New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పరిణయం(అర్జున్💞అన్విత) – 1

పరిణయం(అర్జున్💞అన్విత) – 1

కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తత్తతే అని …. ఆ ఇంట్లో ఉదయాన్నే  సుప్రభాతం వినిపిస్తూ ఉంది…. అక్కడ ఒకామె తలకి పోసుకొని తల కి కండువా చుట్టుకొని తులసికోట చుట్టూ తిరుగుతూ ప్రదీక్షణలు చేస్తూ ఉంది…..

అప్పుడే ఒక ఆయన లేచి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చి ఆమెను చూసి ఏంటి వేణి ఎప్పుడు పూజలేనా మమ్మల్ని కూడా కాస్త పట్టించుకునేది ఏమైనా ఉందా అని అడిగాడు…. అప్పుడే ఆమె పూజ ఐపోయి అక్కడ కోట కి హారతి ఇస్తూ ఆ మాటకి చిరు కోపంగా ఆయన్ని చూసి మళ్ళీ దేవుడి పై భక్తి లో లీనం ఐపోయారు….
పూజ ఐపోయి హారతి ఇచ్చి ఆవిడ కూడా అద్దుకొని ఆయనకు ఇస్తూ ఏమిటీ మీరు నేనసలు మిమ్మల్ని పట్టించుకోనట్టు గా మాట్లాడతారు అని అన్నారు…. అబ్బా ఎదో ఊరకే అన్నాను లే కానీ వెళ్ళు వెళ్లి పిల్లల్ని లేపు అని చెప్పి పంపించారు….
హ్మ్ ఏమి పిల్లలో ఏమో అని అనుకుంటూ వాళ్ళ రూంలోకి వెళ్లారు…. మొత్తం నలుగురు ఆడపిల్లలు వాళ్ళని చూసి అసలు ఎలా పడుకున్నారో ఇంత పొద్దేక్కాక కూడా అనుకుంటూ చిన్నోడా బుజ్జోడ చిట్టోడా కన్నోడా అని నలుగురిని లేపారు….
అమ్మా కాఫీ అని చెప్పి ఇంకొక అమ్మాయి వచ్చి ఇచ్చింది…. అబ్బా ఇది నా మహాలక్ష్మి మిగతా అందరు అందరే నా పెద్దోడు మాత్రం బంగారం అని మురుసుకుంటూ కప్ తీసుకొని పెద్దోడా వాళ్ళని లేపర్రా కొంచెం అని చెప్పి బయటకు వెళ్లారు….
అందులో ఒక అమ్మాయి లేచి ఏంటి రా పెద్దోడా ఇప్పుడు మమ్మల్ని లేపేస్తావా ఏంటి లేపావు అనుకో మేము పెద్దగా అరిచి నాన్న ని పిలిచేస్తాం అని ఎక్కిరించి మళ్ళీ పడుకుంది… అబ్బబ్బ మరి అల్లరి గా రౌడీల్లా తయారు అవుతున్నారు మీరు లేవండి అమ్మా కొంచెం నా బుజ్జి తల్లులు కదా అని చెప్పి లేపింది….
అబ్బా నీకు మాత్రం భలే తెలుస్తాయే మమ్మల్ని ఎలా కూల్ గా లేపాలో అని చెప్పి నలుగురు లేచారు…. హ్మ్ ముందు పదండీ వెళ్లి బ్రష్ అది చేసి ఫ్రెష్ అయ్యి రండి పోండి అని చెప్పి ఎవరి బ్రషెస్ వాళ్ళకి చేతికి ఇచ్చి పంపించింది….
అలా నలుగురు వెళ్లి బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారు…. అమ్మా త్వరగా టిఫిన్ పెట్టు నాకు స్కూల్ టైమ్ అవుతుంది…. హా హా వస్తున్న ముందు లేవమంటే లెవరు కానీ ఇప్పుడు మాత్రం హడావిడి పెట్టేస్తారు నన్ను అని చెప్పి అన్ని బాక్స్ లు సద్దెసి అందరికి టిఫిన్ పెట్టిచ్చి తెచ్చింది పెద్దోడు….
నాకు నా పెద్దోడు ఉన్నాడు సాయం గా ఎంత పెద్ద పని అయినా ఇట్టే చేసేయగలదు…. అంత ఓపిక సహనం ఉన్నాయి నా తల్లీలో అని చెప్పి మురుసుకున్నారు…. ఆ మాటలకి నవ్వి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయింది….ఇంక ఈ పెద్దోడా చిన్నోడా బుజ్జోడా చిట్టోడా కన్నోడా పేర్లు తెలుసుకుందాం….
