Mr. విలన్ – 1
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా!!
ఓం నమశ్శివాయ!
కథలోకి వెళ్ళిపోదాం…
చాలా మత్తుగా అనిపించి బెడ్ మీద పడుకున్నాను.
ఏవో రకరకాల సౌండ్లు అన్ని వినిపిస్తున్న కూడా కళ్ళు తెరవాలని అస్సలు అనిపించడం లేదు.
అంతకు అంతకు దిండు ని ఇంకా హత్తుకు పోతూ దానిమీద కాలు చేయి వేసుకొని పడుకున్నా.
కానీ మెత్తగా ఉండాల్సిన పిల్లో గట్టిగా తగులుతూ ఉండడంతో ఏమైందబ్బా అని ముక్కు రుద్దుకుంటూ కళ్ళు తెరిచేసరికి భయంతో నాకు ముచ్చమటలు పట్టేసాయి.
అమ్మో అప్పటినుండి దిండు అనుకొని తెగ కాళ్లు చేతులు వేసేసాను ఈయననా అని మైండ్లో అనుకుంటుంటే ఆల్మోస్ట్ బాడీ మొత్తం షేక్ అయిపోయింది.
దేవుడా! కృష్ణయ్య! కాపాడు స్వామి ఎలాగోలాగా లేసేంతవరకు ఈయనకి మెలకువ రాకుండా చూడు తండ్రి అంటూ, మెల్లిగా ఆయన మీద నుండి చేయి కాలు తీసేసి జాగ్రత్తగా రెండు చేతులు వెనక్కి పెట్టే లోపు కొంచెం కదిలిన ఆయన నా నడుం మీద నుండి వెన్నువరకూ చేయి పాకించి దగ్గరికి లాక్కున్నాడు.
ఈసారి నాకు స్పృహలో ఉండగానే నా పరువాలన్నీ ఆయన చాతికి ఒత్తుకు పోతుంటే పిలవకుంటే ఊపిరి ఆడకుండానే చంపేస్తాడేమో అని భయం పిలిస్తే ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని చంపేస్తాడేమో అన్న భయం.
అందరికీ ముందు నుయ్యి వెనక గొయ్యి ఉంటే నాకు నువ్వు గొయ్యి రెండు ముందే ఉన్నట్లు అనిపించింది ఎలాగైనా చావడం కన్ఫామ్ అని నాకర్థం అయిపోయింది.
అంతలో,
మనం చూస్తున్నట్లయితే ఒక అమ్మాయిని కెమెరాల ముందే ఇంత అసభ్యకరంగా ముట్టుకుంటూ హత్తుకుంటూ మీదకి లాక్కున్న ఇతడికి ఏ శిక్ష పడాలి!
అన్నం పుణ్యం ఎరుగని ఒక అమ్మాయిని ఇంతలా వాడుకుంటున్నాడా ఈ మనిషి?
ఇతడి ఖాతాలో ఈ అమ్మాయి ఒక్కటే ఉందా లేదా ఇలాంటి అభాగ్యులు ఎందరో ఉన్నారా అని వినిపిస్తున్న మాటలకి అప్పటివరకు ఆయన నుండి తప్పించుకోవాలి అని చూస్తున్న నేను తలని అదే రూమ్లో మూలలకి తిప్పేసరికి,
టీవీలో మనం చూస్తామే మైకులు పట్టుకొని క్వశ్చన్లు అడుగుతుంటారు, మళ్లీ కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటారు పెన్ను పేపర్ పట్టుకొని ఏదో రాస్తుంటారు వాళ్ళందరూ ఆ బెడ్ రూమ్ లో ఉండేసరికి ఈసారి నాపై ప్రాణాలు పైకే పోయాయి.
ఈయన ఏమో నా చేయి వదలడం లేదు వీళ్లేమో నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు అనుకుంటూ ధైర్యం చేసి చంపితే చంపాడు ఈయన లేస్తే అంతా చూసుకుంటాడు అని ధైర్యం తెచ్చుకొని ఆయన చెంప మీద తడుతూ మాటలు రాక చేష్టలతోనే నేను పిలుస్తుంటే ఇందాక కదిలిన కదలిక కూడా లేదు ఆయనలో.
