సమ్మోహనం – 1
ఓం నమఃశివాయ
జై శ్రీరామ్
జై హనుమాన్
…..
కడప…
ఇంకా చీకట్లు పరుచుకున్న సమయం,
తెల్ల వారుతుంది అనడానికి గుర్తుగా చల్లని పవనాలు అందరినీ అల్లరి చేస్తున్నాయి.
సమయం చూస్కోగా, మూడు గంటల ముప్పై నిమిషాలు అవుతోంది.
పట్టణానికి కిలోమీటర్ దూరం లో ఉన్న కళ్యాణ మండపం, ఇద్దరిని ఒకటిగా చేసి నవ దంపతులుగా మార్చడానికి ముస్తాబయ్యింది.
చీకటిని తరిమి కొడుతూ, విద్యుత్ దీపాల వెలుగులు అర కిలోమీటర్ వరకు వ్యాపిస్తున్నాయి.
వచ్చి పోయేవారు కాదు, ఉన్న వారే అటు ఇటు తిరగడం తో మండపం లో ఇంకొంచెం కోలాహలం నెలకొంది.
పిల్లలు నిద్రలేవడం లేదు,
వారి తల్లులు పిల్లల్ని భర్తలకి అప్ప చెప్పి ముహుర్తం కోసం రెడీ అవుతున్నారు,
పట్టు చీరలు కట్టుకుంటూ, నగలు పెట్టుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ.
కాస్త ఎదిగిన పిల్లలు లంగా వోనీలు వేసుకుని దాని మీదకి ఒడ్డానం పెడితే బాగుంటుందా, హెయిర్ లూస్ గా వదిలేస్తే అట్రాక్టింగ్ నా, లేక అల్లి జడగంటలు తగిలిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ అమ్మలతో రెండు మొట్టికాయలు మూడు చివాట్లు తింటున్నారు.
ఇక్కడ ముస్తాబులు అవుతూండగానే,
మండపం వంట సిబ్బంది వారు అందరికి వేడి వేడి కాఫీలు టీలు అందచేస్తున్నారు.
చందు చందు!!! అంటూ అక్కడికి వచ్చింది ఒకామె హడావిడి గా!!
హ అక్క!! ఇక్కడే ఉన్నాం!! అంటూ జడలో జాజులు తురుముకుంటూ బదులిచ్చింది ఆ చందు అనే ఆమె.
మీ ముస్తాబులు అయిపోతే చిన్నూ దగ్గరికి వెల్లండే!! నలుగు పెట్టాక అలాగే ఉంది, స్నానం చేయించి రెడీ చేయండి!!
అంటూ హడావిడిగా చెప్తోంది ప్రమీల.
హా!! అక్క అయిపోయింది అంటూ చందూ, తన ఇంకో చెల్లి పుష్ప ని తీసుకుని చిన్నూ అలియస్ పెళ్ళి కూతురి రూమ్ కి బయలుదేరింది.
బ్రింజాల్ కలర్ సింపుల్ సిల్క్ చీర,
సింపుల్ గా నగలు,
కాల్లు చేతులు మొహానికి ఫుల్ల్ గా అంటిన పసుపు తో, బెడ్ మీద కూర్చుని ఉంది చిన్ను మౌనంగా!!
అక్క చెల్లెలిద్దరూ చిన్నూ ని చూసి,
అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో కదా!! అనుకుంటూ ఒకరినొకరు చూసుకుని లోపలికి వెల్లారు.
టవల్, సోప్, షాంపూ ఒకరు తీస్తూంటే,
ఇంకొకరు చిన్నూ బారెడు జడను విప్పుతూ ఉన్నారు.
నీట్ గా వేడి నీల్ల తో స్నానం చేయించి చిన్ను ని తీసుకొచ్చి మల్లీ నార్మల్ చీర కట్టించి కూర్చోబెట్టారు.
చిన్నూ!!
తలెత్తి పిన్నిలిద్దరి వైపు చూసింది.
ఎందుకు రా సైలెంట్ గా ఉన్నావ్??
భయంగా ఉందా??
అదేం లేదన్నట్టు తలూపి,
మల్లి కల్ల ని నేలకప్పగించి కూర్చుంది.
