ఎదుట నిలిచింది చూడు – 1
ఆ గది మొత్తం అందంగా అలంకరించబడి ఉంది. గది నిండా పరచుకున్న పూల పరిమళం, మంచం మీద అలంకరించిన గులాబీ రేకులు, గదిలో అక్కడక్కడా వెలుగుతున్న మసక దీపాలు……
ఆ వాతావరణం కొత్తగా పెళ్లయిన జంటకు ఎంతో మధురమైన అనుభూతిని కలిగించేలా ఉంది.
కానీ ఆ గదిలో ఉన్న అమ్మాయి మనసులో మాత్రం ఎలాంటి సంతోషం లేదు.గదిలోని ఓ మూలన మోకాళ్ల మీద చేతులు వేసుకుని కూర్చున్న దన్విక కళ్లలో భయం, మనసులో అంతులేని ఆందోళన కనిపిస్తున్నాయి.
పెళ్లి బట్టల్లో ఉన్న ఆమె చేతులు వణుకుతున్నాయి. మెడలో ఉన్న తాళిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.
దాన్విక మనసులో…
అసలు నా జీవితంలో ఏం జరుగుతోంది?ఏదో అనుకున్నాను,ఏదో చేయాలనుకున్నాను, కానీ చివరికి ఏంటి నా పరిస్థితి?
ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా బయటపడాలి?అసలు ఇక్కడి నుంచి బయటకు వెళ్లే దారి కూడా కనిపించడం లేదే
ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఉదయం జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా కళ్లముందు కదిలాయి. తాను వేసుకున్న ప్రణాళిక, ఆ తర్వాత ఎదురైన అనుకోని పరిణామాలు, చివరికి తన మెడలో పడిన తాళి అంతా ఒక పీడకలలా అనిపిస్తోంది.
దేవుడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ తన ముఖాన్ని చేతుల్లో దాచుకుంది.
అప్పుడే టక్ అని గది తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది.దాన్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది, అక్కడే నిలబడి ఉన్నాడు అగస్త్య మల్హోత్రా….
తెల్లటి,షర్ట్ చేతులను మోచేతుల వరకు మడిచి, ముఖంలో ఏమాత్రం భావం కనిపించకుండా గంభీరంగా గదిలోకి అడుగుపెట్టాడు.
అతని చూపులోని తీవ్రతే ఎదుటివారిని భయపెట్టేలా ఉంది.
అగస్త్యను చూడగానే దన్విక గబగబా లేచి నిలబడింది…
సర్ ప్లీజ్ సర్ అంటూ అతని దగ్గరకు రెండు అడుగులు వేసింది.అగస్త్య మాత్రం ఆమె వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు.
మీకు ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాను కదా సర్, నేను కావాలని ఈ పెళ్లి చేసుకోలేదు. అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే నాకు లేదు.
ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి,నన్ను ఇక్కడి నుంచి వెళ్లనివ్వండి.ఆమె గొంతులోని వణుకు అగస్త్యకు స్పష్టంగా వినిపించింది. కానీ అతని ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు….
అయిపోయిందా అని చల గంభీరంగా అడిగాడు,దాన్విక అయోమయంగా అతని వైపు చూసింది.
ఏం ఏంటి సర్….
నీ కథ అగస్త్య తన ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడుగుతాడు..
ఆ రెండు మాటలకే ఆమె నోరు మూతపడింది.అగస్త్య నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేస్తూ…
ఉదయం నుంచి ఇదే మాటలు చెప్తున్నావు,నాకు తెలుసు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, ఏం జరగాలని అనుకున్నావో కూడా నాకు తెలుసు.
అయినా ప్రతిసారీ నీ మాటలే వినాలనుకుంటున్నానని అనుకోకు,కానీ సర్…….
ఒక్క నిమిషం అని అతని గంభీరమైన స్వరానికి దన్విక మాట మధ్యలోనే ఆగిపోయింది.నీకు ఒకసారి చెప్పాను. ఈ పెళ్లి గురించి కానీ, ఇక్కడి నుంచి వెళ్లిపోవడం గురించి కానీ ఇంకో మాట మాట్లాడినా నేను ఊరుకోను.
అర్థమైందా అని గంభీరంగా వచ్చిన అతని స్వరానికి దన్విక తలదించుకుంది.
సర్ నేను కావాలని ఇదంతా….
దన్విక అతను ఆమె పేరును పలికిన విధానానికి ఆమె ఒక్కసారిగా తలెత్తి చూసింది.
నీకు ఉదయం ఏం చెప్పానో గుర్తుందిగా, నువ్వు ఏమైనా తెలివితక్కువ పని చేయాలనుకున్నా,
ఈ పెళ్లి బంధం నుంచి మళ్లీ తప్పించుకోవాలని ప్రయత్నించినా,దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు,నన్ను ఆ పరిస్థితికి తీసుకురావద్దు….
అతని మాటల్లో హెచ్చరిక స్పష్టంగా వినిపించింది. దాన్విక కళ్లలో నీళ్లు తిరిగాయి.ప్లీజ్ సర్ నాకేం వద్దు,మీ ఆస్తులు వద్దు, మీ డబ్బు వద్దు, మీ హోదా వద్దు…..
నన్ను నా దారిన వెళ్లనివ్వండి, అంతకంటే నేను ఇంకేం అడగడం లేదు అని ధన్విక అంటుంది.
అగస్త్య పెదవుల మీద వెటకారంతో కూడిన చిరునవ్వు మెరిసింది,నాకు నా డబ్బు గురించి, ఆస్తుల గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు,అవన్నీ ఏంటో నాకు బాగా తెలుసు అంటూ ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు.
కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి,నా భార్యవి…… ఈ పెళ్లి ఎలా జరిగిందనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు. అది అంత సులభంగా మారిపోతుందని మాత్రం అనుకోకు….
ఆ మాటలు విన్న దాన్విక గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది,కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు సర్….
ఆ మాట వినగానే అగస్త్య చూపు కఠినంగా మారింది.నువ్వు అనుకున్నావా లేదా అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు….
జరిగింది ఏంటో నీకు తెలుసు,కాబట్టి అనవసరంగా వాదించకు అతను వెనక్కి తిరిగి అక్కడున్న బాల్కనీ వైపు నడిచాడు.
దాన్విక మాత్రం అక్కడే నిలబడిపోయింది.తన జీవితంలో ఇంతటి పరిస్థితి ఎదురువతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.
అగస్త్య మాటలు విన్న దాన్విక అక్కడే నిలబడిపోయింది.
తన జీవితంలో ఇంతటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.
ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి నుంచి బయటపడవచ్చని అనుకుంది,కానీ ఇప్పుడు పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోయాయి….
అగస్త్య బాల్కనీలోకి వెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు, తన ఫోన్ తీసి ఏదో చూస్తూ ఉండిపోయాడు….
కొనసాగుతుంది…….
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్….
Swipe left/right or tap the sides to turn pages