ఎవరిది ప్రేమ? – 4
రాఖీ క్లాస్ లోకి వచ్చి ఒక బెంచ్ లో కూర్చుని, తన పక్కన వాళ్ళని పరిచయం చేసుకుంటాడు..తర్వాత క్లాస్ లో ఉన్న వాళ్ళందరిని ఒకసారి చూస్తూ ఆద్యని చూశాక ఒక సెకన్ పాటు అలానే చూసి,వెంటనే తల తిప్పేసి క్లాస్ వినే పనిలో పడ్డాడు….
ఆద్య పాప ముందు నుండే క్లాస్ వినడంలో ఫుల్ లీనం అయిపొయింది లెండి..ఏం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు….
క్లాస్ లో ఉన్న అమ్మాయిలు మాత్రం రాఖీ అందానికి ఫ్లాట్ అయి పోయి క్లాస్ వింటున్నట్టు నటిస్తూ రాఖీ కి సైట్ కొడుతున్నారు.అది చూసి మిగిలిన అబ్బాయిలు ఏడుపు మొహాలు పెట్టారు..
అలా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు సాయంత్రం వరకు…
ఈవ్నింగ్ కాలేజ్ టైమ్ పూర్తయ్యేవరకు ఆద్య బేబీ అన్నీ క్లాస్సేస్ శ్రద్దగా విని ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేస్కుని క్లాస్సేస్ అయిపోయాక ఒక సారి ల్యాబ్ కి వెళ్లి అక్కడ ప్రొఫెసర్స్ చేసే ఎక్స్పర్మెంట్స్ ని గమనిస్తూ వాటి గురించి తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఒక గంట పాటు కాలం గడిపింది….
తరువాత కాలేజ్ బస్ లో ఇంటికి వెళ్ళిపోయింది…..
సరిగ్గా ఆద్య ఇంటికి వెళ్లిన సమయంలోనే పొలం నుండి వివేక్ రావడంతో ఇద్దరు ఒకసారే ఎవరి గదుల్లో వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చుని ఆ రోజు కాలేజ్ లో జరిగిన వాటన్నిటి గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు…
వసుధ వేడి వేడి పకోడీలు, టీ తీసుకుని వాళ్ళ దగ్గరకి వస్తుంది..ముగ్గురు కూర్చుని టీ తాగుతూ పకోడీలు తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేస్తారు…..
కాసేపు అలా మాట్లాడుకున్నాక వసుధ, ఆద్య నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్లగా,వివేక్ తన ఫ్రెండ్ ని కలిసొస్తానని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు….
ఒక గంట తర్వాత కిచెన్ లో వసుధ, ఆద్య లు వండినవన్నీ టేబుల్ మీద సర్దేసి ఫేస్ వాష్ చేసుకోడానికి వెళ్తారు….
వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చేసరికి వివేక్ కూడా ఇంటికి రావడంతో ముగ్గురు కలిసి ఊర్లో విషయాలు మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేస్తారు….తిన్న తర్వాత కాసేపు ముగ్గురు అలా బయటకి వెళ్లి చల్ల గాలిలో వాక్ చేస్తారు….
తరువాత ఆద్య పాప బుక్స్ తీస్కుని మేడ మీదకి వెళ్ళిపోతుంది….
వివేక్, వసుధ ఆద్య కి గుడ్ నైట్ చెప్పి త్వరగా పడుకో అర్ధరాత్రి వరకు మేలుకోకు ఆరోగ్యం పాడవుతుంది అని మరీ మరీ చెప్పి వాళ్ళ గది లోకి వెళ్లి పడుకుంటారు….
మేడ మీదకి వెళ్లిన ఆద్య కొద్దిసేపు ఫోన్ లో మ్యూజిక్ విని, తన మైండ్ ఫుల్ ఫ్రెష్ అయ్యాక అప్పుడు బుక్స్ ఓపెన్ చేసి ఆ రోజు క్లాస్ లో చెప్పినవన్నీ రివిజన్ చేసుకుంటుంది….
ఇంక ల్యాబ్ లో తను ఏమేమి చూసింది, ఏ ఫార్ములా ఎలా యూస్ చేయాలి, ఏ వ్యాధి కి ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి అవి ఇవి అంటూ అన్నిటి గురించి నెట్ లో సెర్చ్ చేస్తు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటుంది..
తనకి తెలియని విషయాల్ని నోట్ చేసుకుంటూ,ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎంతో శ్రద్దగా చదువుతూ ఉంటుంది..అలా చదువుతూ చదువుతూనే మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది….
*****
మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు….
అందరు తమ తమ క్లాస్ లకి హడావిడిగా వెళ్తున్నారు….
అప్పుడే ఆద్య కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది…
ఆ టైంలో తన దగ్గరకి ఒక అమ్మాయి వచ్చి ఆద్య నిన్ను ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు అని చెప్తుంది…
దాంతో ఆద్య నన్నా ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారా ఎందుకు అని అడగగా, ఏమోనే నాకు తెలియదు నిన్ను ఆఫీస్ రూమ్ కి రమ్మని చెప్పారు.. సార్ కూడా అక్కడే ఉన్నారు వెళ్ళు అని చెప్తుంది ఆ అమ్మాయి..
అవునా సరేలే… నేను వెళ్లి విషయం ఏంటో కనుక్కుని వస్తాను మీరు క్లాస్ కి వెళ్ళండే అని ఫ్రెండ్స్ తో చెప్పి తను ఒకటే ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది ఆద్య..
అక్కడ ఆఫీస్ రూమ్ లో ప్రిన్సిపాల్ అండ్ ఒక అబ్బాయి ఉన్నారు….
ఆద్య రూమ్ బయట నుండి వాళ్ళని చూసి సార్ దగ్గర ఉన్న అబ్బాయి ఎవరు అనుకుంటూ అంతలోనే ఏమోలే ఎవరైతే నాకేంటి వచ్చిన పని చూసుకుని వెళ్తే చాలు అనుకుంటూ రూమ్ డోర్ దగ్గర నిలబడి మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది వినయంగా..
ఆద్యని చూసిన ప్రిన్సిపాల్ ఎస్ మిస్ ఆద్య కమిన్ అంటాడు చిరునవ్వుతో….
ఆద్య లోపలకి వెళ్లి సార్ ఎదురుగా నిల్చుని సార్ నన్ను పిలిచారంట అని అడుగుతుంది చిన్నగా..
హా ఆద్య నీతో కాస్త మాట్లాడడానికి పిలిచాను అని అంటాడు ప్రిన్సిపాల్ …
continued…
Swipe left/right or tap the sides to turn pages