New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 2

మహారాణా ప్రతాప్ – 2

రెండవ భాగం :


మేవార్ రాజ్యం :

భారతదేశం :

కొన్ని వందల సంవత్సరాల క్రితం :

క్రీస్తుకు చాలా శతాబ్దాల పూర్వం మేవార్ లో ప్రజా జీవితం ఉనికిలో ఉండేదని చాలా ఋజువులు ఉన్నాయి . . మేవార్ నదుల ఒడ్డున మానవ స్థావరాలు ఉన్నాయి అనేది నిజం . . మేవార్ చరిత్ర చాలా పురాతనమైనది . .

మేవార్ చాలా విశాలమైన రాజ్యం . . ఈ మేవార్ రాజ్యం భారతదేశం లోని భౌగోళిక స్థానం 23 . .49 నుండి 25 . .58 ఉత్తర అక్షాంశం లో మరియు 73 . .1 నుండి 75 . .49 వరకు దక్షిణ రేఖాంశం వద్ద ఉంది . . ఈ మేవార్ రాజ్యాన్ని నాలుగు సహజ మండళాలుగా విభజించవచ్చు . . .

పశ్చిమ పర్వత శ్రేణి , తూర్పు పర్వత శ్రేణి , దక్షిణ పర్వత శ్రేణి మరియు మధ్య మైదానాలు . . . పశ్చిమ పర్వత శ్రేణి ఉత్తరం నుండి మొదలై దక్షిణాన దేవాల్ అనే ప్రాంతం వరకు చేరుకుంటుంది . . ఈ పర్వత శ్రేణినే ఆరావళి పర్వతలుగా పిలుస్తారు . . ఈ ఎత్తైన ఆరవళి పర్వతాల శిఖరం కుంబల్ ఘర్ ప్రాంత సమీపంలో జార్గా అనే ప్రదేశంలో ఉంటుంది . . దీని ఎత్తు సమద్ర మట్టానికి 4315 అడుగుల ఎత్తులో ఉంటుంది . . ఈ పర్వతాలలో అనేక ఇరుకైన గుహలు ఉన్నాయి . . వీటిని నాల్ అని పిలుస్తారు . . బయటి నుండి లోపలి వైపు భాగానికి శత్రువులు చొరబడకుండా ఈ నాల్ లో భద్రతా ఏర్పాట్లు చేస్తారు . .

మేవర్ లోని ఒక వైపు భూభాగాన్ని మేవాల్ అని , రెండవ వైపు భూభాగాన్ని మేర్వార్ అని పిలుస్తారు . . నిజానికి మేవార్ ని మేవాడ్ అని కుడా పిలుస్తారు . . రాజ్ సముద్రా , పిచ్చోలా , ఫతేసాగర్ మరియు స్వరూప్ సాగర్ అనే సరస్సులు మేవార్ ప్రాంతం అంతటా విస్తరించి ఉన్నాయి . .

మేవార్ రాజ్య ఉత్తర ప్రదేశం ఏటవాలుగా ఉంటుంది . . అక్కడ బనస్ అనే నది మరియు బేరచ్ అనే ఉపనదులు ప్రవహిస్తున్నాయి . . యమునా నదికి ఉపనది అయిన చంబల్ నది ఈ రాజ్యానికి వాయువ్య ప్రాంతంలో ప్రవహిస్తోంది . . దక్షిణ ప్రాంతం పర్వతమయంగా ఉండి , బనస్ అనే నది , దాని ఉపనదులను విడదీస్తోంది . . ఈ ప్రాంతం నుంచే సబర్మతీ , మహీ నదులు మరియు వాటి ఉపనదులూ గుజరాత్ రాష్ట్రంలోని ఖంభట్ అనే ప్రాంతంలోకి ప్రవహిస్తాయి . . ఈ రాజ్యానికి వాయువ్య దిశలో ఆరావళీ పర్వతాలు సహజ సరిహద్దుగా ఉంటాయి . .

