ఆలుమగలు – 2
అక్క వాళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు…. మనం పక్కకి వెళ్దామా….మనం పక్కకి వెళ్లడం ఎందుకు అమ్మ జనని నువ్వు వెళ్లి అబ్బాయిని బాల్కనీ కి తీసుకెళ్లు….
ఏరా వెళ్ళు….జనని లేవబోతే ఆగు అని చేయి ఎత్తాడు…. ఇంక అందరు ఆశ్చర్యం గా తన వైపు చూస్తూ ఉంటే…. అతను పైకి లేచి ఇలా చూడు పిన్ని… మనం ఇక్కడికి వచ్చింది చూసి వెళ్ళడానికి మాత్రమే….
అంతే కానీ ఇలా పక్కకి వెళ్లి మాట్లాడుకోవడాలు…. చాటుగా వెళ్లి మీటింగ్ పెట్టడానికి కాదు…. అది కాదు రా…. ప్చ్ అమ్మ వచ్చిన పని అయ్యింది కదా…. హ మేము ఇంటికి వెళ్లి మాట్లాడుకొని కబురు చేస్తాం అండి….
పిన్ని ఇలాంటి చేష్టలు అనవసరం…. అమ్మ నీకు తను నచ్చిందా… అదేంటి నాన్న అలా అంటావ్ నచ్చాల్సింది నీకు కదా…. అమ్మ నువ్వు చెప్పు ముందు నచ్చిందా…. హ తనకేంటి రా బంగారం లా ఉంది…. ప్చ్ నచ్చిందా లేదా….
నాకు నచ్చింది రా…. మరి నీకు నాకు కూడా నచ్చింది…. ఇంక మిగతా విషయాలు గురించి చూడండి…. అది బాబు నాకు ఇద్దరు కూతుర్లు…. నా తమ్ముడికి ఒక కొడుకు…. మేము సంపాదించింది అంతా వీళ్ళ ముగ్గురుకే సమానం గా ఇద్దాం అనుకుంటున్న….
మీకు ఎక్కడా తగ్గకుండ…. ఈ పెళ్లి ఘనంగా జరిపిస్తాను…. కట్న కానుకలు విషయానికి వస్తే…. అని ఇంకా ఎదో అనబోతుండగా…. హ వస్తే వస్తే…. ఇంకా ఏంటి వస్తే…. హ….అది కాదు బాబు….
నేను మిగతా విషయాలు అనింది…. డేట్ డే అవి ఫిక్స్ చేయమని అంతే కానీ…. ఇలాంటి సోది కోసం కాదు…. ఏంటి ఘనంగా జరిపిస్తారా…. అది కూడా నా ఇదికి తగ్గట్టా….
అంతలా డబ్బులు తగలెయ్యాలి అని మీకు అంత ఇదిగా ఉంటే….మా పెళ్లి కి అయ్యే ఖర్చు ని ఏదైనా అనాధఆశ్రమానికి ఇవ్వండి…. ఆ డబ్బులు కనీసం కొంతమంది చదువుకి అయినా ఉపయోగ పడిద్ది….
జనని థట్ ఈస్ యువర్ నేమ్ రైట్…. హ అని తల ఊపింది…. ఓకే ఇంటికి వెళ్లి కబురు చేస్తాం…. రేపు మాట్లాడదాం నాకు ఇవన్నీ నచ్చవు…. నేను ఏదైనా
ఆన్ ది స్పాట్ మాట్లాడతాను….
నాకు నువ్వు నచ్చావ్….వీళ్ళు ఎలాగో నా అభిప్రాయం కోసం మాత్రమే ఆలోచిస్తారు తప్ప నిన్ను అడగరు…. నాకు అది అర్ధం అయ్యింది…. నేను నీకు నచ్చానో లేదో…. ఇప్పుడే చెప్పేయ్ అదే బెటర్ నీకైనా నాకైనా….
అది ఉమ్ నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు…. నీ మనసులో ఏమున్నా నిర్భయంగా చెప్పు…. నచ్చానా లేదా….సే ఎస్ ఆర్ నో థాట్స్ ఇట్…. ఆ మాటకి నవ్వుతు తల దించుకొని నచ్చేసారు అనింది….
