అవధులు లేని ప్రేమ – 1
సమయం రాత్రి పది గంటలు సిటీకి దూరంగా ఉన్నావా బంగ్లాలో ఓ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి కాపలా కాస్తున్న రౌడీలు వాళ్లలో ఒకరు ఫోన్లో అన్న తీసుకొచ్చి కట్టేసాం ఇప్పుడు స్పృహలో లేదు ఆ అమ్మాయి అని చెప్పాడు
ఫోన్లో మాట్లాడుతున్న అతను జాగ్రత్తగా ఉండండి నేను బయలుదేరాను త్వరగా నే వచ్చేస్తాను అని చెప్పాడు
అన్నా మేము ఇక్కడ పాతికమంది కాపలా ఉన్నావ్ మమ్మల్ని దాటి ఈగ కూడా లోపలికి రాలేదు మీరు త్వరగా రండి అని చెప్పాడు
అరేయ్ ఆ అమ్మాయి కోసం వచ్చేది ఈగో దోమో కాదురా నాధ్ శివనాథ్ శివుడి యొక్క ఉగ్రరూపం వాడు ఆ అమ్మాయి విషయంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి వస్తున్న అని ఫోన్ పెట్టేసాడు
అతడు ఫోన్ పెట్టేసాక ఒక వ్యక్తి ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు అతడు చూడ్డానికి ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు తనకి అడ్డొచ్చిన వాడిని నరుక్కుంటూ ఆ అమ్మాయి వైపుకి వస్తున్నాడు
స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తున్నా ఆ అమ్మాయికి అతను కనిపించేసరికి అతను తనకోసం యుద్ధం కాదు తాండవం శివతాండవం చేస్తున్నట్టు అనిపించింది
ఆ బంగ్లా అంతా రక్తంతో తడిసిపోయింది అక్కడ ఉన్న ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనేది అనుమానమే అతని ముఖం కూడా రక్తంతో నిండిపోయింది
అతను ఆ అమ్మాయి కట్లు విప్పుతూ నీకేం కాలేదు కదా నువ్వు బానే ఉన్నావా నువ్వేం భయపడకు నేను వచ్చేసాను అని చెప్తుండగా అమ్మాయి నాకు వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయంగా ఉంది అందుకే నీ నుంచి దూరంగా పారిపోయాను కానీ నీ శత్రువులు నన్ను ఇలా తీసుకొచ్చి కట్టేశారు అంది
అప్పటివరకు అందరినీ తెగ నరికిన అతను ఆమెతో మాత్రం సున్నితంగా సారీ మా నిన్ను నేను ముందే కనిపెట్టాను నేను వచ్చేలోపే వాళ్ళు నిన్ను చేరుకున్నారు ఇప్పుడు నేను అంతా సరిచేస్తాను నువ్వు నా నుంచి మళ్లీ పారిపోవాలని ప్రయత్నించకు నీకు నచ్చినట్టుగా ఉంటాను అని చెప్పాడు
ఆ అమ్మాయి విసుగ్గా అరుస్తూ అది నీ వల్ల కాదు నువ్వు వున్నా నిన్ను ఉండనివ్వరు. అయినా నా దగ్గర కోల్పోవడానికి ఇంక ఎవరు మిగలలేదు నేను తప్ప మా అమ్మ నీకోసం మా నాన్న నీవల్ల ఇద్దరూ నాకు దూరమైపోయారు నేను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను వదిలేయ్ నాథ్ అంది
నాధ్ ఆ అమ్మాయి తో అలా మాట్లాడకు మా తప్పంతా నాదే ఒప్పుకుంటున్నాగా ఈ ఒక్కసారి నా మాట విను నేను ఇకపై అని చెప్తుండగా అప్పుడే వెనకనుంచి
వావ్ ఎవరినైనా కంటి చూపుతోనే శాసించే ది గ్రేట్ శివనాథ్ ఒకరిని బతిమిలాడుతున్నాడు సారీ ఓ అమ్మాయిని తనతో ఉండమని ప్రాధేయపడుతున్నాడు నిజానికి అడుక్కుంటున్నాడు అన్నాడు వెటకారంగా
