New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆలుమగలు – 1

ఆలుమగలు – 1

రమణి అబ్బాయి వాళ్ళు వచ్చే టైమ్ అవుతుంది…. మన అమ్మాయిని త్వరగా ముస్తాబు చెయ్…. అలాగే అండి…. అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటావే వెళ్ళు త్వరగా….

అది కాదు అండి అది ఇంకా పై చదువులు చదువుతా అంటుంది…. ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది…. ఒక్కసారి ఆలోచించండి…. ఓహో ఇప్పుడే చేసుకోను అంటుందా లేక నేను తెచ్చినది చేసుకోను అంటుందా అని అడిగారు….

అయ్యో అలా కాదు…. చూడు రమణి ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో…. నాకు బాగా తెలుసు ముందు దాని ఆలోచన మార్చుకోమని చెప్పు…. లేదు కాదు కూడదు అంటే నా శవాన్ని చూస్తుంది అని చెప్పు అన్నారు….

అయ్యో అలా అనకండి నేను వెళ్లి నచ్చ చెప్తాను అని చెప్పి గబ గబ లోపలికి వెళ్లారు….అమ్మ త్వరగా కానిచ్చి రెడీ అవ్వు…. అది కాదు అమ్మ ఇలా చూడు ఈసారి ఆయన ఎందుకో చాలా పంతంగా ఉన్నారు….

ఇది కానీ జరగకపోతే బతకను అంటున్నారే…. అమ్మా అవునే అని చెప్పి జరిగింది చెప్పారు…. లేదు అమ్మ నేను కచ్చితంగా చేసుకుంటాను…. అదే నాన్నకు సంతోషం అయితే ఆ కోరిక తీరుస్తాను అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళింది….

రమణి గారు బాధగా చూస్తూ…. నన్ను క్షమించు అమ్మ ఏమి చేయలేని పరిస్థితి ఈ విషయం లో అని అనుకోని మిగతా పనులు చూడటానికి కిచెన్ కి వెళ్లారు….

అక్క ఇంకా ఏమైనా కావాలా…. ఆహా చాలు సుమిత్ర… ఏమైంది అక్క అలా ఉన్నావ్…. రమణి గారు బాధపడుతూనే జరిగింది చెప్పారు…. బావ గారు అలా అన్నారా మరి మన అమ్మాయి బాధ పడుతూ ఉంటుంది కదా అని అనుకోని….

హ సరే సరే త్వర త్వరగా ఇక్కడ కానివ్వు…. నేను వెళ్లి అమ్మాయి రెడీ అయ్యింది ఏమో అని చూసి వస్తాను అన్నారు…. నువ్వు ఉండు లే అక్క నేను చూస్తాను అని చెప్పి సుమిత్ర గారు వెళ్లారు….

అప్పటికే బయటకు వచ్చి రెడీ అవుతూ ఉంది…. అయ్యిందా తల్లి…. హ అవ్వొచ్చింది పిన్ని ఫైవ్ మినిట్స్ అనింది….కానీ తను దిగులుగా ఉండడం గమనించి…. ఇలా చూడు నీకు ఇప్పుడు జరుగుతున్నది పెళ్లి చూపులు మాత్రమే….

ఆ మాత్రానికే ఈరోజే పెళ్లి అన్నట్టు మోహంలో ఆ దిగులు ఎందుకు చెప్పు…. అలాంటిది ఏమి లేదు అని బాధగా ఒక నవ్వు నవ్వి కామ్ గా ఉంది…. హ్మ్ సరే నువ్వు రెడీ అయ్యి రా నేను వెళ్లి అక్కకి మిగతా పనుల్లో సాయం చేస్తుంటాను అని చెప్పింది….

హ అని చెప్పి చీర కట్టుకుంటూ ఉంది…. అక్కా అంటూ వచ్చింది ఒక అమ్మాయి…. అబ్బా సూపర్ ఉన్నావే నిన్ను కానీ ఇలా ఆ వచ్చిన వాళ్ళు చూసారు అంటే…. ఇప్పుడే పెళ్లి చేసేయమని అడుగుతారు ఏమో అనింది….

హేయ్ పోవే ముందు ఇక్కడ నుంచి…. అబ్బో ఇదంతా సిగ్గే దాచుకో కొంచెం అని చెప్పి చక్కిలి గింతలు పెట్టింది… హే హే ఆపవే ఆపవే నీ అల్లరి అని అంటూ ఉండగా….

అమ్మా సంజన నువ్వు వెళ్లి అమ్మ కి పనుల్లో సాయం చెయ్ పో…. అలాగే నాన్న…. బుజ్జమ్మ చెప్పండి నాన్న నీకు నా మీద కోపంగా ఉందా….అయ్యో నాన్న అలా అనకండి….మీరు ఏది చేసిన నా మీద ప్రేమ తోనే నేను సంతోషం గా ఉండాలనే చేస్తారు అని నాకు తెలుసు….

నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా అనుకోను నాన్న అని చెప్పి గుండెల మీద తల వాల్చింది…. నా బంగారు తల్లివి నువ్వు అని చెప్పి నుదుటున ముద్దు పెట్టుకొని…. నువ్వు ముస్తాబు అవ్వమ్మ….

నాకు ఇంకా మిగతా పనులు ఉన్నాయ్…. అని చెప్పి వెళ్లారు….ఆ అమ్మాయి రెడీ అయ్యి ఒకసారి అద్దం లో తనని తను చూసుకొని…. మంచిం మీద కూర్చొని ఎదో ఆలోచిస్తూ ఉంది….

