ఎదుట నిలిచింది చూడు – 3
రేపు ఉదయం ఈ ఇంట్లో వాళ్లందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతారు.
అసలు నువ్వెవరు? పెళ్లికూతురు ప్లేస్‌లోకి ఎందుకు వచ్చావు? అసలు పెళ్లికూతురికి ఏమైంది? ఇలాంటి ప్రశ్నలు చాలానే అడుగుతారు.
వాళ్లకు నిన్ను చూసి అనుమానం రావడం సహజమే. ఎందుకంటే నువ్వు పెళ్లికూతురివి కాదు, పెళ్లికూతురు స్థానంలోకి వచ్చి కూర్చున్నావు.
కాబట్టి వాళ్లకు చాలా విషయాలు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు అంటూ ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు.
దన్విక భయంగా అతని వైపు చూస్తూ మరి వాళ్లకు ఏం చెప్పాలి సర్ అని అడిగింది. అదే నీకు ఇప్పుడు చెప్తున్నాను. వాళ్లు ఏం అడిగినా సరే, నేను సమాధానం చెప్తాను.
నేను ఏం చెప్పినా నువ్వు దానికి అవును అని మాత్రమే సమాధానం చెప్పాలి అర్థమైందా అని గంభీరంగా అడిగాడు.
దాన్విక మౌనంగా తల ఊపింది,తల ఊపితే సరిపోదు, నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో,అక్కడ ఎవరిముందైనా పొరపాటున కూడా నోరు జారావంటే, మనిద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపడతాయి.
నువ్వు ఏదో సాధించాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, నేను చెప్పే మాటలకు అడ్డుపడటం, నేను చెప్పిన అబద్ధాలను నిజాలుగా నమ్మించాల్సిన చోట వాటిని బయటపెట్టడం లాంటివి ఏమైనా చేశావో,
ఆ తర్వాత జరిగే పరిణామాలకు నన్ను నిందించకు, అతని స్వరంలో హెచ్చరిక మరింత తీవ్రమైంది. నేను ఎంతవరకు నీకు సమయం ఇస్తున్నానో అంతవరకే నీకు స్వేచ్ఛ ఉంటుంది.
నా మాటకు ఎదురు చెప్పి ఈ ఇంట్లో ఎవరి ముందైనా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసావంటే, నువ్వు ఇప్పటివరకు చూడని అగస్త్య మల్హోత్రాను చూస్తావు.
గుర్తుపెట్టుకో అంటూ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి హెచ్చరించాడు. దాన్విక భయంతో అతని వైపు చూస్తూ, సరే సర్ మీరు చెప్పినట్టే చేస్తాను అని మెల్లగా సమాధానమిచ్చింది.
మంచిది రేపు ఉదయం వరకు ఈ విషయం గురించి ఇంకో మాట కూడా మాట్లాడకు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకో అంటూ అగస్త్య వెనక్కి తిరిగి పడుకున్నాడు.
దన్విక మాత్రం అతని మాటలు గుర్తుచేసుకుంటూ, మరుసటి రోజు ఆ ఇంట్లో వాళ్లను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక భయంతో కళ్లు మూసుకుంది….
రాత్రంతా అగస్త్య చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉండటంతో దన్వికకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందో, ఉదయం ఈ ఇంట్లో వాళ్లను ఎలా ఎదుర్కోవాలో, వాళ్లు తన గురించి ఏం అడుగుతారో అన్న ఆలోచనలతోనే రాత్రంతా గడిపేసింది.
కాసేపు నిద్రపోయినా ఏదో భయంకరమైన కల వచ్చినట్టు ఉలిక్కిపడి లేస్తూ ఉండటంతో తెల్లవారేసరికి ఆమె కళ్లలో నిద్రలేమి స్పష్టంగా కనిపిస్తోంది.
