New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పరిణయం(అర్జున్💞అన్విత) – 3

పరిణయం(అర్జున్💞అన్విత) – 3

పెద్దోడా ఇవన్నీ లోపల పెట్టరా ఏంటమ్మా ఇవన్నీ అవా మొన్న కొన్ని కొత్తవి తీసుకున్న కదమ్మా అవి నీకు చిన్నోడికి తీసుకున్నాను…. మరి కన్నోడు వాళ్ళకి తర్వాత చూద్దాం లే వాళ్ళకి ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ అవసరం నీకు చిన్నోడికి మాత్రమే అని చెప్పి అన్ని సద్దుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు….

పిన్ని పిన్ని చరి ఎక్కడ ఉన్నావు…. పెద్దోడా ఎవరో వచ్చినట్టు ఉన్నారు చూడు పోమ్మ అలాగే అమ్మ అని చెప్పి మిగతావి సద్దెసి బయటకు వెళ్ళింది…. ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం హా అన్నయ్య ఎప్పుడు వచ్చావ్ రా రా లోపలికి అంటూ తీసుకెళ్ళింది చరిత….
అమ్మా ఎవరొచ్చారో చూడు అంటూ పరిగెత్తుకొని వెళ్ళింది లోపలికి ఎవరు అర్రా అంటూ బయటకు వచ్చి అక్కడ కూర్చొని ఉన్న అతనిని చూసి కన్నయ్య ఎప్పుడొచ్చావ్ రా అమ్మా నాన్న అంతా బాగున్నారా ఎన్నిరోజులు ఐపోయుండాది రా నిన్ను చూసి అని చెప్పి పెద్దోడా అన్న కి కాఫీ ఇంకా చక్రాలు పట్టుకు రా అని చెప్పి పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటు…..
ఇంకేంటి రా విశేషాలు అమ్మ వాళ్ళు కూడా వచ్చారా అక్క ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా భూషణం గారు వచ్చారు…. ఏమే వేణి కాస్త కాఫీ పట్టుకురావే ఒకటే తల పోటుగా ఉంది అని చెప్పి తల పట్టుకొని లోపలికి వచ్చారు…. అయ్యో ఏమైంది అయ్యా ఇందాకే కదా పనికి ఈరోజు ఉండడం చాలా ముఖ్యమని చెప్పారు….
ఇప్పుడు మరి పర్లేదా అని అడిగారు అలివేణి గారు…. హా హా బానే ఉంది కొంచెం కాఫీ పెట్టుకొని రా అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న అతనిని చూసి ఎప్పుడొచ్చావ్ రా ఎంతో కాలం ఐపోయుంది నిన్ను చూసి అని చెప్పి దగ్గరికి తీసుకున్నారు…..
నేను బాగున్నాను బాబాయ్ మీరంతా బాగున్నారా అని అడిగి అవును అన్ను వాళ్ళు ఏరి చరి అని అడిగాడు…. చిన్నోడు బుజ్జోడు కాలేజ్ కి కన్నోడు చిట్టోడు స్కూల్ కి వెళ్లారు అన్నయ్య ఈవెనింగ్ కి వచ్చేస్తారు అని చెప్పింది…. అవునా అయ్యో ఉండుంటే బాగుండేది వాళ్ళు కూడా అని చెప్పి అన్నాడు….
నువ్వు వస్తున్నావ్ అని తెలుసుంటే కచ్చితంగా ఉండేవాళ్ళు నలుగురు అని చెప్పి కాఫీ తెచ్చిచ్చారు వేణి గారు…. నేను అనుకోకుండా వచ్చాను పిన్ని లేకపోతే ఒకమాట ఫోన్ చేసే వచ్చుండే వాడిని అని చెప్పి కాఫీ తాగుతూ ఇంకా ఏవో మాట్లాడుకుంటూ ఉండగా….
అప్పుడే ఎదో గుర్తొచ్చి అవును బాబాయ్ చరి కి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగాడు…. లేదు రా ఇంకా మొదలెట్టలేదు ఇంకా కొంత సమయం కావాలి అంటుంది నీ చెల్లెలు ఏమో అడుగుతుంటే…. నేను ఇంకా మొదలు పెడితే మంచిదేమో అనిపిస్తుంది అని చెప్పి అన్నారు….
