New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 1

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 1

” హేయ్ మేఘ……

  హేయ్ …… ఎక్కడ ఉన్నావే….? ”

అని గంభీరం అయిన స్వరంతో మేఘమాల నీ పిలుస్తూ ఉంటాడు ఒక వ్యక్తి….

వాష్ రూం లో ఏదో ఆలోచిస్తూ స్నానం చేస్తున్న మేఘ అతని  స్వరానికి ఉలిక్కి పడి , ఆలోచనల్లోనుంచి బయటికి వచ్చి…

” వామ్మో ఈ బీస్ట్ బాబు గారు మళ్ళీ అరుస్తున్నారు..ఇప్పుడు కనుక వెళ్ళలేదు అంటే నా పని అధోగతి అవుతుంది ” అని అనుకుంటూ…

ఫాస్ట్ గా బాత్ కంప్లీట్ చేసి , టవల్ చుట్టుకొని ఫాస్ట్ గా వాష్ రూం నుంచి బెడ్ రూం లోకి వెళ్లి , వాడ్ రోబ్ దగ్గరికి పరుగు పెట్టింది.

కానీ అప్పటికే ఆ వ్యక్తి కోపంగా మేఘ బెడ్ రూం లోకి వచ్చి ఆమె నీ బ్యాక్ నుంచి నడుము చుట్టూ చెయ్యి వేసి గాల్లోకి లిఫ్ట్ చేసి…

ఒక్క చేతితోనే తనని అలాగే మేఘ రూం పక్కన రూం కి తీసుకొని వెళ్లి , బెడ్ మిద విసిరి కళ్ళు మూసి తెరిచే లోపు మేఘ మీదకి చేరిపోయాడు…

మేఘ భయం ప్లస్ కంగారుగా రెప్పలు టప టపా కొడుతూ తనకి ఇంచ్ గ్యాప్ లో ఉన్న వ్యక్తి నీ గుటకలు మింగుతూ , ఊపిరి బిగబట్టి చూస్తుంది …

అతను మాత్రం కోపంగా మేఘ కళ్ళల్లోకి చూస్తు…” ఎంటే నిన్ను ఎన్ని సార్లు పిలవాలి..? నా మాట అంటే లెక్క లేకుండా పోతుందా నీకు..? ” అంటూ మేఘ పిట్ట పర్శనాలిటీ నీ అతని బలం అయిన కండలు తిరిగిన దేహం కింద పచ్చడి చేస్తూ…

అతని అరచేతిలో ఇమిడిపోయే నడుము నీ ఎర్రగా కందిపోయిలా నొక్కేస్తూ… ఇంకో చేతితో మేఘ బుగ్గలు రెండు వత్తి పట్టుకొని ఎర్రటి కళ్ళతో చూస్తూ…అడుగుతాడు.

అతని పట్టుకి నొప్పితో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటె…మళ్ళీ తన కంట్లో కన్నీళ్లు బయటికి వస్తె తనని అక్కడికి అక్కడే చంపేస్తాడు అని భయంతో కష్టంగా వాటిని కంటి బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ….

” వా… వాష్ రూం లో ఉన్నాను రుదిర్ గారు.. ” అని తడబడుతూ భయంగా చెప్పింది మేఘ.

అప్పుడు చూసాడు అతను మేఘ ఒంటికి చుట్టుకొని ఉన్న టవల్ నీ అండ్ తన బాడీ నుంచి వస్తున్న చందనం పరిమళాలు అతని ముక్కు నీ తాకుతూ ఉంటే…

అప్పుడే బాత్ చేసి రావడం వల్ల ఇంకా అక్కడ అక్కడ ముత్యాల మెరుస్తున్న నీటి బిందువులు తో , చెస్ట్ వరకు చుట్టుకొని ఉన్న తెల్లటి టవల్ తో చాలా ముద్దుగా ఉంది..

తనని అలా చూసి సైడ్ గా నవ్వుతూ టక్కున మేఘ చెస్ట్ దగ్గర కసుక్కున కొరికి  అతని పంటి గాటు ఒకటి పెట్టీ , మళ్ళీ తనకి నొప్పి తెలియకుండా దాని మిద ముద్దు పెడుతూ ఉంటాడు..

అతని మాటకి సరిగ్గా ఆన్సర్ చెయ్యకపోయినా లేదా అతని కోపం వచ్చేలా ఏం అయిన చేసిన అతను అలానే చేస్తూ ఉంటాడు కాబట్టి అది మేఘ కి అలవాటు అయిపొయింది.