అప్పుడే రమణి అబ్బాయి వాళ్ళు వచ్చేసారు రండి అనే మాట వినిపించి….కొంచం కంగారు పడింది….అందరు ఎదురు వెళ్లి ఆ వచ్చిన వాళ్ళని సాధరంగా ఆహ్వానించి లోపలికి తీసుకోచ్చారు….

అందరు వచ్చి కూర్చున్నాక…. ఎవరిని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉన్నారు…. నమస్తే అండి మీకు మా గురించి తెలిసిన కూడా మళ్ళీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్న అంటూ….

నా పేరు రాజారామ్…. ఈమె నా భార్య రమణి…. ఈ అమ్మాయి నా చిన్న కూతురు సంజన…. ఇంక నా తమ్ముడు రఘురామ్….అతని భార్య సుమిత్ర…. వీడు వాళ్ళ కొడుకు సాయి కృష్ణ….

ఇంక నా గురించి తెలిసిందే టెక్స్ట్టైల్ బిజినెస్ మాది…. ప్చ్ ఆపండి ఇంక మేము ఏమైనా జనాభా లెక్కలు కోసం వచ్చాం అనుకున్నారా…. ఈ సోది అంతా ఆపి జరగాల్సింది చూడండి అన్నాడు….

ఆ మాటకి వరలక్ష్మి గారు పైకి లేచి ఏమి అనుకోకండి అన్నయ్య గారు….వాడు అంతే కొంచం సహనం తక్కువ అందుకే అలా…. మీ గురించి మాకు బాగా తెలుసు…. కుటుంబం అంటే ఇలా ఉండాలి అనిపించేలా చక్కగా ఉన్నారు….

మీతో వియ్యం అందుకోవాలన్నా కూడా మేము అదృష్టం గా భావిస్తాం అమ్మ…. అయ్యో అలా ఏమి లేదు అన్నయ్య నా కుటుంబం గురించి కూడా చెప్పేస్తున్న…. వీడు నా పెద్ద కొడుకు పేరు అజిత్ చంద్ర….

నా చిన్న కొడుకు లండన్ లో చదువుకుంటున్నాడు…. ఒకరకంగా మేము ఇప్పుడు ఇలా ఉన్నాం అంటే దానికి కారణం మాత్రం వీడే…. ఇప్పుడు ఈ పోసిషన్ కి రావడానికి వెనక వీడి కృషి కష్టం పట్టుదల అన్ని కలిపి….

మమ్మల్ని చుస్తే ఎవరైనా గుర్తు పడతారు అంటే అది మా అజిత్ వల్లనే…. ఈమె నా చెల్లెలు నా తోటి కోడలు కూడా…. మా వారు వేరే ఊరులో ఉండడం వల్ల మరిది గారు వచ్చారు….

ఆయన పేరు జగన్నాద్ ఇంక మా మరిది పేరు జనార్దన్…. నా చెల్లి రాజ్యలక్ష్మి….పిల్లలు కాలేజ్ కి వెళ్లారు అని చెప్పి…. ఇంక అమ్మాయిని పిలవండి అని అన్నారు….

రమణి వెళ్లి అమ్మాయిని తీసుకు రండి…. అలాగే అండి…. సంజన అజిత్ వైపు అలానే చూస్తుంటే….నువ్వు ఏమి చదువుతున్నావ్ అని అడిగారు వరలక్ష్మి గారు….

బి.టెక్ సెకండ్ ఇయర్ అని చెప్పింది…. మరి కాలేజ్ లేదా ఈరోజు….హ ఉంది అంటీ కానీ నేనే వెళ్ళలేదు…. ఎందుకు…. ఎందుకేంటి అండి ఈరోజు పెళ్లి చూపులు కదా…. ఎవరికి అవి అని అడిగాడు…. మా అక్కకి…. హ అక్కకి కదా మరి నువ్వెందుకు ఉన్నావ్ అని అన్నాడు కోపంగా….

అది అది సాయానికి ఉందాం అని…. ఎవరికి సాయం…. అదే అమ్మ వాళ్ళకి…. ఓహో మరి చేసావా…. లేచిన దగ్గర నుంచి నువ్వు చేసిన ఒక్క పని చెప్పు అన్నాడు…. ఇంక అంతే ఆ మాటకి షాక్ అయ్యి….

అమ్మో చాలా డేంజరస్ గా ఉన్నాడే…. నేను జాగ్రత్త గా ఉండాలి…. లేకపోతే ఇంతే అనుకోని హీ అని నవ్వి పక్కకి వెళ్ళిపోయింది….అప్పుడే రమణి గారు సుమిత్ర గారు ఇద్దరు కలిసి అమ్మాయిని తీసుకు వచ్చి కూర్చోబెట్టారు….

వరలక్ష్మి గారు తన పక్కన కూర్చొని…. నీ పేరేంటి అమ్మ తను కొంచం తడబడుతూ జనని అని చెప్పింది….ఆ మాటకి నవ్వుతు ఏమి చదువుకున్నావ్ అని అడిగారు….బి.టెక్ కంప్లీట్ అయ్యింది అని చెప్పింది….

ఒకసారి మా అబ్బాయిని చూడు అని చెప్పి గడ్డం పట్టుకొని తన వైపు తిప్పించారు…. అప్పుడే అజిత్ కూడా తన వైపు చూసాడు…. అంతే ఇంక భయం తో కళ్ళు పెద్దవి అయ్యాయి….

ఇది కొత్త స్టోరీ ఆలుమగలు ఎలా ఉందొ…
చదివి రేటింగ్స్ ఇంక సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….

మీ
లక్ష్మి.