పెద్దోడు:చరిత (డిగ్రీ చదివింది(బి.ఏ)చదువు అయ్యాక ఇంట్లోనే ఉంటు అమ్మ కి నాన్న కి సాయంగా ఉండాలనే ఉద్దేశం తో తను కూడా కుట్లు అల్లికలు నేర్చుకొని ఇంట్లో పని అంతా అయ్యాక ఇంక అలివేణి గారు చరిత ఇద్దరు కలిసి మెషిన్ కుడుతూ ఉంటారు….
చిన్నోడా:అన్విత(ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్)
బుజ్జోడా:కవిత(ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్)
చిట్టోడా:నమిత(టెన్త్ చదువుతుంది)
కన్నోడా:వినీత(ఐత్ చదువుతుంది)
అమ్మ:అలివేణి
నాన్న:భూషణం
ఇది హీరోయిన్ ఫ్యామిలీ ఇందులో చిన్నోడే హీరోయిన్
వీళ్లది చిన్న మధ్య తరగతి కుటుంభం బ్యాంక్ లో క్లర్క్ గా పని చేస్తూ ఉంటారు భూషణం గారు అలివేణి గారు భర్త కి కాస్త సాయం చేయాలనే ఉద్దేశం తో కుట్లు అల్లికలు నేర్చుకొని మెషిన్ కుడుతూ ఉంటారు చుట్టూ పక్కల ఇళ్ల వారివి….అలా చరిత అలివేణి గారు ఇద్దరు కుట్టి ఆ వచ్చిన దానిని ఒకళ్ళు భూషణం గారికి ఇస్తే ఇంకొకరు ఇంట్లో ఖర్చులకి వాడుతూ ఉంటారు…. భూషణం గారికి వచ్చేవి ఇంటి అద్దె కి ఫీస్ లకి వాడుతూ ఉంటారు…..
********
ఏరా పొద్దు పొద్దునే ఇంత చిరాకు గా ఉన్నావ్ ఏంటి విషయం… ఏముంది రా చాలా చిరాకు గా ఉంది అసలు ఇంట్లో నా పెళ్లి గురించి అడుగుతుంది రా మా అమ్మ నాకేమో ఆమెని నొప్పించడం ఇష్టం ఉండదు…. అలా అని అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు నాకు సన్యాసం తీసుకోవాలని ఉంది రా బాబు అని చెప్పాడు….
ఎందుకు రా నీకు అమ్మాయిలు అంటే అంత చిరాకు…. చిరాకు అని అంత నెమ్మదిగా అడుగుతావ్ ఏంటిరా కంపరం చీ అసలు ఆడవాళ్లు ఎందుకు పుట్టార్రా నాయనా అనే కోపం అని చెప్పాడు…. నువ్వు ఊరుకోరా బాబు ఆడవాళ్లు లేకపోతే అసలీ సృష్టి లేదు కదా రా అలా అంటావ్ అని అన్నాడు…. 
అలా అని ఎవర్రా కనిపెట్టింది అని అడిగితె అవునా సరే రా మరి మీ మదర్ అంటే నీకు చాలా ఇష్టం కదరా ఏమి చెప్పినా చేస్తావ్ అని అడిగాడు…. అబ్బా నేనంటుంది ఈ కాలం ఆడవాళ్ళని రా మా అమ్మ ఆ కాలం ఆవిడ బంగారం రా మా అమ్మ అని చెప్పి మురుసుకున్నాడు….
హ్మ్ అలాగే మంచివాళ్ళు కూడా ఉంటారు అని అనగానే అబ్బా సరే ముందు ఆ టాపిక్ ఆపరా బాబు అని అనేసరికి హ్మ్ సరేలే రా కరెక్ట్ అయిన అమ్మాయి తగిలేవరకు నువ్వు ఇలానే ఉంటావు లే తగిలితే కదా…..
ఈ ఆలోచనలు అన్ని తప్పు అని నువ్వే ఒప్పుకుంటావ్ అని అనేసరికి ఎవరు నేనా ఈ అర్జునా నెవెర్ నా లైఫ్ లో అసలు ఏ అమ్మాయికి స్థానమే లేదు ఒక్క మా అమ్మ కి తప్ప చూస్తూ ఉండు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు….
హ్మ్ ఇలా ఆలోచించే అబ్బాయికి మన చిన్నోడు అదే అండి అన్విత జత కాబోతుంది మరి వీళ్ళ పరిచయం ఎప్పుడు కాబోతుంది ఆ పరిచయం పరిణయం గా ఎప్పుడు మారుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంక సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ 
లక్ష్మి.