New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 1

ఎవరిది ప్రేమ? – 1

ఉదయం ఆరు గంటల సమయం ….

పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త “వివేక్” దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది “వసుధ”..
ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు పొద్దున్నే  గుడి అంటున్నావు ఏంటి విశేషం అని అడుగుతాడు….
ఆ ప్రశ్నకి ఏం లేదండి ఈరోజు కార్తీక సోమవారం కదా శివాలయం వరకు వెళ్లి, ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి  ఆ శివయ్యని దర్శించుకుని వద్దాం అని అంతే అని సమాధానం ఇస్తుంది వసుధ.
ఓహో కార్తీక మాసం వచ్చింది కదూ నేను ఆ విషయం మరిచేపోయాను…ఈ నెలంతా నీ పూజలు, ఉపవాసాలు, భక్తి అంటూ ఇంట్లో  పప్పులు, వేపుల్లు చేసి మా మోహన పడేసి మమ్మల్ని నాన్వెజ్ తిననివ్వకుండా చేస్తావ్ కదా.
 చ్చ నేను ఇంత పెద్ద విషయం ఎలా మర్చిపోయాను అబ్బా ..నాకే కనుక ముందే గుర్తుంటే మొన్న సండే ఇంకో కిలో ఎక్సట్రా చికెన్, మటన్ తెచ్చుకుని తినేవాళ్ళం..
అయినా ఇప్పుడు అనుకోని ఏం లాభంలే అంత మా కర్మ..నీ భక్తి వల్ల ఈ నెల మొత్తం మాకీ తిప్పలు తప్పవు…
ఏం చేస్తాం చేసుకునోళ్ళకి చేసుకున్నంత అని ఏరి కోరి మరీ నిన్ను పెళ్ళి చేసుకున్నాగా అనుభవించక తప్పదు అంటూ చిన్నగా గొణుక్కుంటూ ఉంటాడు వివేక్….
వివేక్ చిన్నగా అనుకున్న సరే ఆ మాటలు, అతని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అర్ధం అయిన వసుధ  చిన్నగా నవ్వుకుంటూ  హ్మ్  మీ మాటలు అన్నీ నాకు వినిపిస్తున్నాయి అంటుంది పైకి కోపం నటిస్తూ.
వినిపిస్తే ఏంటంట ఉన్నదేగా అన్నాను.. అయిన నీ పిచ్చిగాని  దేవుళ్ళు అది తినొద్దు ఇది తినొద్దు. అలా ఉండాలి ఇలా ఉండాలి.. ఇలా నాన్వెజ్ మానేసి పూజలు చేస్తేనే  మీ కోర్కెలు తీరుస్తాను అని ఎక్కడైనా చెప్పాడంటే..లేదుగా ఆ విధంగా ఎక్కడా చెప్పలేదు…
ఎందుకంటే దేవుళ్ళు మనలా శాడిస్టులు  కాదు కాబట్టి  ఏ రూల్స్ పెట్టలేదు….కానీ మనలో మనమే  పూటకో రూల్ పెట్టుకుని ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటాం అంటాడు  ఏదో వేదాంతం చెప్పినట్టుగా….
భర్త మాటలు అన్ని విన్న వసుధ హ్మ్  మీ బోధన అయిపోతే వెళ్లి రెడీ అయ్యి రండి గుడికి వెళ్దాం.. మీ క్లాస్ లు వినే టైం, తీరిక రెండు లేవు నాకు ఇప్పుడు అంటుంది ఆయన మాటల్ని కొట్టిపారేస్తూ….
(ఫ్రెండ్స్ ఇలా రాసానని నాకు దేవుడు, పూజలపై నమ్మకం లేదనుకునేరు అమ్మమ్మో నాకు  దేవుళ్ళ మీద చాలా భక్తి, నమ్మకం ఉన్నాయబ్బా  ఇదంత స్టోరీ లో భాగం అంతే  తప్పుగా అనుకోకండి ప్లీజ్ 🙏)
దాంతో వివేక్ హుష్ అనుకుంటూ ఊపిరి బయటకి వదులుతు నీకెన్ని చెప్పిన “చెవిటోటి ముందు శంఖం ఊదినట్టేగా” నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ అంటూ తల కొట్టుకుంటూ రెడీ అవడానికి రూమ్ లోకి వెళ్తాడు…
వివేక్ చేష్టలకి వసుధ నవ్వుకుంటూ పూజ.బుట్ట సిద్ధం చేస్తుంటుంది…
అయిదు నిముషాల్లో వివేక్ రెడీ అయి వస్తాడు.. వసుధ పొద్దున్నే రెడీ అయిపోయి ఉండడంతో ఇద్దరు కలిసి బైక్ లో గుడికి వెళ్తారు…..
దగ్గరే కావడంతో పది నిముషాల్లోనే గుడికి చేరుకుంటారు….
బండి దిగి వెళ్లిన ఇద్దరు ముందుగా బయట ఉన్న ట్యాప్ దగ్గర్ర కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్లి  పక్కనే ఉన్న ఉసిరి చెట్టు కింద  పిండితో ముగ్గు వేసి, తమలపాకులు ఉంచి, అందులో పసుపుతో గౌరీ దేవిని చేసి,కుంకుమతో బొట్టు పెట్టి, అక్షింతలు చల్లి, ప్రమిద పెట్టి  101 వత్తులతో  నెయ్యి దీపం వెలిగిస్తారు……
(ఇందులో తప్పేమయినా ఉంటె మన్నించండి నాకు తెలిసింది రాసాను )
తర్వాత  వినాయకుడి దగ్గర ,ద్వజస్తంభం దగ్గర, నాగ దేవత పుట్ట దగ్గర ఇలా చాలా చోట్ల దీపాలు వెలిగించి  చివరగా ఆ పరమ శివుణ్ణి కన్నులార దర్శనం చేసుకుని, పూజ చేయించుకుని, ఆయనకి మనస్ఫూర్తిగా  నమస్కారం చేసుకుని, తీర్థ, ప్రసాదాలు స్వీకరించి  కాసేపు గుళ్లో కూర్చుని , ఆ శివ నామ స్మరణ చేసుకుని, మిగిలిన ప్రసాదం  అక్కడ ఉన్న పిల్లలకి పెట్టి ప్రశాంతంగా తిరిగి ఇంటికి వెళ్తారు…..
ఇంటికి వెళ్లిన వసుధ నేరుగా కిచెన్ లోకి వెళ్లి వివేక్ కి కాఫీ పెట్టి చిరునవ్వుతో ఆయన చేతికి  వేడి వేడి కాఫీ కప్ అందించి  టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతుంది…..
వివేక్ ఏమో ఇందాక మధ్యలో వదిలేసిన పేపర్ లోని వార్తల్ని చదువుతూ కాఫీ తాగుతుంటాడు…
వంటింట్లోకి వెళ్లిన వసుధ  పూరి, ఆలు కర్రీ ప్రిపేర్ చేసి  అన్నీ హాట్ బాక్స్ లో సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ  గోడ మీదున్న గడియారం లో టైమ్ చూసి  ఓహ్ టైమ్ ఎనిమిది అవుతుంది….
అమ్మాయి ఇంకా కిందకి రాలేదు ఏం చేస్తుంది ఇదింకా పైన ఎండ ఇంతలా వస్తుంటే అంటూ తనలో తనే అనుకుంటూ మేడపైకి వెళ్తుంది……
మేడపైకి వెళ్లిన వసుధ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అలానే నిలబడి చూస్తుండిపోయింది…….
continued…