New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా తండ్రి అనామకుడు – 1

నా తండ్రి అనామకుడు – 1

  • 1960లో మొదలయినా నా తండ్రి కథ. నా తండ్రి పేరు సిరివెళ్ల రమణయ్య. అనామకుడు అవ్వడానికి కారణం తన తండ్రి. కడుపుకు అన్నం పెట్టమని కూడా అడగలేని నా తండ్రి ఒకానొక టైం లో ఒక విగత జీవి గా మారాడు. ఒక ఊరిలో….ఆ ఊరిలో సగం ఆస్తి రమణయ్య తండ్రి అయినా చంద్ర శేఖర్ ది.మధ్యానికి బానిస అయినా చంద్రశేఖర్ తన ఆస్తిని 1960 లో త్స్న ఆస్తిని అంతా అమ్ముకున్నాడు. అప్పటి ఒకరోజు కూలి అర్ధరూపాయి. ఇలాంటి అర్థరుపాయిలు ఎన్నో అయన మధ్యానికి సరిపోయేవి కావు. చంద్రశేఖర్ భార్య అయినా సాలమ్మా  కు సినిమా లంటే పిచ్చి. సినిమా చూడటం కోసం ఇంట్లో వున్నా బియ్యం కూడా అమ్ముకుని సినిమా కు వెళ్ళేది.తినడానికి తిండి లేదు ఉన్న ఆస్తిని పోగుట్టుకున్న వీళ్ళు పొట్ట కూటి కోసం పొరుగురు వెళ్ళవలసీ వచ్చింది ఇంతలోనే నా తండ్రి రమణయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది…..