నాధ్ కోపంగా అమిత్ అని అరుస్తూ ఆ రోజు మీ నాన్న కోసం నిన్ను వదిలేసాను ఈరోజు ఎవరు వచ్చిన నిన్ను నుంచి కాపాడలేరు అన్నాడు
అమిత్ అచ్చా నీ గురించి తెలుసు నాకు అందుకే నా జాగ్రత్తల్లో నేను వచ్చా అనగానే తన వెనుక నుంచి ఇంకో 20 మంది లోపలికి వచ్చారు
వాళ్ళని చూసి ఆమిత్ బంతి భోజనాలకు తీసుకురాలేదు మిమల్ని వాడిని ఆ అమ్మాయిని చంపేయండి అన్నాడు
నాధ్ ఆ అమ్మాయితో నువ్వు చెప్పింది నిజమే నేను ఆపిన వీళ్ళ ఆపనివ్వరు. కానీ నీకు మాటిస్తున్న ఇది ఏది నీదాకా రాకుండా చూసుకుంటాను అని చెప్పి తను ముందు కదిలాడు
నాధ్ ముందుకు వచ్చిన వాడే వచ్చినట్టే పరలోకానికి టికెట్ తీసుకుంటున్నాడు అమిత్ కోపంలో నాధ్ నీ షూట్ చేశాడు బుల్లెట్స్ నాధ్ కి తగులుతాయి అనే చివరి క్షణంలో వాటికి అడ్డుగా వెళ్ళి ఆ అమ్మాయి నిల్చుంది బుల్లెట్స్ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించాయి నాధ్ మైత్రి అని అరుస్తూ తనని పట్టుకున్నాడు
మైత్రి నాధ్ తో చూసావా నా దగ్గర రానివ్వను అన్నావ్ కానీ కుదరలేదు కదా నా ప్రాణం నీకోసం ఇచ్చేసేంత ప్రేమ ఉన్న నీకు దూరంగా ఎందుకు ఉన్నానో అర్థం చేసుకోలేకపోయావు కదూ అంది
నాథ్ మైత్రి నువ్వు మాట్లాడకు నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను ఒక్క నిమిషం ఓపిక పట్టు చాలు మనకు శత్రుశేషం ఉండకూడదు అని చెప్పి అమిత్ వైపు వెళ్ళాడు
వస్తున్న నాధ్ ను చూసి అమిత్ కి భయంతో వెన్నులో వణుకు పుట్టింది నాధ్ కళ్ళు ఎర్రగా మారి ఉంటే తను నడిచి వస్తున్న విధానమే తన కోపాన్ని సూచిస్తుంది పారిపోతున్న అమిత్ నీ తన కత్తితో ఆ వెన్నులోనే పొడిచాడు నాథ్
అంతలో వెనుక నుంచి నాధ్ అని పిలిచింది మైత్రి
అమిత్ ని వదిలి నాధ్ మైత్రి దగ్గరికి వెళ్ళాడు మైత్రి నేను చనిపోయే వరకు నాతోనే ఉండు ప్లీజ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అంది
నాథ్ మైత్రిని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు హాస్పిటల్లో స్ట్రెక్చర్ పైన మైత్రి నీ తీసుకువెళ్తున్నారు నాద్ మైత్రి చెయ్ పట్టుకొని ఉన్నాడు రక్తం కారిపోతుంది తన కనులు మూసుకుపోతున్నాయి
చనిపోయే ముందు ఎవరికైనా వాళ్లు గడిపిన జీవితం మొత్తం వాళ్ల కళ్ళ ముందు కనిపిస్తుంది అంటారు
నేను మైత్రేయి ఇది నాకథ ఈ నిమిషం ఇప్పటివరకు నేను గడిచిన జీవితం మొత్తం నా కళ్ళ ముందు నాకు కనిపిస్తుంది
నాథ్ అంటేనే భయపడే నేను నాధ్ నీ ఏలా ప్రేమించాను నాధ్ నీ అసహ్యించుకునే నేను తన కోసం నా ప్రాణాలు సైతం ఇచ్చేలా ఎప్పుడు మారాను అసలు మా కథ ఏంటి తెలుసు కోవాలంటే నాతో పాటు రండి
నక్షత్ర
Swipe left/right or tap the sides to turn pages