మై మాఫియా డాన్ – 1
చికాగో నగరం రాత్రి 11 గంటలు. ఆకాశం నుండి సన్నని మంచు కురుస్తోంది, కానీ ఆ గడ్డకట్టే చలిలోనూ నగరం నడిబొడ్డున ఉన్న ‘సామ్రాట్ ఇండస్ట్రీస్’ హెడ్ క్వార్టర్స్ 70వ అంతస్తులో వాతావరణం వేడెక్కి ఉంది.
కాన్ఫరెన్స్ హాల్‌లో పదిమంది అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వారంతా ప్రపంచ మార్కెట్‌ను శాసించేవారే, కానీ ఈరోజు వారు ఒక వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. ఆ వ్యక్తి సంతకం లేనిదే ఆసియాలో ఒక్క రూపాయి కూడా కదలదు.
సరిగ్గా 11:11 నిమిషాలకు, హాల్ వెలుపల భారీ బూట్ల శబ్దం వినిపించింది. నలుగురు ఆరడుగుల పైబడిన సెక్యూరిటీ గార్డులు తలుపులు తీసి పక్కకు నిలబడ్డారు.
లోపలికి అడుగుపెట్టాడు రణ్వీర్ సామ్రాట్.
రణ్వీర్ సామ్రాట్ ది మాస్క్ ఆఫ్ బిజినెస్ డార్క్ బ్లూ కలర్ లో టూ-పీస్ సూట్, చేతికి ఆరు కోట్ల విలువ చేసే పటేక్ ఫిలిప్ వాచ్, పదునైన చూపులు.
అతని రాకతో ఆ గదిలో గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. అతను సీట్లో కూర్చున్న తీరులోనే ఒక రాజసం ఉంది.
పది నిమిషాలు ఆలస్యమైంది. ఐయామ్ సారీ, అన్నాడు రణ్వీర్. అతని కంఠస్వరం గంభీరంగా ఉంది.
ఎదురుగా ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ వణుకుతున్న చేతులతో, పర్వాలేదు మిస్టర్ రణ్వీర్.. మేము అర్థం చేసుకోగలం అన్నాడు.
రణ్వీర్ అతని వైపు తీక్షణంగా చూశాడు. బిజినెస్ ప్రపంచంలో ‘రణ్వీర్ సామ్రాట్’ అంటే పంక్చువాలిటీకి మారుపేరు.
ఈ పది నిమిషాల్లో నేను ఒక షిప్పింగ్ యార్డ్ డీల్ క్లోజ్ చేశాను. సో, టైమ్ వేస్ట్ చేయకుండా మేటర్ కి వద్దాం.
కేవలం అరగంటలో, కొన్ని వందల కోట్ల డీల్‌ను తన వైపుకు తిప్పుకున్నాడు. ఎవరూ ఎదురు చెప్పలేకపోయారు.
రణ్వీర్ సామ్రాట్ అంటే బయట ప్రపంచానికి ఒక అపర కుబేరుడు, పారిశ్రామికవేత్త. కానీ, ఆ బిజినెస్ సూట్ వెనుక ఉన్న అసలు రూపం వేరు.
మీటింగ్ ముగియగానే, రణ్వీర్ తన ప్రైవేట్ లిఫ్ట్ ఎక్కి అండర్ గ్రౌండ్ పార్కింగ్ వైపు వెళ్లాడు. అక్కడ అతని నమ్మకస్థుడైన అసిస్టెంట్ సూర్య ఒక స్పోర్ట్స్ కార్‌తో వేచి ఉన్నాడు.
లిఫ్ట్ లో ఉండగానే రణ్వీర్ తన టైని వదులు చేసి, కోటు విసిరేశాడు. వాడు ఎక్కడ? అని అడిగాడు. అతని గొంతులో ఇందాకటి గౌరవం లేదు, ఇప్పుడు వినిపిస్తున్నది ఒక క్రూరమైన స్వరం.
సార్, మన షిప్‌మెంట్ ఆపిన లోకల్ గ్యాంగ్ లీడర్ జైలర్ గ్యారేజ్ లో ఉన్నాడు,అన్నాడు అసిస్టెంట్.అతనికి నా పేరు తెలుసా? అని అడిగాడు రణ్వీర్.
మీ పేరు రణ్వీర్ సామ్రాట్ అని తెలుసు సార్, కానీ మీరు రానా అని వాడికి తెలియదు. రణ్వీర్ పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది.