కిటికీ తెరల మధ్య నుంచి సూర్యకిరణాలు గదిలోకి వస్తుండటంతో మెల్లగా కళ్లు తెరిచిన దాన్విక, తను ఎక్కడ ఉందో గుర్తొచ్చి ఒక్కసారిగా చుట్టూ చూసింది.
ఎదురుగా ఉన్న మంచం మీద అగస్త్య కనిపించకపోవడంతో అతను అప్పటికే లేచడని అర్థమైంది. వెంటనే మంచం మీద నుంచి లేచి కూర్చుని, రాత్రి జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంది.
అమ్మ అప్పుడే తెల్లవారిపోయిందా, ఇప్పుడు కిందకు వెళ్తే ఇంట్లో వాళ్లందరూ ఉంటారు. వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి?
అసలు అగస్త్య సర్ ఏం చెప్పబోతున్నారు,ఆయన చెప్పినట్టే నేను తల ఊపుతూ ఉంటే సరిపోతుందా,ఏదైనా పొరపాటున మాట్లాడితే ఏమవుతుందో అని మనసులోనే అనుకుంటూ నిట్టూర్చింది.
అప్పుడే బాత్‌రూమ్ వైపు నుంచి బయటకు వచ్చిన అగస్త్యను చూసి దాన్విక వెంటనే తన ఆలోచనల నుంచి బయటకు వచ్చింది.
అప్పటికే అతను పూర్తిగా సిద్ధమై ఉన్నాడు. తెల్లటి షర్ట్‌కు నల్లటి ట్రౌజర్ ధరించి, చేతికి వాచ్ పెట్టుకుంటూ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటున్నాడు.
ఎప్పటిలాగే అతని ముఖంలో గంభీరత కనిపిస్తోంది.దన్విక ఇంకా మంచం మీద కూర్చుని ఉండటం గమనించిన అగస్త్య, తన వాచ్ సరిచేసుకుంటూనే ఆమె వైపు చూశాడు.
ఇంకా అక్కడే కూర్చున్నావేంటి, లేచి వెళ్లి ఫ్రెష్ అయి రెడీ అవ్వు,కిందకు వెళ్లాలి అని సూటిగా చెప్పాడు. అతని మాటలకు దాన్విక వెంటనే మంచం మీద నుంచి లేచింది.
సరే సర్ అని చెప్పి తన లగేజ్ దగ్గరకు వెళ్లింది. అందులోంచి తనకు అలవాటైన సాధారణ దుస్తులను బయటకు తీసి, బాత్‌రూమ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా అగస్త్య గొంతు మళ్లీ వినిపించింది.
ఒక్క నిమిషం అంటూ ఆమెను ఆపాడు, దన్విక వెంటనే వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు.
ఫ్రెష్ అవ్వడానికి సర్,తర్వాత ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవుతాను అంటూ తన చేతిలో ఉన్న ఒక నార్మల్ డ్రెస్ ని చూపించింది.
అగస్త్య ఆమె చేతిలోని బట్టలను ఒకసారి చూసి, తర్వాత తన పక్కనే ఉన్న టేబుల్‌పై ఉంచిన పెద్ద బాక్స్ వైపు చూపించాడు.
అది పక్కన పెట్టి, ముందు అక్కడున్న బాక్స్ ఓపెన్ చేయి అన్నాడు. దన్విక కు అతను ఏం చెప్పాడో అర్థం కాక కనుబొమ్మలు ముడుచుకుంది.
అయినా అతని మాటకు ఎదురు చెప్పకుండా ఆ బాక్స్ దగ్గరకు వెళ్లింది. అందంగా ప్యాక్ చేసి ఉన్న ఆ బాక్స్‌ను చూసి, అందులో ఏముందోనని ఆశ్చర్యపోతూ మెల్లగా దాని మీద ఉన్న రిబ్బన్‌ను విప్పి మూత తీసింది.
కొనసాగుతుంది…..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…
Swipe left/right or tap the sides to turn pages