New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 3

మై మాఫియా డాన్ – 3

అప్పుడే అతని ఫోన్ మోగింది. ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది.నీ సామ్రాజ్యం కూలిపోయే సమయం దగ్గర పడింది, రానా…….

రానా కళ్లు చిన్నగా మెరిశాయి. ఎందుకంటే సవాలు అంటే అతనికి ప్రాణం. ఈ ఆట ఇప్పుడే మొదలైంది…..
                     *************
అప్పుడే సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. సార్, లోకల్ గ్యాంగ్ లీడర్ మార్కస్ తన అనుచరులతో అల్లా విటా లో వైట్ చేస్తు ఉన్నాడు. మిమ్మల్ని కలవాలని పట్టుబడుతున్నాడు.
రానా తన గ్లాసులోని డ్రింక్ పూర్తి చేసి, గన్ హోల్స్టర్‌ని సరిచేసుకుంటూ, వాడు పిలిస్తే వెళ్లడానికి నేను రౌడీని కాదు సిద్ధార్థ్. ఈ చికాగో నగరాన్ని శాసించే సామ్రాట్ ని. వాడిని ఇక్కడికే రమ్మను అన్నాడు.
ఒక అరగంట తర్వాత మార్కస్ తన ఐదుగురు బాడీగార్డ్స్‌తో లోపలికి వచ్చాడు.మిస్టర్ రణ్వీర్, ఇది చికాగో. 
ఇక్కడ మా పర్మిషన్ లేనిదే నీ షిప్స్ అడుగు పెట్టడానికి వీల్లేదు, అని మార్కస్ గర్వంగా అన్నాడు.రానా ఒక్క అడుగు ముందుకేసి, మార్కస్ కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. 
మార్కస్, నేను బిజినెస్ చేసేటప్పుడు సూట్ వేసుకుంటాను. కానీ నా బిజినెస్ కి అడ్డు వస్తే మాత్రం.. ఆ సూట్ ని నీ రక్తంతో తడిపేస్తాను. ఈ నిమిషమే నా షిప్స్ క్లియర్ అవ్వాలి.. లేదంటే రేపు ఉదయం చికాగో నదిలో నీ శవం తేలుతుంది.
అయినా సరే ఫస్ట్ వెనక్కి తగ్గకపోవడంతో వచ్చిన అనుచరు లు కొంతమందిని  షూట్ చేశాడు. వాళ్ళు స్పాట్ లోనే చనిపోయారు.
రానా కంఠంలో ఉన్న గంభీరతకు మార్కస్ వెనక్కి తగ్గాడు. చికాగోలో ఉండి కూడా రానా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, అతని వెనుక ఉన్న పవర్ ఏంటో మార్కస్ కి అర్థమైంది. వెంటనే ఫోన్ చేసి షిప్స్ ని క్లియర్ చేయించాడు.
గుడ్.. ఇప్పుడు నా ప్రయాణం ఇండియాకు. అక్కడికి వెళ్ళాక కూడా నన్ను డిస్టర్బ్ చేయకు,అని రానా వార్నింగ్ ఇచ్చి తన ప్రైవేట్ జెట్ వైపు బయలుదేరాడు.
తన ప్రైవేట్ జెట్ లో ప్రయాణిస్తున్నప్పుడు రానా మనసులో ఇండియాలో జరుగుతున్న పరిణామాలే ఉన్నాయి. చికాగోలో ఉన్నా, అతని కళ్ళు ఎప్పుడూ హైదరాబాద్ మీదనే ఉంటాయి.
సార్, మీరు ఇండియాకి వెళ్తున్నట్టు సమాచారం లీక్ అయ్యింది. మన శత్రువులు ఎయిర్‌పోర్ట్ దగ్గరే మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది, అని సిద్ధార్థ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
రానా నవ్వుతూ, సిద్ధార్థ్, వేటగాడు తన అడవికి వెళ్తున్నాడు. అక్కడ వాళ్లేం చేసినా అది ఆ వేటగాడికి అనుకూలం. 
ఇండియాలో రానా అంటే ఏంటో మర్చిపోయినట్టు ఉన్నారు ఆ శత్రువులకి ఇంకా గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది, అన్నాడు.
అర్ధరాత్రి రెండు గంటలు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రైవేట్ టెర్మినల్‌లో రానా జెట్ ల్యాండ్ అయ్యింది. రానా విమానం దిగి కిందకు రాగానే పది బ్లాక్ కార్స్  అతని కోసం వేచి ఉన్నాయి.
కానీ రానా నేరుగా కారు ఎక్కలేదు. చుట్టూ ఉన్న చీకటిని గమనించాడు. కొంత దూరంలో ఉన్న చెట్ల వెనుక నుంచి గన్ బారెల్స్ మెరుస్తున్నాయి.
