New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆలుమగలు – 3

ఆలుమగలు – 3

ముందే తెలుసా ఎలా అక్క…. ఇద్దరికి పరిచయం ఉందా…. నాకు ఉంది ఆయనకు నేను తెలియదు…. అవునా ఎలా చెప్పు చెప్పు…. ప్చ్ ఇప్పుడు కాదు లే ఇంకెప్పుడు అయినా చెప్తాను….

అక్కడ అతను ఎదురు చూస్తుంటాడు కదా…. అబ్బో సరేలే అని చెప్పి సంజన బయటకు వచ్చింది…. అజిత్ ని చూసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా అక్కని అని అడిగింది….
ఆ మాటకి తల ఎత్తి సంజన వైపు చూసి…. హ్మ్ ఇప్పుడు నీకు ఇది చెప్పాలా… హ చెప్పండి ప్లీజ్ ప్లీజ్…. సరే నేను నిన్ను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా…. దానికి ముందు నువ్వు ఆన్సర్ చేయి….
ఆ తర్వాత నేను చెప్తాను అన్నాడు…. చేతులు కట్టుకొని వెనక్కి ఆనుకొని కూర్చుంటు…. అది… అది…. హ అక్క వస్తున్న…. మా అక్క కి హెల్ప్ చేయాలి అంట నేను వెళ్తున్న….
అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది…. అజిత్ చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు….ఒక్క ఫైవ్ మినిట్స్ బాబు ఐపోయింది వచ్చేస్తుంది….అజిత్ ఆ మాటకి కళ్ళు మాత్రమే ఎత్తి అలానే చూసి మళ్ళీ ఫోన్ వైపు కళ్ళు దించాడు….
రేయ్ అజ్జు అమ్మాయి వచ్చేసింది…. తనని కింద నుంచి పైకి చూస్తూ… పైకి లేచి ఫోన్ పాకెట్ లో పెట్టుకుంటూ…. ఇంక వెళ్దామా అన్నాడు… హ అని తల ఊపి ముందుకు కదిలింది….
ఇద్దరు పక్క పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే…. అందరు వాళ్ళని అలా చూసి చూడచక్కని జంట అనుకుంటూ ఉన్నారు….ఇద్దరు బయటకు వచ్చి కార్ ఎక్కి పోనిచ్చాడు….
జనని ఏమి మాట్లాడకుండా విండో లో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది….అజిత్ కూడా డ్రైవింగ్ మీద ద్రుష్టి పెట్టి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు…. అలా ఇద్దరి మధ్య నిశ్శబ్దం….
ఈలోపు జనని ఎదో మాట్లాడించబోతే…. హుష్ డ్రైవింగ్ చేస్తున్న కదా కనిపించడం లేదా…. ఈ టైమ్ లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా అన్నాడు సీరియస్ గా…. ఆ మాటకి బాధగా అనిపించి మళ్ళీ పక్కకి తిరిగేసింది….
అజిత్ మాత్రం ఇవేమి పట్టనట్టు…. డ్రైవ్ చేస్తు ఉన్నాడు…అలా కొద్దీ సేపటికి ఒక కాఫీ షాప్ ముందు తీసుకోచ్చి ఆపాడు…. జనని వైపు చూసి దిగు అని సైగ చేసాడు….
అలాగే అని దిగింది…. ఇద్దరు కలిసి లోపలికి వెళ్లి కూర్చున్నాక… కాఫీ ఆర్డర్ చెప్పుకున్నాడు…. నీకు ఏది కావాలి….ఏదోకటి మీరే చెప్పేయండి…. అంటే అన్నాడు బేస్ వాయిస్ లో….
దెబ్బకి తడబడి అంటే మీరు ఏది ఆర్డర్ ఇస్తే అది అనింది…. అంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తేనే నీకు ఆకలి వేసిద్దా అని అడిగాడు…. అలా కాదు అండి…. జస్ట్ ఆన్సర్ మీ… నాకు వేసినప్పుడు నీకు కూడా వేసిద్దా…
