New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Mr. విలన్ – 3
Mr. విలన్ 3 min read

Mr. విలన్ – 3

ఎస్ల్త మాప్ పెడుతున్న నాకు ఆ వచ్చిన మనిషి లోపలికి వెళ్తుంటే బురద కాళ్లతో పాటు ఎర్రగా కూడా కనబడి ముందు రక్తం ఏమో అని అనుమానం వచ్చింది. 

కానీ చిచి ఏదో పెయింటింగ్ అయి ఉంటుంది లే అని నాకు నేనే సర్ది చెప్పుకొని ఆల్రెడీ తుడిచేసినా కూడా మళ్లీ ఆ బురద తుడుదామని ఒక్కొక్క అడుగు తుడుచుకుంటూ వెళుతుండేసరికి ఈసారి ఇంకా చిక్కటి ఎరుపుదనం కనిపించి గుండెలు అదిరిపోయాయి. 
ఆ అడుగుల మీద చూపుడువేలు పెట్టి రక్తాన్ని వేలితో తీసుకొని దగ్గరగా చూస్తే తప్ప అది నిజమైన రక్తం అని నాకు అనిపించలేదు. 
అమ్మో రక్తం అని కళ్ళు తిరిగి పడబోయాను నిజానికి నాకు బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి పైగా ఎక్కువ చూసానంటే ఇంకా స్పాట్లో స్పృహ తప్పి పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. 
ఇప్పుడు ఆ స్మెల్ కి కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటే నా ఒంటిమీద సోయ లేకుండా నేనే పక్కకి పడిపోతుంటే రెట్ట పట్టుకొని పైకి లేపారు ఒకరు. 
కర్ణ అని అంటున్న ఆ ప్రతాప్ గారి మాటలు నా చెవుల్లో వినబడుతుండగానే కళ్ళు మూసేశాను. 
తర్వాత ఏమైందో నాకు తెలియదు వెన్ను కింద మెత్తగా తగులుతుంటే బెడ్ అనుకున్నాను కానీ కళ్ళు తెరిచి చూసేసరికి మసకగా ఒక మనిషి రూపం కనిపిస్తోంది పైగా అతడు సిగరెట్ కూడా కాలుస్తూ ఉండడంతో మళ్లీ రక్తం చూసి కళ్ళు తిరిగాయి అనుకుంటూ భయం భయంగా లేచి నిలుచుండబోయే అంతలో స్టాప్ అని అరవడంతో ఈసారి గుండె ఆగిపోయినట్లే అనిపించింది నాకు. 
ఏమైందా అని ఒక చెయ్యి గుండెల మీద వేసుకొని ఆయన వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే కోపంగా పక్కకి చూసి క్లినిట్ అగైన్ అండ్ లీవ్ అని ఆయన చెప్పగానే క్లీన్ అంటే అర్థమయ్యింది లీవ్ అంటే అని అర్థం కాక చూస్తుంటే, 
అన్న అన్న నేను చెప్తాను నువ్వు ఆవేశ పడకు అంటూ ప్రతాప్ గారిని లోపలికి తీసుకువెళ్లిపోయిన ఇందాక వచ్చిన వ్యక్తి చూడండి మీ పేరు నాకు తెలియదు మీరు ఇక్కడ అంతా కక్కేశారు అందుకే అన్నా పక్కకి నిల్చోదన్నాడు. ఇది కొంచెం క్లీన్ చేసి ఈరోజుకి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని మనిషి చెబుతుండడంతో కళ్ళు పక్కకు తిప్పిన నాకు అమ్మో వద్దులే దాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత తక్కువ. 
చచ్చినట్టు మూడోసారి ఇల్లంతా క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోక కొచ్చింది. 
అయినా సరే మనము ఒకరి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నప్పుడు అప్పనంగా దోచేయలేము అందుకే, రోజులాగే ఆయనకు వంట చేసి వెళ్లిపోదాం అని కిచెన్ లో ఉంటే సడన్గా ఏం చెప్పాం నీకు అని వినిపించిన వాయిస్ కి అటువైపు తిరిగి నూనె పోసి ఆవాలు రేగిన నేను ఉలిక్కిపడి వెనక్కి పడే లోపు బండ లాంటి ఆయన యదా అడ్డొచ్చిందనుకుంటా దానిమీద సేద తీరుతూ పడిపోయా.
ఈసారి అసలు నిర్కర్షగా ఆయనొక అడుగు వెనక్కి వేయగానే తుస్సు మంటూ కింద పడిపోయిన నాకు భూగోళం దద్దరిల్లింది. 
ఒసేయ్ అమ్ము ఈరోజు నీ జాతకం అస్సలు బాగోలేదే అని అనుకుంటుంటే నువ్వు పుట్టినప్పటి నుండే బాలేదులే అని అంతరాత్మ వెక్కిరించింది. 
కర్ణ అని ఆయన గారు మరోసారి అరవగానే అన్న అంటూ వచ్చి స్టిఫ్ గా ఆ మనిషి పక్కన నిలబడిన అతడు నేను ఎల్లమనే చెప్పానన్న తన ఇంకా పోలేదు అనుకుంటా నువ్వు సీరియస్ అవ్వకు నేను పంపిస్తాను అని ఆ మనిషి చెబుతుండగానే మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పేసి డీ ఫ్రీజ్ లో ఉన్న ఐస్ ముక్కల ప్రేయర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ నా వైపు ఒక చూపు చూశాడు. 
ఈసారి ఏకంగా హిమాలయం పర్వతం కింద మిగిలిపోయిన కోడి పిల్లలాగా చున్ని అడ్జస్ట్ చేసుకొని వంట చేసి వెళ్తానండి అని ఆ కర్ణ అనే మనిషికి చెబుతుంటే అన్న వెళ్ళిపోమన్నాడండి మీరు ఇంకొక నిమిషం ఉన్నా కూడా చాలా కోపం వచ్చేస్తుంది ఆ తర్వాత నేను కంట్రోల్ చేయలేను అని అతడు చెప్పగానే బాధగా ఆ ఫ్లాట్లో నుండి బయటపడ్డ నాకు ఆ ఫ్లోర్లో ఉన్న అన్ని ఇళ్లల్లో మనుషులు కిందకి వచ్చాక మనుషులు నన్ను అసహ్యంగా ఇంకొంతమంది మగాళ్లు కొంచెం అదోలా చూస్తున్న కూడా వాటిని పట్టించుకోకుండా ఇంటికి చేరిపోయాను. 
మా నాన్న నా వైపు చూసి అసహ్యంగా ముఖం పెట్టాడు పర్లేదులే ఇదేమి నాకు కొత్త కాదు కదా మొదట్లోనే ఆడపిల్ల పుట్టానని ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం లేదు…
కానీ నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలను మాత్రం కన్నాడు ఇదేం వింతనో ఈ భారత దేశంలో….
ఇప్పుడే చెప్తున్నాను కాదు అడుగుతున్నాను మీరు ఎవరి సైడ్ మీ పాప లేక మా బాబు నా???
స్టోరీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి చదువుతున్నారు కానీ రెండు కామెంట్స్ నే వస్తున్నాయి ఇలా అయితే ఎలా??
Continues……