సమ్మోహనం – 2
కాబోయే దంపతుల ఫోటోల తర్వాత ఇరుగురి పేర్ల ని పూల తో అలంకరించి ఉన్న అక్షరాల వైపు కెమెరా ని జూమ్ చేసాడు కెమెరామ్యాన్!!
అక్కడ ఉన్న పేర్లు ఏంటంటే???
హర్షిత్ నందన్ ❤️ హాసిని
అలా బయట నుండి తీస్తూ, లోపలికి వచ్చి స్టేజ్ మీదకి కెమెరాస్ సెటిల్ చేసి తీస్తున్నాడు.
హాసిని తన పక్కన కూర్చోగానే, తన మనసు స్పందిస్తూ,
భయం తో వనుకుతున్న ఆమె చేతులని పట్టుకుని గట్టిగా నొక్కి వదిలాడు హర్ష!! అదేనండి మన హీరో!!
ఆ పట్టు కి కోపమొస్తున్నా, సైలెంట్ గా ఉంది మన చిన్నూ!!
బాబూ!! తాళీ కట్టు నాయనా!! అని పంతులు గారు పిలిచేసరికి తేరుకుని పచ్చని పసుపు తాడుకి పుట్టినింటి మెట్టినింటి లాగ ఉన్న తాళి బొట్లని ఇవ్వగానే,
హర్ష్ వాటిని తీసుకుంటూ అమ్మాయి మెడలో మూడు ముల్లు వేసాడు.
వైషు, సాయి, వేదా చిన్నూ జడ ఎత్తి పట్టుకోగా!!
అలా మాంగళ్య ధారన కూడా అయిపోగానే,
మెట్టెలు, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం అన్నీ ఘట్టాలు పరిపూర్ణంగా, ఏ చిన్న మిస్టేక్ లేకుండా వెంట వెంటనే జరిగిపోయాయి.
అరుంధతి నక్షత్రం కోసం బయటికి వచ్చిన వారికి,
నిజంగానే లైట్ గా చుక్కలు కనబడ్డం తో అదే అరుంధతి అనుకుంది చిన్నూ!! అండ్ కో ( సిస్టర్స్)
అన్నీ తంతులు కేవలం ఒక బొమ్మ లాగా చేస్తోంది తప్ప ఆమె మనసులో సంఘర్షణ ఎవ్వరికీ తెలియదు.
పంతులు గారు, గృహప్రవేశానికి మూహుర్తం చెప్పి, స్ంచి సర్దుకుంటున్న టైమ్ కి చీకట్లను పారద్రోలి భానుడు ఉదయిస్తూ లోకానికి వెలుగుని పంచాడు.
అప్పటికే టిఫినీలు తినడం సగం పూర్తవ్వడం తో,
వధూవరలకు కొన్ని ఫోటోలు గెస్ట్లతో తీయించి, వాల్లకి కొన్ని స్టిల్ల్స్ తీసి, కుటుంబ సభ్యులతో స్పెషల్ గా తీస్తే,
వైషు చిన్నూ ఫేవెరెట్ చెల్లి గా అక్కడ ఎఫ్ 2 సినిమా రిపీట్ అయ్యింది.
కాని మన హర్ష బాబు, వెంకటేష్ లాగా రీసీవ్ చేస్కోలేదు లేండి.
హర్ష కి చిన్నూ కి, టిఫిన్ తీసుకొని వచ్చింది కవిత.
ఫోటో గ్రాఫర్ ఆ సన్నివేషాన్ని కూడా వదలకుండా స్టిల్స్ తీస్తున్నాడు.
అలా అలా ఒక గంట అయ్యాక,
వచ్చిన ఆహ్వానికులు సగం మందీ ఖాళీ అయ్యాక
వరుడి కార్ ఫంక్షన్ హాల్ లో స్టార్ట్ అవ్వింది.