చంద్రశేఖర్ కు 5మంది సంతానం. ఇద్దరు ఆడబిడ్డ లు, ముగ్గురు మగబిడ్డలు.అర్ధరూపాయి కూలి తోనే ఇద్దరు ఆడబిడ్డ లకు చంద్రశేఖర్ పెళ్లి చేసాడు. రమణయ్య మూడవ వాడు. పొట్టకూటికోసం కడుపు చెత్తపట్టుకొని వెళ్లిన చంద్రశేఖర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిస అయినా చంద్రశేఖర్ ఆరోగ్యం పూర్తిగా క్షిణించింది. హాస్పిటల్‌ కు వెళ్ళగా దాక్టర్ 15 రోజులు నువ్వు మద్యం సేవించకూడదు అని చెప్పాడు. వైద్యుడు చెప్పినా రోజే చంద్రశేఖర్ కొడుకు వద్దకు వెళ్లి 5రూపాయలు కొడుకుని అడిగి డబ్బులు తీసుకొని ఈరోజు తృప్తి గా తాగి రేపటి నుండి మందు మానేయాలని నిర్ణయంచుకొని వెళ్లి మద్యం సేవించాడు. తరుమూకొని వస్తున్న ఆ మృత్యువు దాటిని తట్టుకోలేక అదే హాస్పిటల్ ముందు కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు ఆ కుటుంబం రమణయ్య కుటుంబం గా మారింది. తల్లి సాలమ్మా ఇంట్లో పాయసం, మంచి వంటలు చేసి కొడుకు ని భోజనానికి పిలిచింది. చేతులు కాళ్ళు కడుక్కొని భోజనానికి వచ్చిన కొడుకుకి పాయసం పెట్టింది. తీపి నోటికి తగలాగానే చేదు వార్త చెవినా పడింది. తండ్రి మరణం తన జీవితం లో ఒక లోటుని చోటుచేసుకుంది..మరిన్ని బాధ్యతలు  రమణయ్య భుజాల మీద పడ్డాయి.. కుటుంబాన్ని పోషించాలి. ఇద్దరు తమ్ముళ్లని చూసుకోవాలి తన తల్లిని చూసుకోవాలి. తన తండ్రికి గుండెపోటు వచ్చిందని వైద్యం చేసిన డాక్టర్ చెప్పేవరకు వాళ్లకు తెలియదు. తన తల్లి అయినా సాలమ్మ కు భర్త చనిపోగానే పిల్ల ల బాధ్యత మీద పడింది సినిమా ల పిచ్చి తగ్గింది. ఇలా కాలం కొనసాగుతుండగా రమణయ్య కు గంజి నీళ్లు, అంబలి, మంచినీళ్లు పంచాభక్ష పరమాన్నం అయ్యాయి. మంచి నీళ్లు కూడా అడగలేని నామోషీ నా తండ్రి రమణయ్య. అలా ఒక రోజు గొర్రల కాపరిగా అతను తన స్నేహితుడు వెళ్లారు. ఉదయం ఆరు గంటలకి వెళితే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాళ్ళు. తాగడానికి నీళ్లు కూడా అడగలేని రమణయ్య కు ఆకలికి ఒకరోజు తట్టుకోలేక పోయాడు. ఇది గమనించిన తన స్నేహితుడు ఊర్లో కీ వెళ్లి అన్నం అడుక్కుని వచ్చి పెడితే తిని తన ఆకలిని తీర్చుకున్నాడు. అప్పట్లో రమణయ్య కు కూలి రూపాయి పావలా (1.25paisa) ఆలా జీవితం కొనసాగిస్తున్న రమణయ్యకు వయసు మీద పడింది. తల్లి ఒక్కతి ఇంటి పని బయట పని చేయలేక అలసిపోతుంది. కానీ.. చంద్రశేఖర్ చేసిన ఒక మంచి పని త్సను ఉండగానే రమణయ్య కు పెళ్లి చేస్తాడు. ఆపెల్లి రమణయ్య కు ఇష్టమేనా అంటే తన తండ్రి పరువు మర్యాద ల కోసం తప్పక్స్ చేసుకున్నాడు. ఎందుకంటే చంద్రశేఖర్ భార్య అయినా సాలమ్మా అక్క అయినా శివమ్మా వేరే కులం ఆయనని మనువడుతుంది. ఆమెకు ఇద్దరు సంతానం.పిల్లలకోసకులం కావసలని శివమ్మా వచ్చి ఊరి పెద్దల వద్ద వేడుకోవడం తో శివమ్మా కూతురిని చంద్రశేఖర్ మేన మామకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక్కడే అసలు సమస్య  ఊరి పెద్దలు శివమ్మస్కు అయితే కులం ఇవ్వొదజం జరిగింది కానీ మరి శివ్వమ్మా కూతురుకి అల్లుడికి ఆడపిల్ల పుడితే నువ్వు నీ కొడుక్కి చేసుకోవాలి అని ఆజ్ఞపించడం తో చంద్రశేఖర్ ఒప్పుకుంటాడు.ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి కూతురు పుట్టడం చంద్రశేఖర్ కొడుక్కి రమణయ్యకు ఇచ్చి పెళ్లి చేయడం అన్ని ఆలా జరిగిపోతాయ్.రమణయ్య భార్య పేరు జయమ్మ. కంటికి రెప్పలా మరద్దుల్లని అత్తాని, మామని చూసుకునేది. పెద్ద కుటుంబం అయినా తన బాధ్యత అనుకోని రమణయ్య తో పాటు పనికి వెళ్ళేది. ఇలా కాలం గడుస్తుండగా రూపాయి పావలా కూలిని కూడబెట్టి 7సెంట్ల స్థలం, 3ఎకరాల పొలం కొనుగోలు చేస్తారు రమణయ్య జయమ్మ దంపతులు. ఇలా వాళ్ళ జీవితం కొనడాగుతుండగా ఇల్లు కట్టుకోవడం పొలం లో పంటలు వేసుకోవడానికి కొంతమంది అప్పు చేయాల్సి వస్తుంది.అప్పట్లో ఎక్కువగా రేషం పురుగులు పంటలు పండించేవారు. ఆ పంటలు సరిగ్గా రాకపోవడం తో అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడు గవర్నమెంట్ చేసిన మోసం రమణయ్యను కురుకుపోయిన గోతిలో పడేసింది……