ఇంతలో ఎవరో డోర్ దగ్గర్నుంచి పిలవడం తో, అటు గా చూసారు.
అక్క!! తనకి ప్రధానం చీర ఇవ్వడానికి వచ్చాను!! అని ఒక పల్లెం లో పట్టు చీర కొన్ని నగలు, ఇంకా పూల జడ తీసుకుని వచ్చింది కవిత.
రామ్మా!! అని చందు పుష్ప అడ్డు తీయగానే,
చిన్నూ ని చూస్తూ అవి అక్కడ పెట్టేసి చిన్నూ పిన్నులకి హెల్ప్ చేస్తూ ఉంది కవిత, పెళ్ళి కొడుకు అక్క!!!
***
తెల్లని కట్ బనియన్, పంచె లో,
ఇక్కడ కూడా చేతులకి కాల్లకి పసుపు రాసి ఉండి,
సిగ్గు కి భుజం చుట్టూ టవల్ కప్పుకుని రూమ్ లో కూర్చుని ఉన్నాడు మన పెల్లి కొడుకు.
బావా?? వేడి నీల్లు రెడీ రా!!
అంటూ పనోల్లతో రెండు బక్కెట్లు తీసుకొస్తూ అన్నాడు నవీన్.
అతని వైపు చురుగ్గా చూస్తూ,
ఇంత సేపు ఏంట్రా!! అసలే చిరాగ్గా ఉంది అంటూ వాష్రూమ్ లోకి ఫాస్ట్ గా వెల్లిపోయాడా పెల్లి కొడుకు.
***
మూహుర్త సమయం దగ్గర పడే కొద్ది,
మిస్టర్ పంతులు గారు అందరిని హడావిడి చేసేస్తూ కంగారు పెట్టేస్తున్నాడు.
ప్రమీల అప్పటికి ఇంకా రెడీ అవ్వకపోవడం తో,
పనులు చూసుకుంటూనే తన వైపు చూస్తున్న భర్త మారుతి చూపులకి భయపడుతూ,
చెల్లెల్లు ఉన్న రూమ్ లోకి రెడీ అవ్వడానికి వెల్లింది.
కూతురి పెళ్ళంటే మాటలా!!
ఈయనకేమి రెడీ అయి కూర్చుని పనులు చేస్కుంటున్నారు నాకు అలా కుదురుతుందా!! అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవ్వి వచ్చి మల్లీ హడావిడిగా పనులు చేస్తూ ఉంది.
***
ఆఫ్టర్ సమ్ టైమ్….
కట్ చేస్తూ!!
పంతులు గారు,
ఆయన పక్కనే పూజ చేస్తున్న మిస్టర్ పెళ్ళి కొడుకు.
మరీ పాతకాలం అలాగని ఫ్యాషన్ గా షేర్వానీ కాకుండా తెల్లని పట్టు బట్టల్లో రారాజు లా ఉన్నాడు పెళ్ళి కొడుకు.
సిక్స్ ఫీట్ హైట్,
లోపల సిక్స్ ప్యాక్ బాడీ తో పిచ్చ హ్యాండ్సమ్ గా,
నుదుటున కట్టిన బాసికం, బుగ్గన దిష్టి చుక్క, పారాణి చేతులు, నవ్వకపోయినా నవ్వుతున్నట్టున పెదవులు,
ముఖ్యంగా డింపుల్స్ తో పెళ్ళికి వచ్చిన ఆడపిల్లలు కూడా సైట్ కొట్టేలాగా ఉన్నాడు మన వరుడు.
అమ్మా!! పెళ్ళి కూతురిని తీసుకురండి!! అని పంతులు గారు అనడం ఆలస్యం,
వైషు, సాయి, వేద!! చిన్నూ ని తీసుకొస్తున్నారు.
