సమ్మోహనం – 3
చిన్నూ ని ఎలా లేపాలో తెలియక,
వైషు వాల్ల వైపు చూసేసరికి,
మా అక్క ఇప్పుడు నీ భార్య బావా!! మాకు సంబంధం లేదు అంటూ నవ్వుతూ వెల్లిపోయారు.
హ్..హ.. అంటున్నాడు తప్ప పిలవలేకున్నాడు హర్ష.
ఇంకిలా కాదు అంటూ,
అప్పటి నుండి చీర పక్కకి చెదిరి ఊరిస్తున్న నెల వంక లాంటి నడుము మీద చిన్నగా గిల్లాడు!!
స్లీప్ లో ఉన్న చిన్నూ కి అది తెలియలేదు,
ఒహ్ గాడ్, ఇంత ఘాడ నిద్ర లోకి వెల్లిపోయిందా ఈ అమ్మాయి అనుకుంటూ ఈ సారి కాస్త గట్టిగా నే నలిపొదిలేసి,
కార్ డోర్ ఓపెన్ చేసాడు.
నొప్పికి, స్!! అంటూ లేచి తనెక్కడ ఉన్నానో చూసుకుని,
పైకి లేచింది.
హర్ష వైపు చూసేసరికి,.అతని ఇంటి వైపు చూస్తూండేసరికి ఫేస్ కనిపించలేదు.
కాని ఇద్దరికి వేసిన కొంగుముడి బంధం ఒక్కటిగా ఉండమని చెబుతూ హర్ష తో పాటు చిన్నూ ని లాగగా కార్ దిగి హర్ష పక్కన నిలబడింది చిన్నూ!!
కవిత తో హారతిప్పించి,
రుక్మిణి దేవుడి గది సిద్దం చేయను వెలితే,
కవిత తో పాటు ఇంకో ఇద్దరు కసిన్ వారిని గుమ్మమ్ దగ్గరే అడ్డుకున్నారు,
పేర్లు చెప్పెవరకు వదలమని!!
ముందుగా చిన్నూ ని చెప్పమని డిమాండ్ చేసేసరికి,.కాస్త భయపడుతూ, హర్ష చేతిని గట్టిగా పట్టుకుంది హాసిని.
కవిత తో హారతిప్పించి,
రుక్మిణి దేవుడి గది సిద్దం చేయను వెలితే,
కవిత తో పాటు ఇంకో ఇద్దరు కసిన్ వారిని గుమ్మమ్ దగ్గరే అడ్డుకున్నారు,
పేర్లు చెప్పెవరకు వదలమని!!
ముందుగా చిన్నూ ని చెప్పమని డిమాండ్ చేసేసరికి,.కాస్త భయపడుతూ, హర్ష చేతిని గట్టిగా పట్టుకుంది హాసిని.
పట్టుకున్న చేతిని కాస్త ప్రెస్ చేసి నేనున్నాను అన్న భరోసా హర్ష ఇచ్చేసరికి,
నా పేరు హాసిని, మా ఆయన తో వచ్చాను!! అని చెప్పింది చిన్ను.
మీ ఆయన అంటే పేరు లేదా!!
అని కవిత అల్లరిగా అడగడం తో,
హ.. హ.. అని చెప్తూ హర్షు!! అని చెప్పేసింది చిన్నూ భయమ్ తో!!
అప్పుడే మీ ఆయనకి నిక్ నేమ్ పెట్టేసుకున్నావా?? అని అందరు ఈ వెయ్యడం తో,
హర్ష చిన్నూ వైపొకసారి చూసి,
నేను నా వైఫ్ హాసిని వచ్చాం, లోపలికి రానిస్తారా?? అని అడగడం తో,
పల్లెం లో గిఫ్ట్ వేయించుకుని మరీ దారిచ్చింది కవిత.
చిన్ను అలియాస్ హాసిని తో నవధాన్యాల చెంబు దొర్లించి ఇద్దరినీ దేవుడి గది ముందు కి తీస్కెల్లింది ఇద్దరినీ రుక్మిణి.
హాసిని తో దీపం పెట్టించి హాల్ లోకి తీసుకుని వచ్చింది.
మొత్తం పది మంది ఉన్నారు ఆ ఇంట్లో!!
అందరిని పరిచయం చేసింది రుక్మిణి.
భ్రమరాంబా, సదాశివయ్య ఆ ఇంటి పెద్దలు.
వాల్లకి ఇద్దరు సంతానం.
మాధవ్, ఇంకా శ్రీను
మాధవ్ భార్య రుక్మిణి,
వీల్లకి ఇద్దరు పిల్లలు
వాల్లే హర్ష కవిత.
కవిత కి పెల్లి అయిపోయి ఒక చిన్న బాబు.
ఆమె భర్త ప్రవీణ్, ( సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్)
బాబు జై.
వీల్లు చెన్నై లో ఉంటారు
శ్రీను అతని భార్య నీలిమ
వీల్లకి ఒకే ఒక్క కొడుకు వికాస్.
బి.టెక్ 3ర్డ్ ఇయర్.
మాధవ్ గవర్నమెంట్ ఆఫీసర్ కాగా,
శ్రీను బిజినెస్ చేస్తాడు.
తోటికోడల్లూ అక్కచెల్లెళ్ళు గా మారి భర్తలకి అత్త మామలకు సేవ్ చేసుకుంటూ తమ జీవితాన్ని ఇంటికే అర్పితం చేసేసారు చదువుకున్నా కూడా!!
ఇదండీ హీరో బాబు ఫ్యామినీ బ్యాక్ గ్రౌండ్.