మేఘ మిద ఉన్న కోపాన్ని అంతా తన నడుము మిద అండ్ చెస్ట్ దగ్గర ముద్దు రూపంలో చూపించి…..ఒక పది నిమిషాల తర్వాత మేఘ నీ అలాగే ఎత్తుకొని అతని జిమ్ రూం లోకి వెళ్తాడు.

జిమ్ రూం లోకి తీసుకొని వెళ్తున్న అతన్ని ఏడుపు మొహంతో చూస్తూ ఉంటుంది మేఘ.

రుదిర్ మాత్రం ఏం పట్టించుకోకుండా తనని జిమ్ రూం లోకి తీసుకొని వెళ్లి టవల్ చుట్టుకొని ఉన్న తనని  కింద పడుకోబెట్టి …..అతను ఆమె మీదకి ఒరిగి అతని మెడ చుట్టూ మేఘ  చేతులు రెండు వేయించుకుని …..

ఒక్క చేతితో మేఘ నడుము గట్టిగా పట్టుకొని , ఇంకొక చేతితో పుష్ అప్ చేస్తూ ఉంటాడు…

తిప్పి తిప్పి కొడితే 40 కేజీలు కూడా ఉండని మేఘ నీ ఈజీ గా బ్యాలెన్స్ చేస్తూ……ఒంటి చేతితో పుష్ అప్స్ చేస్తున్న అతన్ని ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ ఉంటుంది మేఘ.

పుష్ అప్స్ చేస్తూనే ” నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను…ఇది లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఇంకో వన్ మంత్ లో 20 కేజ్స్ వెయిట్ పెరగాలి లేదు అంటే….” అంటూ పెదవుల చివరగా నవ్వుతూ…మేఘ చెవులో ఏదో గుస గుసగా చెప్పాడు.

అతను చెప్పిన మాటలకు కళ్ళు రెండు  పెద్దవి చేసి చూస్తూ…. ” రుదిర్ గారు మరి వన్ మంత్ అంటే కష్టం అండి ” అని చెప్పింది ఏడుపు మొహం తో..

“డూ వాట్ ఐ సే….నికు కరెక్ట్ గా వన్ మంత్ ఏ టైం…ఈ లోపు నా చేతికి నీ నడుము కరెక్ట్ షేప్ లో సరిగ్గా ఉండాలి…లేదు అంటే నా దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది.

చెప్పు రెండిటిలో ఏం చేస్తావు…” అని చెమటలు కారిపోతున్న ఆపకుండా పుష్ అప్స్ చేస్తూనే అడుగుతాడు రుదిర్.

రుదిర్ మాటలకు మేఘ బాధగా మారిపోయి
” నా అవసరం కోసం నేనే అగ్రిమెంట్ చేసుకొని మరి నన్ను నేనే మీకు అమ్మేసుకున్నాను…. నా మిద పూర్తి హక్కులు నేనే మీకు ఇచ్చాను..

మీరు ఏమి చేసినా నేను మీకు ఎదురు తిరిగే హక్కు నాకు లేదు…మీరు చెప్పింది చెయ్యడమే ఈ ఆట బొమ్మ కి తెలిసింది..

చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన నాకు ఎలాంటి బంధాలు లేవు కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అంటూ కొన్ని బంధాలు ఏర్పడ్డాయి..

కానీ నేను కాంట్రాక్టు మిద రెండు సంవత్సరాలు మీ దగ్గర ఉన్న డబ్బు కోసం అమ్ముడు పోయి వచ్చిన దాన్ని…

నాకు వేరే ఆప్షన్ ఏమి లేదు మీరు చెప్పింది చెయ్యడం తప్పా…! ” అని మనసులో అనుకుంటూ కళ్ళల్లో నీళ్ళు చెంపల మీదకు వస్తె అలాగే వాటిని వదిలేసి , అతన్ని రెండు చేతులతో గట్టిగా హగ్ చేసుకొని …..అలాగే రుదిర్ గారు ” అని చెప్పింది ఏడుపు గొంతు తో…

అసలు ఎవరు ఈ మేఘమాల…?

తనని తానే ఎందుకు రుదిర్ దగ్గర డబ్బు కోసం అమ్మేసుకుంది….?

ఫ్యామిలీ కూడా ఎవరు లేరు అంటుంది కదా మరి ఎవరి కోసం తనని తాను తాకట్టు పెట్టుకుంది…?

తెలుసుకోవాలి అంటే ఇప్పుడే నన్ను ఫాలో అయిపోయి , స్టోరీ చదవండి…

To be continued….