అన్నయ్య ఇప్పుడా విషయం గురించి ఎందుకు వదిలేయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది చరిత….అలా వెళ్తున్న చరిత వైపే చూస్తూ అనుమానం గా చూస్తున్నాడు సాగర్ లేదు ఇంకా ఎదో ఉంది ఏంటో తెలుసుకోవాలి అన్విత కి ఏమైనా తెలిసే అవకాశం ఉంది అడిగి చూద్దాం అనుకోని సరే పిన్ని సరే బాబాయ్ ఇంక నేను వెళ్తాను అని చెప్పి లేచాడు….
అదేంటిరా అప్పుడే వెళ్తాను అంటావ్ ఇంకొంచెం సేపు ఉండు తినేసి వెల్దువు గాని అని అడిగేసరికి లేదు పిన్ని పని ఉంది అని చెప్పి మళ్ళీ వీకెండ్ లో వస్తాను అప్పుడు అయితే నాలుగురు కూడా ఇంట్లో నే ఉంటారు కదా అప్పుడు అమ్మ వాళ్ళు కూడా వస్తారు లే అని చెప్పి లేచి ఇంక వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరాడు….
*********
అర్జున్ గ్రూప్ అఫ్ కన్స్ట్రక్షన్స్:
రేయ్ అన్నయ్య నీతో ఎదో పని ఉంది అంట శ్రీనివాస్ రావ్ గారు లైన్ లో ఉన్నారు ఏమి చెప్పమంటావ్…. ఏదోకటి చెప్ప రా బాబు లేకపోతే వదలడు సోది వేస్తూ ఉంటాడు నాకు అసలే ఇక్కడ పిచ్చి పని ఉంది అని చెప్పి మళ్ళీ తన పనిలో తను పడిపోతాడు…..
హా సరే రా అని చెప్పి హలో అర్జున్ సార్ కొంచెం పనిలో ఉన్నారు తర్వాత మాట్లాడతారు అని చెప్పి ఫోన్ పెట్టేసాడు…. సరే రా నేను ఇంక వెళ్తాను నా కేబిన్ లోకి అని చెప్పి వెళ్తాడు…. అలాగే రా అని చెప్పి మళ్ళీ తన పనిలో తను నిమగ్నమైపోతాడు….
ఇంతలో మళ్ళీ ల్యాండ్లైన్ మోగింది స్పీకర్ ఆన్ చేసి హలో హూ ఈస్ థిస్ అని అడిగాడు…. సార్ మీకోసం మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు పేరు సాగర్ అంట అని చెప్పి చెప్పారు….ఏంటి సాగరా ఓకే పంపండి అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ తరుణ్ కి ఫోన్ చేసి హలో రేయ్ సాగర్ వస్తున్నాడు నువ్వు కూడా ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు….
మే ఐ కమిన్ అని డోర్ క్నోక్ చేసి అడిగాడు సాగర్…. అది విని తల ఎత్తి రేయ్ రా రా బాబు నీకు కూడా ఫార్మాలిటీస్ ఏమి లేవు కానీ అని చెప్పి లాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతూ అన్నాడు…. ఏరా ఎప్పుడు వచ్చావు అసలు ఇన్నిరోజులకి వచ్చావ్ అసలు ఒక ఫోన్ లేదు ఏమి లేదు అని చెప్పి చైర్ చూయించి కూర్చోమన్నాడు….
ఇంతలో తరుణ్ లోపలికి వస్తూ ఏరా బావ గా ఎప్పుడొచ్చావ్ ఏమయ్యావ్ అని అడిగాడు….
హ్మ్ సాగర్ అర్జున్ అన్విత లు ఇద్దరికి కామన్ రెలెటివ్ మరి వీళ్ళ పరిచయం ఎప్పుడు జరిగిద్దో అది పరిణయం వరకు ఎలా దారి తీసిద్దో తెలియాలంటే ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్ చూడండి….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంకా సమీక్షలని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ…
మీ
లక్ష్మి.