వీళ్లేమో, ఇందాక అభాగ్యురాలు అని అప్పుడే కొంచెం ముఖం చూస్తుంటే కాల్ గర్ల్ అని అర్థం అవుతోంది ఎంత తీసుకొని ఇలాంటి రూమ్స్ లోకి వస్తోందో ఈ అమ్మాయి ఇంకా అమ్మాయి ఏంటి వ్యభిచారి! అని వాళ్లందరూ మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
కానీ ఈ నా చెంప పెట్టడం ఆపడం లేదు ఆయనేమో మెలుకువలోకి రావడం లేదు.
అంతలో ఒక ఆడ పోలీస్ వచ్చి నా రెడ్డ పట్టుకొని విసురుగా బెడ్ మీద నుండి లేపి చేయి చేసుకుంది.
అప్పటికే నాకు కన్నీళ్లు జలజల కారిపోతుంటే ఇంకో మగ పోలీస్ వచ్చి బెడ్ మీద ఉన్న ఆయన కాలర్ పట్టుకుని లేపి వాటర్ బాటిల్ ఫోర్స్ గా ఆయన ముఖం మీదకి కొట్టారు.
నాకు పెదవి చిట్లి రక్తం కారుతుంటే ఆయన మాత్రం నిద్రమత్తులో అలా ఊగుతూ ఉన్నారు నాకైతే ఎంత భయమేసిందో ఈ మనిషి ఎప్పుడూ ఇంత మొద్దు నిద్ర పోడు కదా అనుకుంటుంటే మా ఇద్దరిని పోలీసులు బెడ్ రూమ్ నుండి బయటికి తీసుకొచ్చి, అపార్ట్మెంట్లో లిఫ్ట్ బదులు స్టెప్స్ మీద నుండి తీసుకెళ్తుంటే అందరూ మా వైపు చూస్తున్నారు.
నన్ను పోలీస్ జీప్ లోకి ఎక్కించి ఆయనని నా మీదికి తోచినట్లుగా పడేశాడు పోలీసోడు.
జీప్ పోలీస్ స్టేషన్ ముందు ఆగేసరికి మళ్ళీ మమ్మల్ని లోపలికి తీసుకువెళ్తే అక్కడ లాయర్స్ వాళ్లందరూ ఉన్నారు నాకైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
ఆయనేమో అసలు ఈ లోకంలో లేనట్లు తూగుతున్నారు ఊగుతున్నారు.
అంతలో ఒక లాయర్ వచ్చి నా భుజం మీద నుండి చేయి వేసి కిందకి నీ మురుతు చిన్నపిల్లవి లాగా ఉన్నావు చూడటానికి కానీ విషయం చాలానే ఉంది వాడితో రాత్రంతా బాగానే.. అంటూ ఇంకొక పచ్చి బూతు మాట్లాడేసరికి ధైర్యం తెచ్చుకున్న నేను నేను అలాంటి దాన్ని కాదండి, నేను ఆయన పనిమనిషిని అని చెప్పాను తలదించుకొని.
పని మనిషివా లేదంటే పనితనం చూపించే మనిషివా అని అనగానే కోపంతో చూద్దాం అనుకునే లోపు నా కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి!!
అసలు స్టార్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు!
కానీ వినాయక చవితికి కొత్త స్టోరీ ఇవ్వాలనిపించింది.
గణపయ్య ప్లీజ్ ఈ స్టోరీ కి ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను అనుకున్నట్లు రాయడానికి ధైర్యం ఇవ్వు ప్లీజ్…
స్టోరీ గురించి ఏం అర్థమైంది?
హీరోయిన్ ప్రొఫెషన్ బాగుందా?
టైటిల్ నచ్చిందా?
Continues…..
Swipe left/right or tap the sides to turn pages