New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 2

ఎవరిది ప్రేమ? – 2

మేడపైకి వెళ్లిన వసుధ అక్కడ కనిపిస్తున్న దృశ్యానికి నిలబడి అలానే చూస్తూ ఉండిపోయింది…

ఎందుకంటే మేడ పైన వేసి ఉన్న పరుపు మీద ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తూ, రాత్రి చదువుతూ చదువుతూ నిద్రపోయింది అన్నదానికి గుర్తుగా తన గుండెలపైన పుస్తకాన్ని అలానే ఉంచుకుని,కాళ్ళు రెండు ముడుచుకుని ఎంతో ముద్దుగా పడుకుని ఉంటుంది..
ఆ దృశ్యం చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది….
అందుకే వసుధ ముద్దుగా, అమాయకంగా పడుకుని ఉన్న కూతుర్ని  లేపబుద్ధి కాక మురిపెంగా చూస్తూ నిలుచుండిపోయింది…
అలా ఎంతసేపు చూస్తుండిపోయిందో తెలియదు….
కింద పేపర్ చదవడం పూర్తయిన వివేక్ తల పైకెత్తి వసుధ అమ్మాయి ఇంకా లేవలేదా అని అడుగుతాడు….
వసుధ కింద ఉంటేగా పలకడానికి  సో వివేక్ ప్రశ్నకి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి  ఒకటికి రెండు సార్లు పిలిచి అయినా రెస్పాన్స్ లేకపోయేసరికి ఏం చేస్తుంది  ఈ వసుధ? నేను ఇన్ని సార్లు పిలిచినా వినిపించుకోకుండా అంటూ కుర్చీ లో నుండి లేచి వంటింట్లోకి వెళ్లి చూస్తాడు….
అతనికి అక్కడ వసుధ కనిపించలేదు….తరువాత అక్కడ నుండి వాళ్ళ బెడ్ రూమ్ లో, బయట బాల్కనిలో అంతా చూసి ఎక్కడా ఆమె కనిపించకపోయేసరికి హ్మ్ ఇక్కడెక్కడ లేదు అంటే తను ఎక్కడ ఉండి ఉంటుందో అర్ధమై చిన్నగా నవ్వుకుంటూ మెట్లెక్కి మేడపైకి వెళ్తాడు….
పైకి వెళ్లిన అతను మెట్ల చివరన నిలబడి ఒకేవైపు చూస్తూ తనలో తను నవ్వుకుంటున్న భార్యను చూసి ఏంటోయ్ ఈ ఎండలో ఇక్కడ నిలబడి నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావ్ అదేంటో నాకు కూడా చెప్తే నేను నవ్వుతానుగా అంటాడు..
వివేక్ మాటలకి తల తిప్పి వెనక్కి చూసిన వసుధ పైకి వస్తున్న భర్త వైపు ఒకసారి చూసి అటు చూడండి అన్నట్టు పడుకుని ఉన్న కూతురు వైపు కళ్ళతోనే సైగ చేసి చూపిస్తుంది….
వసుధ చేసిన సైగకి అటుగా చూసిన వివేక్ కూడా ఎంతో ముద్దుగా, ప్రశాంతంగా పడుకుని ఉన్న కూతుర్ని చూసి మురుసుకుంటూ నా బంగారం ఎంత ముచ్చటగా పడుకుని ఉందో, నా బంగారు తల్లికి ఎవరి దిష్టి తగలకూడదు అని గాల్లోనే చేతులు తిప్పి దిష్టి తీస్తాడు….
వివేక్ చేసే పనులకి వసుధ నవ్వుకుంటూ హ్మ్ మీ బంగారానికి ఎవరి దిష్టి తగలదు గాని  టైమ్ ఎనిమిది దాటుతుంది కానీ అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదు…..ఇలా అయితే ఈ రోజు కాలేజీ కి వెళ్ళినట్టే అంటుంది…..
ఏం కాదులేవోయ్ ఇంకాసేపు  ప్రశాంతంగా పడుకోనిలే లేచాక ఎలాగూ హడావిడిగా పరుగులు పెడుతూ రెడీ అవుతుంది ఇప్పుడన్నా హాయిగా ఉండనివ్వు అంటాడు వివేక్….
అబ్బో అవునా రాత్రుళ్ళు ఆ పుస్తకాలు ముందేసుకుని  పన్నెండు, ఒంటి గంట దాకా చదవడాలు ఎందుకు,ఇప్పుడు పొద్దు నెత్తి మీదకు వచ్చేవరకు నిద్ర పోవడం ఎందుకు హా …
