కొంచెం కూడా ఏదైనా పని చేసే ముందు ఆలోచించవా శ్లోక నిన్ను అలా చూసే సరికి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది……. !! నిన్నీ పరిస్థితో నీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు తట్టుకోగలరా …….. ?? మీ మామ్ కి నువ్వంటే ప్రాణం అలాంటి నిన్ను ఇలా చూస్తే ఆవిడ ఎంత బాధ పడేవారు…….. !! అసలు ఆ రౌడీలు ఎవరు వాళ్ళు నిన్ను ఎందుకు టార్గెట్ చేసారు వాళ్లు నీకు ముందే తెలుసా అని అడుగుతున్నా రాజ్ క్వశ్చన్ కి శ్లోక మౌనంగా ఉండిపోతుంది……. !!
తను ఎంత అడుగుతున్నా అన్సర్ చెప్పకుండా వెక్కిళ్లు పెడుతూ వణుకుతున్న శ్లోక ను చూసి…….. !! శ్లోక బాగా భయపడిపోయిందని అర్థం చేసుకుని తనను ఇంకా దీని గురించి అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక…….. !! ఇట్స్ ఒకే ఒకే శ్లోక జరిగిందేదో జరిగిపోయింది ఇంకా దాని గురించే ఆలోచిస్తూ భయపడకు…….. !!