అది విని అజిత్ కూడా నవ్వుకుంటూ…. ఓకే అని ఇంక పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనేది చూడండి….నేను ఎక్కడ అనింది గుడి గురించి… మండపం గురించి కాదు అని చెప్పేసి…. అమ్మ నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది…. మీరు జాగ్రత్తగా వెళ్ళండి…. బై అని జనని వైపు చూసి చెప్పి వెళ్ళాడు….
అజిత్ వెళ్ళాక సంజన జనని దగ్గరికి వచ్చి…. అమ్మో అక్క ఎదో పెద్ద సునామి వచ్చి వెలిసినట్టు గా అనిపించిందే….ప్చ్ ఆపవే కామ్ గా ఉండు కొంచెం సేపు…. అబ్బా నాకు ఇందాక ఎలా ఆడుకున్నాడో తెలుసా….
ఏమైందే…. అది అని మొదలు పెట్టి జరిగింది అంతా చెప్పింది…. అది విన్న జనని పెద్దగా నవ్వుతు బాగా అయ్యిందే నీకు అని చెప్పి చెవి పట్టుకుంది…. అబ్బా అక్క అసలకే అవమాన భారం మోయలేక పోతుంటే….
నువ్వు ఇంకా దానిని పెంచకు…. ఏంటి సంజన ఇందాక మా వాడు అన్నా దానికి బాధ పడుతున్నావా…. ఆంటీ మీ అబ్బాయిని నా దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి….
లేదనుకో…. హ లేదంటే అనే మాట వినిపించి అందరు గుమ్మం వైపు చూసారు…. ఇంక అంతే భయంతో వెంటనే రూంలోకి వెళ్ళిపోయింది…. అజిత్ మళ్ళీ లోపలికి వచ్చి….
అమ్మ నేను జనని ని బయటకు తీసుకొని వెళ్దాం అనుకుంటున్న…. అయ్యో దానిలో ఏముంది బాబు వెళ్లి రండి…. జనని దగ్గరకి వచ్చి నువ్వు మార్చుకొని వెల్దువు కానీ రా అమ్మ అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్లారు….
అదేంటి రా ఇందాక పక్కకి వెళ్లి మాట్లాడుకోండి అని అంటే వద్దు అన్నావ్…. ఇప్పుడు బయటకు అంటున్నావ్…. అప్పుడు మేము ఒకరికి ఒకరం ఇంకా ఫిక్స్ అయ్యాం అనేది చెప్పుకోలేదు….
కానీ ఇప్పుడు తనే నా భార్య అని నేను…. నేనే తన భర్త అని తను మనసులో ఒప్పుకున్నాం కాబట్టి తీసుకెళ్లాలి అనుకుంటున్న…. అప్పటికి ఇప్పటికి తేడా ఉంది అని చెప్పి కూర్చున్నాడు….
అమ్మ జనని నీకు అబ్బాయి నచ్చాడా…. ఏమ్మా నీకు నచ్చలేదా…. అది కాదు అమ్మ చాలా ముక్కుసూటి మనిషి లాగా ఉన్నాడు…. కాసేపటికే వణికించేసాడు…. మరి నువ్వు జీవితం అంతా సర్దుకోగలవా….
అమ్మ మీకు అతనిలో ముక్కు సూటి తనం కనిపించింది కానీ నాకు ఒక బాధ్యత కనిపించింది…. నేను చేసుకో బోయే అమ్మాయి…. నాకు నచ్చితే చాలదు…. నేను కూడా తనకు నచ్చాలి…. అని ఆలోచించే విధానం కనిపించింది….
వీటి అన్నిటికి మించి… నాకు ఇంతకు ముందే అతను తెలుసు…. ఆ మాటకి సంజన రమణి గారు ఇద్దరు ఆశ్చర్యపోయారు….
హ్మ్ మరి వీళ్ళ పరిచయం ఎప్పుడు జరిగింది…?
ఏంటి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కై వేచి ఉండండి….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంకా సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి.
Swipe left/right or tap the sides to turn pages