నల్లటి స్కార్పియో కార్ గమ్యం తెలియకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై దూసుకుపోతోంది. కారు వెనుక సీట్లో ఇద్దరు రౌడీల మధ్య సాహిత్య కూర్చుని ఉంది. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయి, నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. ముందు సీట్లో చైర్మన్ రాజశేఖర్ చాలా గంభీరంగా ఫోన్ మాట్లాడుతుండగా, పక్కన కిరణ్ ముఖంలో గర్వంతో ఊగిపోతున్నాడు. సాహిత్య కళ్లలో ఇందాకటి వరకు ఉన్న భయం మెల్లమెల్లగా పోయి, ఆమె మైండ్ మళ్లీ యాక్టివ్ అయింది. “ఈ ముసలి చైర్మన్ గాడు, ఆ తింగరి కిరణ్ గాడు నన్ను కిడ్నాప్ చేస్తారా? నన్ను దాచడం మీ తరం కాదురా.. ఇప్పుడు చూడండి నా చిలిపి తడాఖా!” అని మనసులో అనుకుంది.