New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎదుట నిలిచింది చూడు – 2

ఎదుట నిలిచింది చూడు – 2

అగస్త్య మాటలు విన్న దాన్విక అక్కడే నిలబడిపోయింది. తన జీవితంలో ఇంతటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. 

ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి నుంచి బయటపడవచ్చని అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోయాయి.
అగస్త్య బాల్కనీలోకి వెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. తన ఫోన్ తీసి ఏదో చూస్తూ ఉండిపోయాడు. దాన్విక మాత్రం అతనివైపే చూస్తోంది.
ఈయన ఏంటి,అసలు ఏం అనుకుంటున్నారు, నేను ఈ పెళ్లి వద్దని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఈ ఇంటి పెద్ద కోడలివి, నా భార్యవి అంటున్నారు. 
ఇప్పుడు నేనేం చేయాల అని ఆమె ఆలోచనల్లో ఉండగానే అగస్త్య గొంతు వినిపించింది.
దన్విక…ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది.
ఇటు రా,దాన్విక అయిష్టంగానే అతని దగ్గరకు వెళ్లింది.
కూర్చో అతను ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు.
పర్లేదు సర్ నేను నిలబడతాను.అగస్త్య ఫోన్ పక్కన పెట్టి ఆమెవైపు చూశాడు.
నేను చెప్పింది వినిపించలేదా,ఆమె వెంటనే కుర్చీలో కూర్చుంది. అగస్త్య కొన్ని క్షణాలు ఆమెను గమనిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు….
చూడు దన్వికా ఉదయం నుంచి నువ్వు ఈ పెళ్లి వద్దని చెప్తూనే ఉన్నావు. నువ్వు ఎందుకు అలా చెప్తున్నావో నాకు తెలియదని అనుకోకు,కానీ ఇప్పుడు జరిగినదాన్ని మార్చడం మన చేతుల్లో లేదు….
సర్… కానీ….నేను చెప్పేది పూర్తిగా విను,దన్విక మౌనంగా ఉండిపోయింది.నువ్వు ఈ ఇంటి కోడలివి,నా భార్యవి, కాబట్టి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. 
నాతో కలిసి ఉంటావు, నాతో కలిసి భోజనం చేస్తావు,ఈ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ నాతో పాటే ఉంటావు…
 నువ్వు నా భార్యవని అందరికీ తెలియాలి,మన మధ్య ఏం జరిగిందనేది వాళ్లకు అనవసరం….
దాన్విక కంగారుగా అతని వైపు చూసింది,అంటే నేను మీతోనే ఉండాలా?అవును,
కానీ సర్, నేను మిమ్మల్ని ఇంకా…..నువ్వు నన్ను ప్రేమించమని నేను చెప్పడం లేదు.
ఆ మాట వినగానే దన్విక నిశ్శబ్దంగా అతనివైపు చూసింది.అగస్త్య తన కుర్చీలో వెనక్కి వాలుతూ మాట్లాడాడు.
నన్ను వెంటనే నీ భర్తగా అంగీకరించాలని కూడా నేను అనడం లేదు. నీకు ఈ పెళ్లిని అంగీకరించడం కష్టంగా ఉందని నాకు అర్థమవుతోంది. అందుకే నీకు కొంత సమయం ఇస్తున్నాను….
నిజంగానా సర్,ఆమె గొంతులో ఆశ్చర్యం స్పష్టంగా వినిపించింది,నేను చెప్పిన మాట మీద నాకు నమ్మకం లేదా?
అది కాదు సర్ మీరు ఇలా అంటారని నేను అనుకోలేదు,అగస్త్య పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది.
నువ్వు నా గురించి ఏం అనుకుంటున్నావో నాకు అనవసరం, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. నేను ఇచ్చే సమయాన్ని నువ్వు నీకు నచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. 
ఈ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు,నీకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి.కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు…
కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకుని ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని మాత్రం అనుకోకు. మన బంధాన్ని అంగీకరించడానికి నీకు సమయం ఇస్తున్నాను,దాన్ని నా బలహీనతగా తీసుకోవద్దు….
దన్విక ముఖంలోని చిన్న ఆశ మళ్లీ ఆందోళనగా మారింది,
అంటే నేను ఎక్కడికీ వెళ్లకూడదా,నువ్వు వెళ్లాలనుకున్న ప్రతిసారీ నాకు చెప్పాలి. 
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు తిరిగి వస్తావో నాకు తెలియాలి, అండ్ ఇంకొక విషయం ఇంతకు ముందు వరకు నువ్వు ఎవరిని ప్రేమించింది ఏంటి అని నాకు తెలుసు బట్ ఇక వాటి గురించి నికు ఎటువంటి సంబంధం లేదు. 
ఇక నుంచి జీవిత కాలం వరకు నేను నీ భర్తని అలవాటు పడడానికి రెడీగా ఉండు, అంతే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ప్లాన్ వేసి, తల తిక్క పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అర్థం అయిందా ..
అది కూడా మీకు,దన్వికా అతని గొంతులో హెచ్చరిక వినిపించగానే ఆమె నోరు మూసుకుంది…
ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగావు,ఇక పడుకో రేపు ఉదయం కొత్త ఇంట్లో నీ మొదటి రోజు,అంటూ మంచం దగ్గరకు వెళ్ళాడు…
దాన్విక ఆశ్చర్యంగా అతని వైపు చూసింది,సర్ మీరు ఎక్కడ పడుకుంటారు,
ఇక్కడే…. అంటేఈ గదిలోన,అగస్త్య ఆమెవైపు తిరిగి చూశాడు.ఇది నా గది కూడా నేను వేరే గదిలో పడుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు…
దాన్విక తడబడుతూ అది మీరు ఇక్కడ ఉంటే నేను అంది.
నువ్వు ఏం భయపడుతున్నావో నాకు అర్థమైంది. 
నీకు ఇబ్బంది కలిగించేలా నేను ప్రవర్తించను, కానీ ఈ పెళ్లి జరిగిన తర్వాత మనం ఒకే గదిలో ఉండటం నీకు కొత్తగా అనిపించినా, నువ్వు దానికి అలవాటు పడాలి.
అగస్త్య కాసేపు మౌనంగా ఉండి, తన పక్కనే పడుకున్న దాన్విక వైపు తిరిగాడు. దన్వికా అని పిలవడంతో ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది. 
రేపు ఉదయం ఈ ఇంట్లో వాళ్లందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అసలు నువ్వెవరు? పెళ్లికూతురు ప్లేస్‌లోకి ఎందుకు వచ్చావు? అసలు పెళ్లికూతురికి ఏమైంది? ఇలాంటి ప్రశ్నలు చాలానే అడుగుతారు. 
ధన్విక భయంగా కంగారుగా చూసింది అగస్త్య మాటలకు.. అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది అంటారు, పెళ్లికూతురు ధన్వికా కాదా,మరి అలాంటప్పుడు పెళ్లికూతురు ప్లేస్ లోకి ధన్విక ఎందుకు వచ్చింది… తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్లు చూడాల్సిందే….
                        కొనసాగుతుంది…..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్……