సిద్ధార్థ్ లైట్స్ ఆఫ్ చేయండి, రానా ఆర్డర్ ఇచ్చాడు.
ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ లైట్స్ ఆగిపోయాయి. అంతా చీకటి. శత్రువులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 
వాళ్ళు రానా కారు మీదకు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కానీ రానా ఆ కారులో లేడు.రానా చీకట్లో నిశ్శబ్దంగా శత్రువుల వెనుకకు వెళ్లాడు. 
అతని చేతిలో ఉన్న సైలెన్సర్ గన్ పేలుతోంది. ఒక్కొక్కడు శబ్దం చేయకుండా కింద పడిపోతున్నారు. రానా కదలికలు ఒక నీడలా ఉన్నాయి.
ఐదు నిమిషాల్లో పది మంది శత్రువులను రానా మట్టుబెట్టాడు. చివరిగా ఒకడిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నాడు.
వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి, ఎవరు పంపారురా నిన్ను?” అని అడిగాడు రానా.
అది.. అది.. ‘ది బ్లాక్ ఈగల్’ సార్.. వాళ్లు మిమ్మల్ని ఇక్కడే అంతం చేయాలనుకున్నారు, అని వాడు వణుకుతూ చెప్పాడు.
రానా వాడిని వదిలేసి, తన గన్ క్లీన్ చేసుకుంటూ, బ్లాక్ ఈగల్ కి నా తరపున ఒక గిఫ్ట్ పంపాలి. నా రాక గురించి వాళ్లకు ఈ రాత్రే తెలియాలి,అన్నాడు.
రానా తన సెంట్రల్ ఆఫీస్‌కి చేరుకున్నాడు. అక్కడ ఉన్న భారీ స్క్రీన్ మీద హైదరాబాద్ నగరం మ్యాప్ కనిపిస్తోంది.
సిద్ధార్థ్, నగరంలో ఉన్న ప్రతి బ్లాక్ ఈగల్ అడ్డా మీద ఈరోజే దాడి జరగాలి. వాళ్ళు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి. 
ఈ సిటీలో రణ్వీర్ సామ్రాట్ మళ్ళీ అడుగుపెట్టాడని, రానా వేట మొదలైందని ప్రతి ఒక్కరికీ తెలియాలి, అని గర్జించాడు.
తెల్లవారుజాము అవుతోంది. రానా తన ఇంటి బాల్కనీలో నిలబడి సూర్యోదయాన్ని చూస్తున్నాడు.
చికాగో అయినా, చైనా అయినా.. ఈ రానా కి తిరుగులేదు. కానీ సొంత గడ్డ మీద నన్ను ఎదిరించిన వాడికి మాత్రం నరకం ఇక్కడే కనిపిస్తుంది, అని తనలో తాను అనుకున్నాడు.
హైదరాబాద్ శివారులోని ఒక రహస్య కమాండ్ సెంటర్. బయట వర్షం కురుస్తోంది, కానీ లోపల రణ్వీర్ సామ్రాట్ అలియాస్ రానా కళ్ళలో కోపాగ్ని రగులుతోంది. 
రానా ఎదురుగా సిద్ధార్థ్ మరియు అతని టీమ్ వణుకుతూ నిలబడి ఉన్నారు.
గంట అవుతోంది సిద్ధార్థ్.. ఆ మెసేజ్ పంపిన సర్వర్‌ను హ్యాక్ చేయమని చెప్పి గంట అవుతోంది. నాకు రిజల్ట్ కావాలి, రానా గొంతులో హెచ్చరిక ధ్వనించింది.
సిద్ధార్థ్ వంగి, సార్ వాడు చాలా తెలివైన వాడు. ప్రతి పది నిమిషాలకు ఐపి అడ్రస్ మారుస్తున్నాడు. కానీ ఇప్పుడే ఒక లొకేషన్ ఫిక్స్ అయ్యింది. 
అది ఎక్కడి నుంచో కాదు,మన పాత షిప్పింగ్ యార్డ్ సామ్రాట్ ఎక్స్‌పోర్ట్స్ ఏరియా నుంచి వస్తోంది అని అన్నాడు.
రానా కళ్లు మెరిశాయి. ఆ యార్డ్ ఐదేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ వల్ల మూతపడింది. అక్కడి నుంచి సిగ్నల్ వస్తుందంటే, శత్రువు రానా పాత సామ్రాజ్యంలోనే తిష్ట వేశాడని అర్థం.
రానా చిన్నగా నవ్వుకునే పైకి లేచి నుంచున్నాడు…….
                  కొనసాగుతుంది…………
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని సమీక్ష ద్వారా తెలియజేయండి. అలాగే కొత్తగా స్టోరీ చదివే వాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి………