మై మాఫియా డాన్ – 5
రాత్రి జరిగిన రణరంగం ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా, తెల్లారేసరికి రణ్వీర్ సామ్రాట్ మళ్ళీ ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మాగ్నెట్గా మారిపోయాడు.
తెల్లటి లినెన్ షర్ట్, చేతిలో పాత జ్ఞాపకాలను తలపించే తండ్రి ఇచ్చిన ఉంగరం.. రణ్వీర్ ఇప్పుడు తన విలాసవంతమైన సామ్రాట్ మెన్షన్ గార్డెన్లో కూర్చుని ఉన్నాడు.
ఇక్కడ రణ్వీర్ గురించి కొంచెం తెలుసుకుందాం……
లోకానికి తెలిసిన రణ్వీర్ సామ్రాట్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అతని కింద ఉన్న ఐదు ప్రధాన వ్యాపారాలు, దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి.
సామ్రాట్ స్టీల్స్ & ఇండస్ట్రీస్: ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ.
సామ్రాట్ షిప్పింగ్ లైన్స్: ప్రపంచవ్యాప్తంగా వందలాది కార్గో షిప్స్ ఇతని కనుసన్నల్లోనే కదులుతాయి.
సామ్రాట్ టెక్ సొల్యూషన్స్: సైబర్ సెక్యూరిటీలో నంబర్ వన్.
సామ్రాట్ ఇన్ఫ్రా: దేశంలోని మెట్రోలు, హైవేలు అన్నీ ఇతని సంతకంతోనే మొదలవుతాయి.
సామ్రాట్ ఎయిర్ కార్గో: అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సరకు రవాణా సంస్థ.
ఈ సంస్థలన్నింటికీ రణ్వీర్ ఒకే ఒక్క అధినేత. కానీ, ఈ విలాసవంతమైన జీవితం వెనుక ఒక రహస్యం ఉంది.
రణ్వీర్ మాఫియా డాన్ ‘రానా’ అనే విషయం అతని నీడకు కూడా తెలియదు. ముఖ్యంగా అతని ప్రాణమైన కుటుంబానికి….
కుటుంబం రణ్వీర్ బలహీనత మరియు బలం…….
అన్నా! ఇంకా ఎంతసేపు ఆ ఫైల్స్ చూస్తావు రా బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అంటూ అరిచాడు రాహుల్.
రాహుల్, రణ్వీర్ తమ్ముడు. MBA చదువుతున్నాడు, కొంచెం అల్లరి వాడు కానీ అన్నయ్య అంటే అమితమైన గౌరవం. రణ్వీర్ ఫైల్ పక్కన పెట్టి నవ్వుతూ లోపలికి నడిచాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర రణ్వీర్ తల్లి దేవి గారు కూర్చుని ఉన్నారు. ఆమె ముఖంలో ఒక ప్రశాంతత, రాజసం ఉట్టిపడుతుంటాయి.
భర్త చనిపోయాక రణ్వీర్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో ఆమెకు తెలుసు. రణ్వీర్ రాగానే ఆమె తల నిమిరింది.
చికాగో నుంచి వచ్చాక సరిగ్గా నిద్రపోయినట్టు లేవు రణ్వీర్. ఎప్పుడూ పని, బిజినెస్ అంటే ఎలా? కొంచెం నీ గురించి కూడా ఆలోచించుకో అంది దేవి గారు ఆవేదనగా.
నా గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా అమ్మ. నాకు ఈ బిజినెస్ లు, ఈ పనులు అలవాటే అన్నాడు రణ్వీర్ చాలా సాఫ్ట్ గా. బయట వందల మందిని శాసించే రణ్వీర్, తల్లి ముందు మాత్రం ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడు.
అప్పుడే అనిత (రణ్వీర్ చెల్లి) పరిగెత్తుకుంటూ వచ్చింది. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కలలు కంటోంది. అన్నా ఈరోజు నా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ ఉంది, నువ్వు రావాల్సిందే అని పట్టుబట్టింది.
తప్పకుండా అనిత. నీ కోసం రాకుండా ఉంటానా అంటూ ఆమె నెత్తి మీద చిన్నగా తట్టాడు. ఈ ముగ్గురి నవ్వుల కోసం రణ్వీర్ ఎంతటి రక్తపాతానికైనా సిద్ధపడతాడు,
కానీ ఆ విషయం వీరికి ఎప్పటికీ తెలియకూడదని కోరుకుంటాడు. వాళ్ల దృష్టిలో రణ్వీర్ ఒక గొప్ప బిజినెస్ మాన్, ఒక అద్భుతమైన కొడుకు, మరియు అన్నయ్య.
బ్రేక్ ఫాస్ట్ ముగించి, రణ్వీర్ తన రోల్స్ రాయిస్ కార్లో సామ్రాట్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ కి బయలుదేరాడు. ఆఫీస్ గేటు దగ్గర వందలాది మంది ఉద్యోగులు ,రణ్వీర్ కారు రాగానే క్రమశిక్షణతో దారి ఇచ్చారు.