చిన్నూ ని పట్టుకుని, వాల్ల అమ్మ పిన్నులు కంట తడి పెట్టుకుంటూంటే,
చిన్నూ మాత్రం సైలెంట్ గా ఉంది లోపల అంతులేని బాధ కలుగుతున్నా కూడా!!
బాబు!! మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాం, ఇంక అంతా నువ్వే చూస్కోవాలి!! అని చిన్నూ చేతులు హర్ష చేతుల్లో పెట్టడం తో,
మీరు అంతగా చెప్పాలా అత్తయ్యా!!
నా కంటి పాపలా, నా ప్రాణంగా చూస్కుంటాను!! అని వాల్లకి గుండె అంచుల్లోంచి చెప్పి కాస్త ఊరటనిచ్చాడు హర్ష.
అప్పటికి కూడా చిన్నూ కి అతన్ని చూడాలి అనిపించడం లేదు,
కాని మాటలు మాత్రం చెవుల్లో కి దూరిపోయాయి.
అందరూ అదే ఊర్లో ఉన్న దక్షిణ దిక్కుగా పయనమైతే,
కూతురు అత్తారింటికి వెల్లిందన్న బాధతో, బారమైన మనసులతో ఉత్తర దిక్కుకు వెల్లిపోయారు చిన్నూ తరపోల్లు.
హై వే నుండి స్మూత్ గా కార్ సాగుతోంటే,
కార్తీక మాసం కి దగ్గర్లో ఉన్నందువల్ల శీతల పవనాలు కార్ విండో నుండి హర్ష చిన్నూ లని చుట్టు మూడుతుంటే,
అందంగా స్మైలీ ఫేస్ తోటి ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు హర్ష బాబు.
రెండు రోజుల నుండి కంటి మీద కునుకు పడకపోవడం తో,
చల్లని గాలి మేను కు తాకిన వేల మత్తుగా కల్లు మూసుకుపోతున్నాయి చిన్నూ కి.
ఐదు నిమిషాలు, పది నిమిషాలు తమాయించుకుందు కాని, తన వల్ల అవ్వక ఒక పక్కకి ఒరిగిపోతూ,
తల కి ఆసరా గా ఫ్రీ గా వచ్చిన భుజం దొరికేసరికి, దాని మీద తల ని పెట్తుకుని సుబ్బరంగా బొబ్బుంది చిన్నూ.
తన భుజం మీద పడిన బరువు కి, బయటికి చూస్తున్న హర్ష, ఇటు తిరిగి చిన్నూ వైపు చూసాడు.
అలసట ఆమె మొహం లో క్లియర్ గా కనిపిస్తూండేసరికి, అందులోనూ ఏదో నిద్దట్లో కూడా ఆలోచిస్తోంది అనడానికి గుర్తుగా ఆమె నొసలు ముడిపడున్నాయి.
మెల్లిగా ఆమె కళ్ళ మీద గాలూదాడు.
అతని శ్వాస వెచ్చగా తగలడం తో, పైగా హాయినివ్వగా కనుబొమ్మలు వేరు పడి డీప్ స్లీప్ లోకి వెల్లిపోయింది చిన్నూ.
ఆమె ని ఒల్లోకి తెచ్చుకుని, తల ని నిమురుతూన్నాడు హర్ష బాబు.
ముందున్న వైషు, సాయి అద్దం లో నుండి వీల్ల పోస్ చూసి వెనక్కి తిరిగి సూపర్ స్టిల్ బావా!! అని చెప్పేసరికి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు హర్ష.
సాగిపోతున్న కార్ ఇంటికి చేరకుండా ఉంటుందా అన్నట్టు మూడు కార్లు ఇంటి ముందు ఆగేసరికి,
ముందుగా రుక్మిణి , కవిత దిగి హర్ష ని దిగమన్నట్టు చూసి లోపలికి వెల్లిపోయారు.
Continues…..
Swipe left/right or tap the sides to turn pages