ఆఫీసులో కార్తికేయ తో జరిగిన గొడవ వల్ల మహాన్ మైండ్ అప్పటికే చాలా డిస్టర్బ్ అయి ఉంది……..!! పెండింగ్ లో ఉన్న ఆఫీస్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అప్పటికే 10 అవుతూ ఉంటుంది…….. !! అందుకే ఇంటికి రాగానే అసహనంగా సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు …… !!
మహాన్ గురించే వెయిట్ చేస్తున్న భూమి మహాన్ రాగానే వాటర్ తీసుకుని వచ్చి మహాన్ చేతిలో పెడుతుంది…….. !! భూమి చేతి స్పర్శ కి కళ్ళు తెరచిన మహాన్ కార్తికేయ మీద కోపాన్ని భూమి మీద చూపెట్టలేక సరిగ్గా కూర్చుంటూ …….!! నువ్వింకా పడుకోకుండా ఎమ్ చేస్తున్నావ్ భూమి అని తన వైపు చూస్తూ ……..!! తన చెయ్ పట్టుకుని పక్కనే కూర్చో పెట్టుకుని వాటర్ తాగుతూ అడుగుతాడు……… !!