పరిచయమే పరవశమై 💘 – 2
ఆర్యన్ ఇచ్చిన ఆ చాక్లెట్ వైపు చూస్తూ తన మాటలు విన్న అన్విక మనసులో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అప్పటి నుండి వాళ్ళు తరచుగా కలవడం మొదలవుతుంది. అలా ఒకరి పేరు ఒకరు తెలుసుకోవడం దగ్గర నుంచి ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఇద్దరి మధ్య హెల్తీ బాండ్ క్రియేట్ అవుతుంది ………..
ఆర్యన్ అన్వికకు ఆర్కిటెక్చర్ లోని షేప్స్ గురించి చెబితే అన్విక ఆర్యన్ కి రంగుల వెనుక ఉన్న ఎమోషన్స్ గురించి చెప్తుంది ఆర్యన్ కి అన్విక అంటే ప్యూర్ లవ్ & అన్వికని తన ప్రపంచం అనుకుంటాడు బట్ అన్విక మాత్రం ఆర్యన్ ని తన బెస్ట్ ఫ్రెండ్ గా, ఇంకా తనని అర్థం చేసుకునే ఏకైక వ్యక్తిగా మాత్రమే చూస్తుంది…….
కాలేజ్ ఫెస్ట్ కోసం అక్కడ హడావిడి జరుగుతూ ఉంటుంది కాలేజ్ అంతా పెయింటింగ్స్, సీరియల్ లైట్స్, మ్యూజిక్ సౌండ్స్‌తో చాలా విబ్రేంట్ గా ఉంది. ఎక్కడ చూసినా స్టూడెంట్స్ హడావిడి. అన్విక ఒక పెద్ద లాడర్ దగ్గర నిలబడి స్టేజ్ పైన ఒక పెద్ద వెల్కమ్ బ్యానర్ కట్టడానికి ట్రై చేస్తోంది. తను హైట్ కి అది కట్టడానికి అవ్వక స్ట్రగుల్ అవ్వడం చూసి ఆర్యన్ తన వైపు వెళతాడు……..
ఏయ్ అన్విక నేను హెల్ప్ చేయనా? అది నీకు కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నట్టుంది ??
అన్విక తన మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ యా థాంక్యూ సో మచ్ ఈ ఫెస్ట్ వర్క్స్ అన్నీ నా మీద పడ్డాయి. నా టీమ్ మెంబర్స్ ఇంకా రాలేదు నేనేమో అన్నీ ప ర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాను ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ పర్ఫెక్షనిస్ట్ అంటూ నవ్వుతుంది…….
ఆర్యన్ అన్విక మాటలకు చిన్నగా నవ్వుకుని ఆ బ్యానర్ అందుకుని పైన కడుతూ ఉంటే అన్విక కింద నిలబడి డైరెక్షన్ ఇస్తోంది యాహ్ లెఫ్ట్ కి కొంచెం … ఇంకొంచెం పైకి హ్మ్మ్ పర్ఫెక్ట్! చూసావా నువ్వు ఉంటే పని ఎంత ఈసీ అయిపోయిందో……. బై ది వే నువ్వు ఎందుకు ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం లేదు?
నాకు స్టేజ్ ఫియర్ కొంచెం ఎక్కువ నేను వెనుక ఉండి హెల్ప్ చేయడానికే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. అన్విక నవ్వుతూ అదా నీ ప్రాబ్లం! నువ్వు చాలా టాలెంటెడ్ అని నాకు తెలుసు. సరే, అట్లీస్ట్ నా కోసం ఈ త్రీ డేస్ నా కో – ఆర్డినేటర్ గా ఉంటావా? ప్లీజ్ !!
తను అలా అడిగేసరికి ఆర్యన్ నో చెప్పలేకపోయాడు ఆ మూడు రోజులు ఇద్దరి మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది కలిసి డెకరేషన్ ఐటమ్స్ కొనడానికి వెళ్లడం, ఈవెంట్స్ ప్లాన్ చేయడం, మధ్యలో క్యాంటీన్ లో కాఫీ తాగడం… ఇవన్నీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్ ని క్రియేట్ చేశాయి…….