ఉదయం నుండి సాయంత్రం దాకా ఆ కాలేజ లో చదివచ్చేది సరిపోదు అన్నట్టు రాత్రుళ్ళు కూడా దెయ్యంలా మేడమీద కూర్చుని ఆ పుస్తకాలు తిరగేస్తుంది….
ఎప్పుడు చూడు చదువు, పుస్తకాలు  అంటూ కడుపుకు తిండి, టైం కి నిద్ర ఏవి పట్టించుకోదు.. ఏం పిల్లో ఏంటో  నా కూతురు అందరి పిల్లల్లా పాడవనందుకు సంతోషపడాలో ,పుస్తకాల పురుగులా మారినందుకు బాధపడాలో ఏం అర్ధం కావడం లేదు అంటుంది వసుధ నిట్టూరుస్తూ…..
ఆ మాటలకి అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నీ గోల…అదేంటో మాకీ వింత అందరి అమ్మలు వాళ్ళ పిల్లలు చదువుకోవట్లేదని ఏడుస్తారు..నువ్వెంటిరా అంటే రివర్స్ లో నా బంగారం చదువుతుందని ఏడుస్తావ్ ఏదేమైనా నువ్వో వింత ప్రాణివే వసుధ అంటాడు వెటకారంగా..
హా అవును అవును…నేను వింత ప్రాణిని కాబట్టేగా నిన్ను పెళ్ళి చేసుకున్నాను అంటుంది వసుధ కూడా వివేక్ కి చురక అంటిస్తూ..
దాంతో   హ్మ్ అనుకున్న అనుకున్నా ఇంకా నాకు చురక వేయలేదేంటి అని వేసేసావా ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అంటాడు వివేక్…
హ్మ్ అంతేగా నాతోనే పంచ్ లు వేస్తే ఊరుకుంటానా మరి “వసుధ ఇక్కడ నాతో వెటకారం అంత మంచిది కాదమ్మా అంటుంది” ఒక కనుబొమ్మ పైకి లేపి చూస్తూ..
వసుధ డైలాగ్స్ కి,తన పేస్ ఎక్స్ప్రెషన్స్ కి వివేక్ కి నవ్వు వచ్చి చిన్నగా నవ్వుకుంటాడు..
ఎప్పుడు లేచిందో ఏమో వీళ్లిద్దరి గారాల పట్టి అయిన “ఆద్య ” పైకి లేచి కూర్చుని వీళ్ళిద్దరిని,వాళ్ళ గిల్లి గజ్జాల్ని చూసి పెద్దగా నవ్వుతూ వావ్ అమ్మ నువ్వు సూపర్ అసలు… ఏమన్నా డైలాగ్ వేసావా… ఇంక నువ్వు ఆ కను బొమ్మ  పైకి లేపుతావ్ చూడు  అదయితే హైలెట్ అంటూ తల్లి ముందుకు వచ్చి టక్కున బుగ్గ మీద  గట్టిగా ముద్దు పెడుతుంది.
దాంతో వసుధ తిరిగి ఆద్య కి ముద్దు పెట్టి చూసారా నేనంటే ఏంటో అన్నట్టు వివేక్ ని చూసి కళ్లెగరెస్తుంది….
అది చూసి వివేక్ ఉడుక్కుంటున్నట్టు మొహం పెట్టి  బంగారం ఇదేం బాలేదు..నువ్వు మీ అమ్మకు సపోర్ట్ చేయకూడదు.. చూడు మీ అమ్మ నన్ను ఎలా వెక్కిరిస్తుందో  అని కంప్లైన్ట్ ఇచ్చినట్టు చెప్తాడు.
వివేక్ ఫేస్ చూసి వసుధ, ఆద్యలు నవ్వుకుని యువర్ ఆల్వేస్ సూపర్ హీరో అంటూ ఇద్దరు చెరో బుగ్గ లాగుతారు ముద్దుగా….
దాంతో వివేక్ అందంగా నవ్వుతూ ఇద్దర్ని దగ్గరకి తీసుకుంటాడు…
ముగ్గురు కాసేపు నవ్వుకోగా,వాళ్లపై ఎండ పడేసరికి టైం గుర్తొచ్చి హా ఇంక చాలు చాలు కిందకి వెళ్దాం పదండి .. కాలేజీ కి టైం అవుతుంది అంటూ హడావిడి చేసి వివేక్, ఆద్యలని కిందకి పంపి అక్కడ ఉన్న పరుపు, బెడ్ షీట్స్, పిల్లోస్ అన్నీ  మడతపెట్టి నీట్ గా సర్ది వాటర్ ట్యాంక్ కింద నీడలో పెట్టి కిందకి వెళ్తుంది వసుధ…
ఆమె వెళ్లిన కాసేపటికి ఆద్య స్నానం చేసి రెడీ అయి వచ్చేస్తుంది.దాంతో  ముగ్గురు  కూర్చుని ఒకరికి ఒకరు టిఫిన్ తినిపించుకుంటారు…
తర్వాత వివేక్ పొలానికి,ఆద్య తన బస్సు లో కాలేజీ కి వెళ్ళిపోతారు…
వసుధ  వాళ్ళిద్దరిని పంపేసి గిన్నెలు అన్నీ సర్దేసి మిగిలిన పనుల్లో మునిగిపోతుంది…
continued….