ఆరవ శతాబ్దంలో ఈ మేవార్ భూమిపై తమ రాజ్యాన్ని స్థాపించి సరికొత్త రాజవంశానికి పునాదులు వేసిన మొదటి రాజు గుహదిత్య . . ఇతను ఈ రాజవంశానికి మొదటి పాలకుడు . . అందువల్ల ఈ రాజవంశాన్ని గుహిల్ లేదా గుహిలోట్ రాజ వంశం అని పిలిచేవారు . . ఈ రాజవంశం యొక్క శాఖలలో ఒకటి అయినా సిసోడియా రాజ వంశంగా కూడా పిలిచేవారు . .

గుహదిత్య బాలమి రాష్ట్రానికి చెందిన వాడు . . అతను తన తండ్రి మరణించిన తరువాత అతని అనుచరులతో ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టి , అక్కడి నుండి ఈదార్ మీదుగా నాగ్డా చేరుకున్నాడు . . అప్పుడు అతనికి తెలిసిన ఒక రాజ్యం మేవార్ . . అందువల్ల తన అనుచరులతో కలిసి అక్కడి నుండి మేవార్ పై దండయాత్ర చేసి మేవార్ ని గెలుచుకున్నాడు . . మేవార్ రాజ్యాన్ని కైవసం చేసుకున్న తర్వాత తన సిసోడియా రాజ వంశాన్ని స్థాపించాడు గుహదిత్య . .

ఈ సిసోడియా రాజ వంశం సూర్యవంశం కోవకు చెందినది . . ఈ రాజవంశం సాంప్రదాయకంగా ‘ఇక్ష్వాకు కుల తిలకుడు‘ అయిన శ్రీ రామ చంద్ర మూర్తి పుత్రులలో ఒక్కరు అయినా కుశుడు సంతతిగా సూర్య వంశాన్ని సిసోడియా రాజవంశంగా కొనసాగిస్తున్నారు!

గుహదిత్య తరువాత ఈ మేవార్ ని పరిపాలించిన గొప్ప రాజు అయినా బప్పా రావల్ కూడా ఈ రాజ వంశం నుండి వచ్చాడు  . . చిత్తోర్ రాజు అయిన రాజా మాన్ సింగ్ ని ఓడించి చిత్తోర్ ని గెలుచుకున్నాడు . . ఈ విధంగా చిత్తోర్ కూడా మేవార్ రాజ్యంలో భాగం అయింది . .

బప్పా రావాల్ పాలన క్రీస్తు శకం 734 నుండి 753 వరకు జరిగింది . . విదేశీ అరబ్ రాజులు భారతదేశంపై దండయాత్ర చేసినపుడు తన మాతృభూమిని తన  ధైర్యసాహసాలతో రక్షించిన గొప్ప వీరుడు బప్పా రావాల్ . . అతని తరువాత అతని వారసుడు ఖుమానా మేవార్ రాజ్యాన్ని పాలించాడు . . 812 నుండి 836 వరకు వారి పాలన కొనసాగింది . .

ఖుమానా పరిపాలన అనంతరం అతని వారసులు పరిపాలన కొనసాగించారు . . 1191 లో మేవార్ కి సుమెర్ సింగ్ రాజుగా పరిపాలన మొదలు పెట్టారు . . ఈ సమయాన షాహబుద్దీన్ ఘోరీ భారతదేశంపై దండయాత్ర చేశాడు . . సుమెర్ సింగ్ యొక్క ఎనిమిదవ వారసుడు అయినా రావల్ రతన్ సింగ్ మేవార్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించి పరిపాలన చేయడం మొదలు పెట్టాడు . . రతన్ సింగ్ భార్య పేరు నాగ మతి . . ఒకరోజు రావల్ రతన్ సింగ్ కి సింహాల రాజ్యం నుండి స్వయంవరానికి ఆహ్వాన పత్రం అందింది . . దాంతో సింహాల రాజ్యానికి బయలుదేరాడు రావల్ రతన్ సింగ్ . .

 

◆ ◆ ◆ ◆ ◆ ఇంకా ఉంది ◆ ◆ ◆ ◆ ◆

ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలతో నన్ను ప్రోత్సాహించి , సబ్స్క్రయిబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు! మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’