New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Mr. విలన్ – 2
Mr. విలన్ 3 min read

Mr. విలన్ – 2

..అందరికీ నమస్కారం. 

అమ్ము అమ్ము..
నాన్నకి మందులు అయిపోయాయి అమ్మ, ఇంకా నేను పని చేసే చోట కూలి డబ్బులు రాలేదు మరి ఈనెల నెట్టుకు రావడం ఎలా అంటూ మా అమ్మ అడుగుతుంటే కళ్ళు మూసుకొని తెరిచి సర్లే మా నేను మా సార్ ని కొంచెం డబ్బులు సర్దమని అడుగుతాను అన్నాను లోపల భయపడుతూనే. 
మా అమ్మేమో నా చెంప నిమిరి వయసులో ఉన్న పిల్లవి, ఇలా నిన్ను చూడలేకపోతున్నానే, మన బతుకు ఎప్పుడు బాగుపడుతుందో అని ఫ్రీగా వచ్చే నాలుగు కన్నీటి బొట్లు కార్చేసి తన పనికి వెళ్లిపోయింది. 
ఒక చెల్లెలేమో అక్క ఈ యూనిఫామ్ కుట్టి కుట్టి ఇంకా బొక్కలు ఎక్కువ పడుతుంది తప్ప వేసుకోవడానికి అస్సలు పనికి రావడం లేదు. ఈనెల అయినా కొత్త యూనిఫామ్ కుట్టియ్యవా అని అడుగుతుంటే దానికి కూడా సరే అని చెప్పా. 
ఇది చిన్న చెల్లి నాకు ఇంకో పెద్ద చెల్లి కూడా ఉంది, 
అది మాత్రం ఇప్పుడు ఇంటర్ ఒకటో సంవత్సరం చదువుతోంది. 
నాలాగా కాదు! 
నాకంటే బొట్టు అక్షరం రాదు కానీ అది టెన్త్ క్లాస్ లో మా గవర్నమెంట్ స్కూల్లో రెండవ స్థానంలో వచ్చింది అని పట్టుబట్టి ఇంగ్లీష్ మీడియం కాలేజ్ లోనే చదవాలి అంటే మా అమ్మ నేను పెద్దమనిషి అయినప్పుడు కొన్న కమ్మలు, తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చి ఇంగ్లీష్ మీడియం కాలేజీలో జాయిన్ చేసింది. 
ఇంకా మా నాన్న. 
ఆయన ఏ పని చేయలేరు కనీసం తన పని తాను కూడా. 
పక్షవాతం వచ్చి మంచంలో పడ్డారు నాకు ఊహ తెలిసినప్పటినుండి ఆయన అంతే ఉన్నారు అమ్మ ఇంతే కష్టపడుతోంది. 
అమ్మకు పని చేసి చేసి ఒంట్లో ఓపిక లేదు చెల్లెళ్లు ఇద్దరు చదువుకుంటున్నారు నాన్న ఏమో మంచంలో ఉన్నాడు ఇక కాళ్లు చేతులు బాగుండి ఆ ఇంటిని చూసుకోవాల్సింది నేనే కాబట్టి నా పనికి, రెడీ అయిపోతూ మా చిన్న దానికి రిబ్బన్ జడలు కట్టేసి మా చిన్న ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ వైపు కదిలాను. 
రెండు కిలోమీటర్లు అరగంటలో చేరిస్తూ ముందు కింద ఫ్లోర్ లోకి వెళ్ళబోతుంటే బాల్కనీ లో నుండి ఏ అన్న పిలుపు వినిపించేసరికి లోపలికి పోకుండా బయటే ఆగి తల పైకెత్తాను. 
పొద్దున్నే సూర్యుడు బగ్గుమంటూ రగులుతున్నాడు అందుకే మనిషి కనపడగా కంటికి చేయి అడ్డం పెట్టుకుంటే నన్ను పిలిచిన మనిషి ముఖం ఆ సూర్యుడి కంటే ఎర్రగా మండుతోంది. 
నేను భయంగా ఆ మనిషి వైపు చూసి తలదించుకునే లోపు బయటకు వెళ్లాలి ఫాస్ట్ గా రా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోగానే లిఫ్ట్ లోకి దూరిన నేను ఫస్ట్ ఫ్లోర్ బటన్ కాకుండా అపార్ట్మెంట్ పదకొండు అంతస్తులు ఉంటుంది కాబట్టి 11 నెంబర్ బటన్ నొక్కి వణుకుతూ లిఫ్ట్ తెరుచుకునే వరకు మూలన నించున్న.
ఫ్లాట్ నెంబరు 111. 
కాలింగ్ బెల్ కొట్టే పని లేకుండా వాకిలి తెరిచే ఉండడంతో లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటే, నీ వెనక ఏమైనా ఐశ్వర్యరాయ్ వస్తుందని డోర్ ఓపెన్ లో ఉందా ఫాస్ట్ గా వచ్చి పని చూడు అని విసుగ్గా చెప్పిన నల్ల కట్ బనియన్ వేసుకున్న ఆయన చెప్పగానే బెదురుతూ కుడికాలు లోపల పెట్టి మూలన ఉన్న చీపురు చేతబట్టాను. 
అబ్బా ఇల్లంతా ఎక్కడ చూసినా కూడా సిగరెట్టు పీకలు దాని నుంచి వచ్చిన బూడిదనే ఉంది అనుకుంటూ నా చున్ని ముక్కుకి అడ్డం పెట్టుకొని, రెండు బెడ్ రూములు ఒక పెద్ద హాలు కిచెన్ బాల్కనీ ఉన్న ఆ ఇంటిని చిమ్మే పని స్టార్ట్ చేశా. 
ఏయ్ రూమ్ అంతా స్టిక్కీగా ఉంది మోప్ పెట్టు అని అన్న ఆయన గారి వాయిస్ కి తల ఎత్తకుండానే సరే అన్నట్టు తల ఊపి, తడి బట్ట ఇల్లంతా పెడుతుంటే ఒకతను లోపలికి వచ్చి ప్రతాప్   అన్న అని పిలుస్తుంటే, 
ఇందాక కట్ బనియన ఉన్న మనిషి ఇప్పుడు అది కూడా లేకుండా కండలు చూపిస్తూ నల్ల ప్యాంట్ మీద బయటికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని తడి బట్ట వేస్తున్న నా వైపు అంతే చూసాడు. 
బిక్క చచ్చిపోయిన నేను, 
డ్రెస్ నుండి ఏమైనా కనబడుతోందా? ముందర బాలేదా ఇబ్బందిగా ఏమైనా ఉందా అని కూర్చోనే నా పాత డ్రెస్ ని సర్దుకుంటుంటే చూపులు తిప్పేసిన ఆయన వచ్చిన మనిషిని తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. 
బురద చెప్పులతో,  వచ్చిన అతను తుడిచింది మొత్తం నాకు రెండో పని పెట్టేలాగా ఉంటే బురదతో పాటు ఎర్రటి మరకలు కూడా కనిపించి మూసుకున్న వాకిలి వైపే అంతే చూస్తూ ఉన్నా..
ప్రతాప్ ఎవరు? 
హీరోయిన్ చేస్తున్న పని ఏంటి ఈ ప్రొఫెషన్ నా స్టోరీస్ లో ఇంతవరకు ఎప్పుడూ లేదు కదా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం!!
స్టోరీ మీకు నచ్చుతుందా? 
Continues….