మెంతి రంగు నీలి రంగు కలబోసి నేసిన మాధవరం పట్టు చీర,
మెడలో లక్ష్మీ హారం, లాంగ్ చెయిన్, వరుడి వంశ పారంపర్యంగా వస్తున్న కాసుల పేరు,
పూల జడ, నాగరం బిల్ల, బుట్ట కమ్మలు మాటీలు చెంప స్వరాలు,
చేతికి ఒకటిన్నర డజన్ చొప్పున ఎరుపు, ఆకుపచ్చ కలబోసిన మట్టి గాజులు, కాళ్ళ కి పారాణి తో పాటు వెండి గజ్జెలు,
ముఖ్యంగా బూరెల్లాంటి బుగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క, చూసిన వెంటనే మాయదారి కల్ల దిష్టి అంతా పోయేట్టుగా ఉంది.
ఆమె అడుగు లో అడుగు వేస్తూ వస్తున్నా కూడా,
మిస్టర్ పెల్లి కొడుకు గారికి ఆమె అందెల చప్పుడు తెలియచేస్తూ,
గుండె వేగాన్ని పెంచుతోంది.
అమ్మయిని ఎదురుగా కూర్చోబెట్టడం ఆలస్యం బావ కి అక్కని కనిపించకుండా అడ్డు తెర పెట్టేస్తారు ఆ మరదల్లు.
కోడలిని మనసారా చూస్కుంటూ ఉంది రుక్మిణి వరుడి తల్లి.
కన్యాదానం ఘట్టం రావడం తో,
అమ్మాయి పక్క ప్రమీల మారుతీలు కూర్చుంటే
అబ్బాయి పక్క రుక్మిణి, మాధవ్ కూర్చున్నారు.
కన్యాదానాన్ని పంతులు గారు చెప్పినట్టు చేస్తు,
కూతురి చేతుల్ని, అల్లుడి చేతుల్లో పెట్టి కన్యాదానాన్ని ముగించారు.
వీయంకులిరుగురు తాంబూలం తో కూడిన పట్టు వస్త్రాలు మార్చుకోగా!!
జీలకర్ర బెల్లం వధూవరులకి ఇస్తూ ఒకరి తల మీద ఒకరిని పెట్టమని చెప్పారు.
ఆ క్షణం కోసం అబ్బాయి వేచి చూడగా,
ఉరకలు వేస్తున్న మనసుని అదుపు చేసుకుంటూ అదే చిరునవ్వుతో అమ్మాయి తల మీద జీలకరా బెల్లమ్ పెట్టాడు.
అమ్మాయి మాత్రాం ఏ ఫీలింగ్ లేకుండా తల్లి తండ్రి చేయి పట్టి పెట్టిస్తూంటె మరు బొమ్మ లా ఉంది.
మరదల్లు అడ్డు తెర తొలిగించగా,
తలెత్తి, వధువు వైపు ఉత్సాహంగా చూస్తున్న వరుడికి ఆమె దించిన తల నిరాశ నే ఇచ్చింది.
వధూ వరులని పక్క పీటల మీద కూర్చోబెట్టారు.
ఐదు రోజుల వరకు ఆమె రూపం కూడా తెలియదు.
ఇంక గొంతు అసలే వినలేదు,
కాని చూడగానే మనసులో ముద్ర వేసుకున్న ముగ్ద మనోహర రూపం ఆమెది.
ఆమె కి కనీసం అతని రూపం కూడా తెలియదని అతనికి తెలిస్తే???
కెమెరా లేని పెళ్ళి ఉంటుందా??
అసలు ఆ క్వెషన్ నే లేదు కాబట్టి,.
ఫోటో వాడు మంచి పేదు తెచ్చుకోవాలని అన్ని కవర్ చేయాలని ఆత్రుత పడిపోతూ,
చీకట్లో లైటింగ్స్ కి మెరిసిపోతున్న ఫంక్షన్ హాల్ ముందున్న హోడింగ్ నుండి కెమెరా స్టార్ట్ చేసాడు.
కాబోయే దంపతుల ఫోటోల తర్వాత ఇరుగురి పేర్ల ని పూల తో అలంకరించి ఉన్న అక్షరాల వైపు కెమెరా ని జూమ్ చేసాడు కెమెరామ్యాన్!!
అక్కడ ఉన్న పేర్లు ఏంటంటే???
ఆశ దోష అప్పడం వడ!!
ఇప్పుడు చెప్పను! 😛😜
Continues….
Swipe left/right or tap the sides to turn pages