల పెట్టింది.
అప్పుడే శ్రీనివాస్ గారు ఆఫీస్ కి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అన్విక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన ఆఫీస్ బ్యాగ్ అందుకుంది.
ఏంటి వాసు గారు, ఈరోజు ఏదో కొత్త షర్ట్ వేసుకున్నారు? ఆఫీస్ లో మీ కొలీగ్స్ కి అసూయ పుట్టించడానికా, అని కన్ను కొట్టింది
శ్రీనివాస్ గారి నవ్వుతూ,అదేం లేదు తల్లీ,మీ అమ్మ కొని పెట్టింది కదా, వేసుకోకపోతే యుద్ధం జరుగుతుంది ఇక్కడ అని మెల్లగా అన్నాడు. వాసవి గారు అది వినేసి గరిటె పట్టుకుని రావడం చూసి ఇద్దరూ నవ్వుకున్నారు.
అన్విక కాలేజీకి రెడీ అయి తన స్కూటీ మీద బయలుదేరింది. గాలికి జుట్టు ఎగురుతుంటే, హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ వెళ్లడం తనకి ఇష్టం.
కాలేజీ పార్కింగ్ లో స్కూటీ ఆపగానే తన ఫ్రెండ్స్ స్నేహ, కార్తీక్ కలిశారు.అన్విక, ఆ అసైన్‌మెంట్ రాశావా? సార్ ఈరోజు చాలా సీరియస్ గా ఉన్నాడు, అని స్నేహ అడిగింది.
రాశాను కానీ, సగం క్లాస్ లో రాద్దాం అనుకున్నా. సార్ వచ్చే లోపు మేనేజ్ చేద్దాంలే పద అంటూ హుషారుగా క్లాస్ వైపు నడిచింది.
క్లాస్ లో ప్రొఫెసర్ లెెక్చర్ ఇస్తుంటే, అన్విక మాత్రం తన నోట్ బుక్ వెనుక పేజీలో ఏదో బొమ్మలు గీస్తోంది. మధ్య మధ్యలో కార్తీక్ కి చిన్న చిన్న చిట్టీలు విసిరి ఆటపట్టిస్తోంది.
తను చదువులో యావరేజ్ కంటే ఎక్కువే కానీ, పుస్తకాల పురుగు మాత్రం కాదు. ఏదైనా విషయం ఒక్కసారి వింటే దాన్ని తన స్టైల్ లో రాసేయడం ఆమెకి అలవాటు.
అన్విక స్టాండ్ అప్,ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ పాయింట్ ఏంటి? అని ప్రొఫెసర్ అడిగారు.
అన్విక ఏమాత్రం తడబడకుండా,
సార్, మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ లో నార్మలైజేషన్ గురించి చెప్తున్నారు.దానికి ఎగ్జాంపుల్ గా లైబ్రరీ సిస్టమ్ ని తీసుకున్నార అని ఠక్కున చెప్పేసింది.
ప్రొఫెసర్ ఆశ్చర్యపోయి కూర్చోమన్నారు. తను అల్లరి చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ, ఆమె చెవులు మాత్రం ఎప్పుడూ క్లాస్ లోనే ఉంటాయి.
లంచ్ బ్రేక్ లో క్యాంటీన్ అంటే అన్వికదే రాజ్యం. అందరితోనూ చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది.
ఒరేయ్ కార్తీక్! నీ బాక్సులో ఈరోజు ఏముంది? నాకు ఆవకాయ అన్నం కావాలి అంటూ వాడి బాక్స్ లాక్కుని తినడం మొదలుపెట్టింది.
అక్కడ కూర్చుని కాలేజీలో ఎవరికి ఎవరితో గొడవ అయింది, కొత్తగా వచ్చిన సినిమాలు ఏంటి అని సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడం అంటే అన్వికకి చాలా ఇష్టం.
ఎవరైనా అబ్బాయి తనని లైన్ వేయాలని చూస్తే మాత్రం, అన్విక తనదైన స్టైల్ లో వాడిని అన్నయ్య అని పిలిచి అక్కడి నుంచి పంపించేస్తుంది. తనకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది. ఎంజాయ్ చేయాలి, కానీ ఎక్కడా హద్దులు దాటకూడదు.
సాయంత్రం 5 గంటలకు కాలేజీ అయిపోగానే, ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డు పక్కన పానీపూరి బండి దగ్గర ఆగింది.అబ్బా ఈ పానీపూరి తింటే వచ్చే కిక్కే వేరు అంటూ నాలుగైదు ప్లేట్లు ఖాళీ చేసేసింది. ఆ తర్వాత మెల్లగా ఇంటికి చేరింది.
ఇంటికి రాగానే సోఫాలో పడుకుని టీవీ రిమోట్ పట్టుకుంది. వాసవి గారు వచ్చి వచ్చావా మహారాణి? కాఫీ తాగు అని కప్పు ఇచ్చింది.
రాత్రి డిన్నర్ టైమ్ లో అందరూ కలిసి కూర్చున్నప్పుడు, అన్విక కాలేజీలో జరిగిన చిన్న చిన్న గొడవలు, ప్రొఫెసర్ తనని ఎలా అడిగారో అన్నీ కథలు కథలుగా చెప్తోంది.
శ్రీనివాస్ గారు, అన్నపూర్ణమ్మ గారు,ఆమె మాటలకు మురిసిపోతుంటే,వాసవి గారు మాత్రం చదువు మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టు తల్లి అని హెచ్చరిస్తూనే ఉంటుంది.
అన్విక తన గదిలోకి వెళ్లి కిటికీ దగ్గర నిలబడింది. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, లైఫ్ అంటే ఇంతే కదా, హాయిగా ఉండాలి, ఎవరితోనూ గొడవలు లేకుండా సరదాగా గడిపేయాలి అని అనుకుంది.
కానీ కాలం ఆమె కోసం వేరే ప్లాన్ రాసి పెట్టింది. ఇప్పటిదాకా ప్రశాంతంగా సాగుతున్న అన్విక జీవితంలోకి,
తనకి ఏమాత్రం సంబంధం లేని ఒక చీకటి సామ్రాజ్యం నీడ పడబోతోంది. తన నవ్వుల వెనుక ఒక పెద్ద యుద్ధమే దాగి ఉందని ఆమెకు ఇంకా తెలియదు.
కొనసాగుతుంది………
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని సమీక్ష ద్వారా తెలియజేయండి. అలాగే కొత్తగా స్టోరీ చదివే వాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసే సపోర్ట్ చేయండి……..
Swipe left/right or tap the sides to turn pages