ఉహు మరి ఎందుకు ఈ ఫార్మాలిటీస్… చూడు జనని ఎదుటి వాళ్ళకి ఏది నచ్చితే అది చేయడానికి…. ఇంక మన ఇష్ట ఇష్టాలు ఎందుకు ఉన్నాయి చెప్పు…. ఇప్పుడే కాదు మన పెళ్లి అయ్యాక కూడా….
నీకు ఎలా ఇష్టమో…. ఏది ఇష్టమో…. అదే చెయ్ వాళ్ళకి నచ్చదు నేను ఇలా ఉంటే…. వీళ్లకి నచ్చదు నేను ఇది తింటే…. అనేవి పెట్టుకోకు… నాకు నువ్వు ఎలా ఉంటావో అలానే ఇష్టం….
నీ ఉనికిని నీ ఇష్టాన్ని వదులుకొని అడ్జస్ట్ అవ్వాలి అనే ఆలోచనలు మాత్రం చేయకు…. ఎప్పుడు అలాంటివి పెట్టుకోకు అర్ధం అయ్యిందా…. హ్మ్ అర్ధం అయ్యింది…. గుడ్ ఇప్పుడు నీకు నచ్చింది ఏంటో చెప్పు….
అలాగే అని చెప్పి చెప్పింది…. ఓకే అవి రెండు తీసుకొని రండి అని చెప్పి మెనూ కార్డ్ మూసేసి…. ఇప్పుడు చెప్పు ఇందాక నన్ను చూసి ఒకరకమైన భయం అనే ఎక్సప్రెషన్ ఇచ్చావ్ ఏంటి….
నేను నీకు ముందే తెలుసా లేక నన్ను చూసి బయపడ్డవా అని అడిగాడు….అయ్యో అలాంటిది ఏమి లేదు అండి…. ప్చ్ నేను కళ్ళలో ఆ భయాన్ని స్పష్టంగా చూసాను….
ఇంక నాంచకుండా విషయానికి రా అని అన్నాడు…. అది… అది… హ అదే ఏది చెప్పు అన్నాడు సహనం కోల్పోతు…. మీరు ఇలా అంటే భయం వేస్తుంది చెప్పడానికి….
హ్మ్ సరే చెప్పు మరి లాగ్ చేయకుండా….నేను మిమ్మల్ని ఇంతకు ముందే చూసాను…. ఆ మాటకి ఐ బ్రో రైస్ చేసి ఇంతకు ముందే అంటే అన్నాడు…. అదే ఆరోజు రోడ్ మీద మీరు ఎవరినో కొడుతున్నారు కదా అప్పుడు….
హ అప్పుడు చూసావా….హ్మ్ అది ఆరోజు ఒక అమ్మాయిని ఎవరో చున్నీ లాగి అసభ్యంగా ఏడిపిస్తుంటే కొట్టాను లే…. అది కూడా తెలుసు… ఎందుకంటే అలా చేస్తుంది నన్నే….
అప్పుడే మీరు వచ్చి వాళ్ళని కొట్టి నన్ను పక్కకి నెట్టారు…. ఆరోజే మొదటి సారి చూసాను మిమ్మల్ని….మరి ఎవడో వచ్చి నీ ఒంటి మీద చెయ్ వేసి ఏడిపిస్తుంటే….
లాగి రెండు పీకకుండ… కూర్చొని ఏడుస్తున్నావా అని అడిగాడు సీరియస్ గా చూస్తూ…. అది భయం వేసింది….ఆ మాటకి కోపంగా పైకి లేచి…. ఇలా భయపడే ఆడవాళ్లంటే నాకు నచ్చరు….ఐ హేట్ యు అన్నాడు…. ఇంక అంతే ఆ మాటకి ఆశ్చర్య పోయి పైకి లేచి నుంచుంది….
అది కాదు అండి…. నేను ఒక ఆడపిల్ల ని…. ఆ టైమ్ లో మొదట వేసేది అదే కదా…. అంతే కానీ వెంటనే ఫైట్ చేయాలి అనో లేకపోతే ఇంకోటి ఇంకోటో మైండ్ లోకి రావు కదా అనింది….
నేను అందరి లా కాదు అండి…. నాకు ప్రతి చిన్న విషయానికి కూడా భయం ఎక్కువ…. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడిన భయం వేస్తుంది…. పెళ్లి అయ్యాక నన్ను మార్చుకోవచ్చు కదా….అంతే కానీ ఈ విషయానికి ఐ హేట్ యు అనేస్తారా అని ఏడుస్తూ కూర్చుంది….
మరి ఇప్పుడు అజిత్ రియాక్షన్ ఏంటి…?
అసలు వీళ్ళ పెళ్లి జరిగిద్దా లేక ఏదైనా ఆటంకం తో ఆగిపోయిద్దా….?
అనేది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కై వేచి ఉండండి….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంక సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి.