New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 1

మహారాణా ప్రతాప్ – 1

భారతదేశ చరిత్రలో ధైర్యం , శౌర్యం మరియు త్యాగానికి ఎంతో స్ఫూర్తిదాయకం అతను . .

మేవార్ యొక్క సిసోడియా రాజ వంశంలో బాప్పా రావాల్ , రాణా హమీర్ , రాణా సంగా వంటి ఎంతో మంది గొప్ప రాజులు పరిపాలన చేశారు . .

వారందరినీ రాణా అని పిలిచేవారు . . కానీ ఒక్క వ్యక్తిని మాత్రమే  ” మహారాణా ” అన్న పేరుతో గౌరవించారు . .

చాలా మంది ధైర్యవంతులు అయిన రాజ్ పూత్ రాజులు , మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఇచ్చిన ప్రలోభాలకు లోబడి అతని ఆధిపత్యాన్ని స్వీకరించి దాసోహం అయ్యారు . .

రాజస్థాన్ మాత్రమే కాదు . . . భారతదేశం మొత్తం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది . .

ప్రతీ ఒక్క రాజు అక్బర్ కి తలోంచాడు . . ఇలాంటి కష్టతరమైన సమయంలో మాతృభూమి స్వేచ్ఛను కాపాడడానికి ఒక్క రాజ్ పుత్ రాజు మాత్రం నేనున్నాను అంటూ దేశానికి ధైర్యాన్ని అందించాడు . .

అతను ధైర్యం , శౌర్యం , త్యాగం , దయ మరియు ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండి , మొఘలుల నుండి భారత దేశాన్ని మరియు హిందూ మతాన్ని రక్షించడానికి జీవిత కాలం అంతా స్వచ్ఛ కోసం పోరాడాడు . .

నిజానికి అతని ముందు గాని , అతని తరువాత గాని అలాంటి యోధుడు పుట్టలేదు . .

అతనిని భరతమాత వీర పుత్రుడిగా పిలిచారు . .

అతని పేరు మహా రాణా ప్రతాప్ సింగ్ . . .

మహారాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం చెప్పడానికి రెండు ఉదాహరణలు . . .

అబ్రహం లింకన్ భారతదేశ పర్యటన నిమిత్తం భారత దేశానికి రావాల్సి ఉంది . .

అతను భారతదేశానికి బయలుదేరుతూ తన తల్లిని  ” భారతదేశం నుండి ఏమి తీసుకొని రావాలి ” అని అడిగాడు . .

దానికి అతని తల్లి  ” రాజస్థాన్ లోని మేవార్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా . . . అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారతదేశాన్ని ఇస్తాను అని అక్బర్ ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు ” అని చెప్పింది . .

కానీ కొన్ని కారణాల రీత్యా లింకన్ పర్యటన రద్దు అయింది . .

ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి . .

ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది . . కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో ఆఖరికి అమెరికాని ఓడించింది . .

అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు . .

” ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే , అమెరికాని ఓడించి యుద్ధంలో ఎలా గెలిచారు ”

” అన్నీ దేశాలలోకెల్లా శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు , శ్రేష్టమైన దేశభక్తి గల భారతీయ రాజు చరిత్రను చదివాను . .అతని జీవనం నుండి ప్రేరణపొంది యుద్దనీతి , ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము . . ”

” ఎవరా భారతీయ మహారాజు . . ? ”

వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ,  ” అతడే రాజస్తాన్ లోని మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్ సింగ్ ” అని అన్నాడు . . మహారణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు కనబడింది . .

” ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే , ఈపాటికి మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం . . ” అంటూ చెప్పాడు . .

కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు . . అయితే అతని సమాధి మీద  ” ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది ” అని రాసి పెట్టారు . .

కాలాంతరంలో వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకి వచ్చాడు . . మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ గారి సమాధి అతనికి చూపించారు . . ఆ తరువాత ఎర్రకోట , ఇంకా చాలా చూపించారు . . ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగ మంత్రి ,  ” మహారణా ప్రతాప్ గారి సమాధి ఎక్కడ . . ? ” అని అడిగాడు . .

ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్ లో ఉన్నదని చెప్పాడు . .

విదేశాంగ మంత్రి అక్కడ నుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి సమాధి పక్కన ఉన్న పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు . .

ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు . .

” ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది . . ఈ మట్టిని తీసుకెళ్లి మా దేశం మట్టిలో కలుపుతా . . మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు . . మహారాణా ప్రతాప్ గారు ఈ దేశమే కాదు , ప్రపంచమే గర్వించదగ్గ రాజు ” అని అన్నాడు

మహారణా ప్రతాప సింగ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది . . చేతి కవచం , శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి . .

అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి . . ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి . .

అతను సాటిలేని ఒక గొప్ప యోధుడు . . చాలా ప్రతికూల పరిస్థితులలో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసాడు . .

ఇది సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు . . మేవార్ మహారాజు అయినప్పటికీ అతని జీవితంలో ఎక్కువ భాగం అడవులు మరియు పర్వత ప్రాంతాలలోనే గడిపారు . .

తన అత్యున్నత సంకల్ప శక్తి మరియు సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో మేవార్ ని శత్రువుల భారీ నుండి విడిపించగలిగాడు . .

తన ఆనందం మరియు లాభాలను త్యాగం చేస్తూ , మాతృభూమి స్వాతంత్ర్యం కొరకు నిరంతరం కష్టపడ్డాడు . . ఇది చరిత్రలో ఒక సువర్ణధ్యాయం . .

అతని వ్యక్తుత్వం మరియు మాతృ భూమి పై గల అపారమైన ప్రేమ , నేడు జాతీయ స్పృహ తగ్గిపోతున్న సమాజానికి ఎంతో ఆదర్శం . .

అతను చనిపోయే వరకు మేవార్ జండా ని పైకి ఎత్తి నిలబడ్డాడు . .

దాని కారణంగా అతను మాత్రమే కాదు , అతని కుటుంబం కూడా ఎన్నో అవస్థలు మరియు దుఃఖానికి గురి కావలసి వచ్చింది . .

అలాంటి గొప్ప రాజు మన దేశంలో పుట్టడం మన దేశానికి గర్వకారణం . . కానీ అంత గొప్ప వీరుడి గురించి మీలో ఎంతమందికి తెలుసు . . ?

ఇంతకీ ఎవరు ఈ మహారాణా ప్రతాప్ సింగ్ . . ?

అంత పెద్ద మొఘల్ శక్తిని ఏ విధంగా ఎదురుకున్నాడు . . ?

అసలు ఈ మేవార్ లో రాణా ప్రతాప్ వంశం ఎలా మొదలైంది . . అందులో ఉన్న గొప్ప వీరులు , వీరనారీమణులు ఎవరు . . ?

ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి . . .

వెళదామా . . ? ఒక గొప్ప భారతీయ రాజు అయిన మన మహారాణా ప్రతాప్ సింగ్ గారి జీవితంలోకి . . ?

 

ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా చదవమని చెప్పండి.

ఎందుకంటే అంత గొప్ప వీరుడి కథను వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని నా కోరిక . . .

ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలతో నన్ను ప్రోత్సాహించి , సబ్స్క్రయిబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు . . .

– మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’