అందరిని తలెత్తి చూస్తూ, వినయంగా ఉండి అబ్సర్వ్ చేస్తున్న చిన్నూ,
జై దగ్గరికి వచ్చేసరికి క్యూట్ గా లడ్డు లా ఉన్న వాడి బుగ్గ లాగి,
ఏడిపించేసింది.
అయ్యో సారీ వదిన!! అని చిన్ను మొహాన్ని చిన్నబుచ్చుకునేసరికి,
పర్లేదు హాసిని,
వీడు కొత్త వాల్ల దగ్గర అంతే అంటూ మూడేల్ల కొడుకు ని సముదాయిస్తూ,
అలా ఏడవకూడదు నానా?? మన అత్తే కదా!!
నీకు ఫ్యూచర్ లో పిల్ల నిచ్చే అత్త!! అని వాడిని కవిత పక్కకి తీస్కెల్లేసరికి,
అమ్మో ఈవిడ అప్పుడే అంతవరకు వెల్లిందేంటి అనుకుంటూ నోరు తెరుచుకుని చిన్నూ చూస్తూంటే
చిన్నగా నవ్వుకున్నాడు హర్ష.
ఇల్లు బాగుంది,
ఇంట్లో మనుషులు, వారి స్వభావాలకు ఫిదా అవ్వకపోలేదు చిన్నూ.
భ్రమర గారు హర్ష ని హాసిని ని వెల్లి రెస్ట్ తీస్కోమనడం తో, ( వేరు వేరుగా)
అలసిపోయున్న హర్ష, తన కండువా మి హాసిని భుజం మీదకేసేసి తన రూమ్ కి వెల్లిపోయాడు.
అటు వైపు చూసిన హాసిని కి హర్ష బ్యాక్ కనిపించడం తో,
ఏ ఫీలింగ్ లేకుండా రుక్మిణి చూపించిన వైపు కి వెల్లింది చిన్ను.
ఫాలోడ్ బై వైష్ణవి అండ్ సాయి.
వెల్తున్న రుక్మిణి ని పిలవాలనుకుంటూ,
ఆంటీ అని పిలిచేసింది చిన్నూ!!
ఇక్కడ చిన్నూ అన్న పేరు ఎవరికి తెలియదు, హాసిని అని మాత్రమే తెలుసు.
కాని రుక్మిణి కాస్త్ సీరియస్ గా చూడటం తో,
భయపడిపోతూ,
అ.. అత్తయ్య గారు!! అంటూ పిలిచింది.
గారు గీరు ఏం అవసరం లేదు,
అత్తమ్మ అని పిలువు అంటూ,
హాసిని బుగ్గలు నొక్కి చెప్పింది.
హ.. అత్తమ్మా!!
చెప్పు హాసిని.
ఏమైనా కావాలా??
అది స్నానం చేయొచ్చా నేను!! తట పటాయిస్తూనే అడిగేసింది హాసిని.
హ.. కాని ఆ పట్టు చీర తిరిగి వాష్ చేయాలి, ఎందుకంటే మల్లీ మీ అమ్మ వాల్ల ఇంటికి వెల్లేపౌడు అదే కట్టుకోవాలి!! అని చెప్పి వెల్లిపోయింది.
తన ఇంటికి అనుకుంటూనే కాస్త హ్యాపీ అయిన హాసిని,
మెల్లో తాళి ని గుర్తు చేసుకుని, ఇక తన ఇల్లు తనది కాదు అనుకుంటూ నార్మల్ చీర తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెల్లింది.
జీలకర్రా బెల్లం జిడ్డు వదిలించి స్నానం చేసేసరికి హాసిని పని అయిపోయింది.
అటు హర్ష, ఫ్రెష్ అయి నైట్ వేర్ వేసుకుని బెడ్ ఎక్కేసాడు.
వైషు, సాయి అయితే డ్రస్ కూడా మార్చకుండా బెడ్ కి అడ్డం పడిపోయారు.
చీర కట్టుకోవడం ఒక రకంగా రావడం తో,
పైగా అది నార్మల్ చీర ప్లస్ అవ్వడం తో ఈసి గానే కట్టేసుకుని, హెయిర్ మొత్తం ని చిన్న క్లిప్ లో బంధించి,
నిద్రపోతే ఎవరైన ఏమైనా అనుకుంటారేమో అని నిద్ర కి బ్రేక్ వేసి హాల్ లోకెల్లింది.
అత్తమ్మ లు తప్ప ఎవ్వరూ లేకపోవడం తో వాల్ల దగ్గరికెల్లి నిలబడింది.
మెచ్చిన పిల్లని కోడలు చేసుకున్నందుకు త్రుప్తి గా చూసుకుంటూ,
రెస్ట్ తీస్కోమంటే మల్లి వచ్చావేరా అని అడిగింది రుక్మిణి.
అది అత్తమ్మా!! మీకు ఏమైనా హెల్ప్ చేద్దామని అని హాసిని చెప్పేసరికి,
ఇద్దరు అత్తలు మెచ్చుగోలుగా చూసారు.
టిఫిన్ లోకి గ్రాసరీస్ అన్నీ కట్ చేయించి,
అత్తలు మరీ మరీ చెప్పడం తో రూమ్ లోకి వెల్లింది హాసిని.
నిద్దట్లో కూడా హాసిని రూపం కళ్ళ ముందు మెదులుతూండేసరికి,
హర్ష లేచి కూర్చున్నాడు.
Continues…..
Swipe left/right or tap the sides to turn pages