లిఫ్ట్ ఎక్కి 80వ అంతస్తులో ఉన్న తన క్యాబిన్ లోకి అడుగుపెట్టాడు రణ్వీర్. అక్కడ సిద్ధార్థ్ వేచి ఉన్నాడు.
సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి రెడీగా ఉన్నారు. కొత్త షిప్పింగ్ యార్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చర్చించాలి అన్నాడు సిద్ధార్థ్.
రణ్వీర్ తన సీట్లో కూర్చుని, కళ్లద్దాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. సిద్ధార్థ్, బోర్డ్ మీటింగ్ కి వెళ్లేముందు ఒక విషయం.
నిన్న రాత్రి జరిగిన దాని గురించి నా ఫ్యామిలీకి ఏ చిన్న అనుమానం రాకూడదు. ముఖ్యంగా అనితకి, రాహుల్ కి. వాళ్ళ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు.
అలాగే సార్, మీ ఆదేశం ప్రకారం అంతా క్లియర్ చేశాం, అని సిద్ధార్థ్ అన్నాడు.బోర్డ్ మీటింగ్ లో రణ్వీర్ సామ్రాట్ రూపమే వేరు.
అక్కడ అతను తన బిజినెస్ నాలెడ్జ్ తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తాడు. ఒక ప్రాజెక్ట్ లో ఉన్న లాభనష్టాలను సెకన్లలో లెక్కగడతాడు.
ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ పార్ట్నర్స్ కూడా రణ్వీర్ విశ్లేషణకు అశ్చర్యపోతుంటారు.వచ్చే రెండేళ్లలో సామ్రాట్ ఇండస్ట్రీస్ గ్లోబల్ మార్కెట్ లో టాప్ 5 లో ఉండాలి.
దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను రెడీ చేశాను అని రణ్వీర్ ప్రసంగిస్తుంటే అక్కడ చప్పట్ల వర్షం కురిసింది.
మీటింగ్ ముగిశాక, రణ్వీర్ ఒంటరిగా తన క్యాబిన్ లోని పెద్ద కిటికీ నుంచి నగరాన్ని చూస్తున్నాడు.
ఖాలిద్ చనిపోతూ చెప్పిన మాటలు నీ నీడలోనే శత్రువు ఉన్నాడు,రణ్వీర్ మనసుని తొలిచేస్తున్నాయి. తన ఆఫీస్ లోనా,తన సెక్యూరిటీలోనా,లేక తనకి దగ్గరగా ఉన్న మరెవరైనా…..
రణ్వీర్ తన ఫోన్ లో ఒక సీక్రెట్ యాప్ ఓపెన్ చేశాడు. అది అతని ‘రానా’ అవతారానికి సంబంధించిన నెట్వర్క్.
కానీ రణ్వీర్ వెంటనే ఆ ఫోన్ పక్కన పెట్టేశాడు. ఎందుకంటే అదే సమయానికి అనిత కాల్ చేసింది.
అన్నా వస్తున్నావా మరి అందరూ నీ కోసమే వెయిటింగ్ అనిత ఉత్సాహంగా అడిగింది.
వస్తున్నాను అనిత, ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను, అన్నాడు రణ్వీర్ నవ్వుతూ.ఒకే క్షణంలో ఒక డాన్ నుంచి ఒక అన్నయ్యగా మారిపోవడం రణ్వీర్ కి మాత్రమే సాధ్యం.
అతను తన గన్ ని సీక్రెట్ డ్రాయర్ లో పెట్టి, పైన ఒక ఖరీదైన పెన్ పెట్టుకుని ఆఫీస్ నుంచి బయలుదేరాడు.
సాయంత్రం అనిత కాలేజీ ఫంక్షన్ లో రణ్వీర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు.
అక్కడ ఉన్న వేలాది మంది విద్యార్థులు రణ్వీర్ సామ్రాట్ ని ఒక హీరోలా చూస్తున్నారు. రణ్వీర్ స్టేజ్ మీద నిలబడి కష్టపడండి,
విజయం మీ వెంటే వస్తుంది అని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తుంటే,దేవి గారు స్టేజ్ కింద కూర్చుని తన కొడుకుని చూసి గర్వపడుతోంది.
రణ్వీర్ కి తెలుసు, తన తల్లి నవ్వు కోసం తాను ఏ యుద్ధానికైనా వెళ్తాడు, కానీ ఆ యుద్ధం నీడ కూడా తన ఇంటి మీద పడకుండా చూసుకుంటాడు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రణ్వీర్ క్రియేట్ చేసుకున్న ఈ రెండు ప్రపంచాలు (బిజినెస్ & మాఫియా) ఒక్కటి కాబోతున్నాయి. ఆ కలిసే పాయింట్ దగ్గరే ఒక తుఫాను ఎదురుచూస్తోంది.
కొనసాగుతుంది…………..
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని సమీక్ష ద్వారా తెలియజేయండి. అలాగే కొత్తగా స్టోరీ చదివే వాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి……..
Swipe left/right or tap the sides to turn pages