ప్లీజ్ అజిత్ గారు ముందు కూర్చోండి…. ఇంకేమి మాట్లాడకుండా కామ్ గా కూర్చున్నాడు…. ఏంటి నేను నిన్ను పెళ్లి అయ్యాక మార్చుకోవాలా…. అవును అని తల ఊపింది….
అంటే నీ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టేస్తున్నావా…. అలా కాదు అండి… చాలు అని చేయి ఎత్తాడు ఆపమన్నట్టు గా…. ఈలోపు వెయిటర్ వచ్చాడు….అతన్ని చూసి సైలెంట్ అయ్యి…. ఇద్దరు అవి తీసుకొని కూర్చున్నారు….
ఇలా చూడు జనని నేను నిన్ను ఎప్పుడు నాకు అనుగుణంగా మారమని చెప్పను…. నువ్వు అలా మారిన నాకు నచ్చదు…. నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు….
హో అవునా నేను ఎలా అయితే ఉంటానో…. మీతో కూడా అలానే ఉండనా…. హ అదే కదా చెప్పింది…. అజిత్ చేతిలో నుంచి కూలింగ్ గ్లాస్సెస్ తీసుకొని పెట్టుకుంటూ….
ఓకే మిస్టర్ అజిత్…. అని చెప్పి అవి పెట్టుకొని నేను మీకు నచ్చానా లేదా అని అడిగింది….కొంచెం ఆటిట్యూడ్ చూయిస్తూ…. తను అలా చేసేసరికి నవ్వు వస్తున్న ఆపుకొని….
ఏంటి ఇది అన్నాడు…. ముందు మీరు నవ్వేయండి చెప్తాను తర్వాత మాట్లాడుకుందాం అనింది…. అజిత్ బ్లష్ అవుతూ పక్కకి తిరిగాడు….మరి నేను నీకు నచ్చానా అని అడిగాడు….