New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పరిణయం(అర్జున్💞అన్విత) – 2

పరిణయం(అర్జున్💞అన్విత) – 2

కన్నోడా జాగ్రత్త రా నువ్వు స్కూల్ కి వెళ్ళాక లంచ్ టైంలో వదలకుండా తిను సరేనా అని చెప్పి వినీత ని నమిత ని స్కూల్ బస్ ఎక్కించి అన్విత కవిత ఇద్దరు బస్ స్టాప్ దగ్గరికి వెళ్లారు కాలేజ్ బస్ కోసం ఇద్దరు బస్ స్టాప్ లో నుంచొని బస్ కోసం ఎదురు చూస్తుండగా….

అప్పుడే ఒకతను వచ్చి అన్వి ఐ లవ్ యు అని ప్రొపోజ్ చేశాడు…. నీకు ఎన్నిసార్లు చెప్పాలి రా నా చుట్టూ ఈ ప్రేమ దోమ అని చెప్పి తిరగొద్దు అని అనవసరం గా నీకు టైం వేస్ట్ నాకు నిన్ను తిట్టి తిట్టి ఓపిక ఐపోవడం తప్ప అని చెప్పి తిట్టి పక్కకి వెళ్లి నించుంది….
అయినా అతను వదలకుండా అలాగే వెనకే వెళ్లి మళ్ళీ అలానే విసిగించాడు…. చూడు మిస్టర్ ఇంకోసారి ఇలా మా వెనక పడితే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి బస్ రాగానే ఎక్కేసి వెళ్లిపోయారు…. అక్క ఏంటే వాడిని అంత తేలిగ్గా వదిలేసావ్ అని అడిగింది కవిత….
హా మరి వదలక ఏమి చేయమంటావే ఇప్పుడు అక్కడ వాడితో గొడవ పెట్టుకొని మన టైం వేస్ట్ చేసుకోవాలా అలాంటి వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి నువ్వు అనవసరం గా ఇదంతా అలోచించి బుర్ర పాడు చేసుకోకుండా చదువు మీద ద్రుష్టి పెట్టు అని చెప్పింది….
హా సరేలే నువ్వు ఎప్పుడు ఇంతే కదా అని అనుకోని ఇంక తను కూడా కామ్ గా బయటకు చూస్తూ కూర్చుంది…. ఇంతలో వాళ్ళ కాలేజీ వచ్చింది ఇద్దరు దిగి జాగ్రత్తలు చెప్పుకొని ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్లారు….
*********
రేయ్ తరుణ్ ఏమి చేస్తున్నావ్ రా హా అన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని అడిగాడు ఎదో బుక్ చూస్తూ అది తీసి పక్కన పెడుతూ…. ఇప్పుడే కానీ ఇంతకీ ఆ బుక్ ఏంటి ఎదో మ్యాగజైన్ లాగా ఉంది అని అడిగాడు…. లా కాదు అన్నయ్య అదే అని చెప్పి అంటే నువ్వెంటి రా కొత్త గా ఈ మ్యాగజైన్స్ మీద పడ్డావ్ ఏంటి విషయం….
అబ్బా అదేమీ లేదు అన్నయ్య ఊరకే ఎదో చూస్తున్న కానీ నీకింకా టైం కాలేదా ఇంత టైం అయినా కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నావ్…. అదా చిన్న మీటింగ్ ఉంది అది ఈవెనింగ్ అందుకే అప్పటి వరకు పెద్దగా ఏమి పని లేదు ఇప్పుడు వెళ్లి ఏమి చేస్తాం అని ఇంట్లోనే ఉన్నాను అని అన్నాడు….
హో అని అంటే అవును అమృత అమ్మా నాన్న అమ్మమ్మ నలుగురు ఏరి కనిపించడం లేదు…. అమ్మా నాన్న ఎదో పని ఉంది అని బయటకు వెళ్లారు…. అమృత రూంలోనే ఉన్నట్టు ఉంది…. అమ్మమ్మ ఎక్కడ ఉండిద్ది రా ఇంకా రూమ్ లోనే ఎక్కడో కూర్చొని కృష్ణ రామా అనుకుంటుందో అని అనగానే కాళ్ళు విరగ్గొడత వెదవ అనే మాట వినిపించి ఇద్దరు వెనక్కి తిరిగారు….
తరుణ్ చూసి అదిగో రా సూర్య కాంతం అని చెప్పి చూయించాడు…. అర్జున్ నవ్వుతు వెళ్లి పట్టుకొని అమ్మమ్మ ఎలా ఉన్నావే అని అడిగాడు పట్టుకొని…. ఒరేయ్ అన్నాయ్ ఎలా ఉన్నావే అని అడగకూడదు రా ఏంటే ఇంత ఉన్నావ్ అని అడగాలి అని అన్నాడు….
ఆ మాటకి కర్ర పైకి ఎత్తి నీకిరోజు నా చేతిలో మూడింది ఆగరా అని చెప్పి వెనకాలే వెళ్లారు…. దమ్ముంటే పట్టుకోవే ముసిలి నువ్వు పట్టుకోగలిగితే అప్పుడు ఒప్పుకుంటా నీకు ఇంకా వయసు ఐపోలేదు అని చెప్పి అన్నాడు….
అబ్బబ్బ ఆపండి రా ఇంకా అమ్మమ్మ నీకు ఎందుకు చిన్న అన్నయ్యతో ఎప్పుడు ఎదో ఒక గొడవ ఇద్దరు అని చెప్పి కాఫీ తెచ్చిచింది అర్జున్ కి అది తీసుకొని నవ్వుతు మీకెందుకో అసలు పడదు ఒకరు అంటే ఒకరికి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా…. అప్పుడే నాన్న అర్జున్ అనే పిలుపు వినిపించి అమ్మ వాళ్ళు వచ్చాశారు రా అని అనింది అమృత….
ఇంక అర్జున్ లేచి ఎదురు వెళ్లి అమ్మ అని పిలిచి భుజం మీద చేయి వేసుకొని తీస్కోచ్చి సోఫా లో కూర్చోబెట్టి ఎందుకు అమ్మ నువ్వు ఇప్పుడు బయటకు వెళ్లడం ఎండ చూడు ఎలా ఉందొ అని అనగానే…. అబ్బో మీ ఆమ్మ ఏమి కాలి నడకన వెళ్లి రాలేదురా కార్ లో నే వెళ్లి వచ్చింది అని చెప్పి వెటకారం గా అన్నారు….
అర్జున్ ఫ్యామిలీ:
అర్జున్:హీరో 
తరుణ్:తమ్ముడు 
అమృత:చెల్లి 
అమ్మ:శుభద్ర
నాన్న:ప్రభాకర్
అమ్మమ్మ:సూర్య కాంతం
హ్మ్ ఇంక రేపటి నుంచి అసలు కథ మొదలు అయ్యిద్ది అసలు వాళ్ళు ఎలా కలుస్తారు ఏంటి అనేది ముందు ముందు తెలుసుకుందాం….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంక సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ 
లక్ష్మి.