ఈ ప్రపంచానికి నేను రణ్వీర్ సామ్రాట్‌ని. కానీ నన్ను ఎదిరించిన శత్రువుకి మాత్రం నేను రానా ను. మృత్యువు కంటే భయంకరాం ఇ రానా….కారు చీకట్లోకి దూసుకెళ్లింది.
ఒక పాత గ్యారేజ్ లోపల సుమారు ఇరవై మంది ఆయుధాలతో ఉన్నారు. వారి మధ్యలో రణ్వీర్ సామ్రాట్ పంపిన సరుకును అడ్డుకున్న లోకల్ డాన్ నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే కారు టైర్ల శబ్దం వినిపించింది.
రణ్వీర్ కార్ దిగి నేరుగా లోపలికి నడిచాడు. సెక్యూరిటీ ఎవరూ లేరు, అతను ఒక్కడే వచ్చాడు.ఎవడ్రా నువ్వు? అని అరిచాడు ఒక రౌడీ.
రణ్వీర్ ఏమాత్రం ఆగకుండా వాడి దగ్గరికి వెళ్లి, ఒకే దెబ్బతో వాడి దవడ పగిలేలా కొట్టాడు. వాడు కింద పడేలోపే ఇంకో ఇద్దరిని గాల్లోకి లేపి విసిరేశాడు. రానా కళ్ళలో ఇప్పుడు ఒక క్రూరమైన చూపు ఉంది.
మిగిలిన పదిహేను మంది రణ్వీర్ మీదకు దాడికి వచ్చారు. రణ్వీర్ కు యుద్ధం చేయడం అనేది ఒక కళ. అతను దెబ్బ కొడితే ఎముక విరగాల్సిందే.
రక్తం చిందుతుంటే అతను ఆస్వాదిస్తున్నాడు. ఐదు నిమిషాల్లో గ్యారేజ్ అంతా శవాల దిబ్బలా మారింది.
చివరికి ఆ లోకల్ డాన్ కాలర్ పట్టుకుని గాల్లోకి లేపాడు.
నన్ను వదిలేయ్, రణ్వీర్ సామ్రాట్ గారు ఏదో తెలియక చేశాను అని వాడు ప్రాధేయపడ్డాడు.రణ్వీర్ వాడి చెవి దగ్గరికి వెళ్లి మెల్లగా అన్నాడు, బయట ప్రపంచానికి నేను రణ్వీర్ సామ్రాట్ ని. కానీ నీ చావు ముఖం మీద రాసి ఉన్న పేరు రానా.
ఆ మాట వినగానే వాడి కళ్ళలో వణుకు మొదలైంది. రానా అనే పేరు అండర్ వరల్డ్ లో ఒక వెలుగు వెలిగే నిప్పు కణం. ఎవ్వరూ అతన్ని చూడలేదు, కేవలం అతని పేరు వింటేనే గడగడలాడిపోతారు.
మరుక్షణమే గ్యారేజ్ లో ఒక తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. రానా తిరిగి తన కారు దగ్గరికి వెళ్లాడు. అసిస్టెంట్ తడి టవల్ ఇచ్చాడు. రానా తన చేతులకు ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ తిరిగి బిజినెస్ మాన్ లా మారిపోయాడు.
తిరిగి తన పెన్ హౌస్ కి చేరుకున్న రానా, బాల్కనీలో నిలబడి నగరాన్ని చూస్తున్నాడు. చేతిలో ఒక ఖరీదైన వైన్ గ్లాస్ ఉంది.
ప్రపంచం నన్ను గౌరవిస్తుంది, శత్రువు నన్ను చూసి వణుకుతాడు. రణ్వీర్ సామ్రాట్ అయినా, రానా అయినా, ఈ సామ్రాజ్యం నాది,అని తనలో తాను అనుకున్నాడు.
అప్పుడే అతని ఫోన్ మోగింది. ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది.నీ సామ్రాజ్యం కూలిపోయే సమయం దగ్గర పడింది, రానా…….
రానా కళ్లు చిన్నగా మెరిశాయి. ఎందుకంటే సవాలు అంటే అతనికి ప్రాణం. ఈ ఆట ఇప్పుడే మొదలైంది…..
కొనసాగుతుంది……….
హాయ్ అందరికీ ఇది నా కొత్త స్టోరీ…… ఇంతకుముందు రాసిన స్టోరీస్ లాగే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.అలాగే కొత్తగా స్టోరీస్ చదివే వాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి…..
Swipe left/right or tap the sides to turn pages