ఫెస్ట్ లాస్ట్ డే నైట్… అందరూ డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు బట్ ఆర్యన్, అన్విక స్టేజ్ పక్కన కాళిగా ఉన్న ప్లేస్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు
తెలుసా… మా ఇంట్లో అంతా బిజినెస్, మనీ, రూల్స్… నాకు ఇలాంటి సింపుల్ అండ్ రియల్ లైఫ్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ త్రీ డేస్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నాకే తెలుసు థాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ అంటూ చిరు నవ్వుతో ఆర్యన్ వైపు చూసి ఇన్నోసెంట్ గా నవ్వడం చూసిన ఆర్యన్ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టేలా చేస్తుంది ఇక అన్విక కు లేట్ చేయకుండా ప్రపోజ్ చేసి చెప్పేయాలి అనిపించింది కానీ తన కళ్లలో ఉన్న ఆ ప్రశాంతతని పాడు చేయడం ఇష్టం లేక ఆగిపోతాడు……..
ఎవ్రీ డే ఆర్యన్ & అన్విక మీట్ అవుతూ చక్కగా టైమ్ స్పెండ్ చేసేవారు ఒకరోజు ఆర్యన్ అన్వికని తన బైక్ మీద అన్విక ఇంటి గేట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అది అన్విక ఫాదర్ మహేంద్ర కళ్ళల్లో పడుతుంది……. నువ్వు కోరుకున్నట్టు బైక్ లో డ్రాప్ చేసాను ఆర్ యూ హ్యాపీ నౌ అంటూ అన్విక వైపు చూస్తూ అడుగుతాడు చాలా హ్యాపీ ఒకే డాడ్ వచ్చి ఉంటాడు బాయ్ అంటూ అన్విక వెనుక ఉన్న కార్ లో కూర్చుని గెట్ ఓపెన్ చేయగానే కార్ ఆ ఇంట్లోకి వెళ్ళడం చూసి ఆర్యన్ కూడా రిటర్న్ అవుతాడు……..
అన్విక నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళేసరికి మహేంద్ర హాల్ లో సీరియస్ గా ఏవో ఫైల్స్ చూస్తూ కనిపిస్తాడు సీరియస్ గా ఉన్న ఫాదర్ లుక్స్ కి భయపడుతూ స్టెప్స్ వైపు వెళుతున్న అన్విక తన ఫాదర్ పిలవడం తో ఆయన ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్ సోఫా లో కూర్చుంటుంది……..
నిన్ను డ్రాప్ చేశాడే ఎవడు వాడు ……. ?? నార్మల్ పీపుల్ తో ఫ్రెండ్షిప్ చేయడం అంటే.. మన స్థాయిని మనం తగ్గించుకోవడమే అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్విక?
డాడ్.. తను నా ఫ్రెండ్ ఆర్యన్ హి ఇస్ ఎ గుడ్ పర్సన్ ప్లీస్ తన గురించి అలా థింక్ చేయకండి
ఫ్రెండ్? అని వెటకారంగా అంటూ వాడి కళ్ళలో నీ మీద ఫ్రెండ్షిప్ కనిపించడం లేదు ఆశ! మాత్రమే కనిపిస్తుంది అది కూడా నా ఆస్తి మీద ఆశ అందుకే నీకు ఫ్రెండ్షిప్ అంటూ దగ్గరయ్యాడు బెటర్ వాడికి డిస్టెన్స్ చెయ్………
డాడ్ ఆర్యన్ నాకు గుడ్ ఫ్రెండ్ వై డోంట్ యూ అండర్స్టాండ్ దట్………
స్టాప్ ఇట్ అన్విక ఇదంతా కాదు నీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా నా బిసినెస్ పాట్నర్ గోకుల్ తెలుసు కదా తన కొడుకు వర్ధన్ తో నీకు వచ్చే వారం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాను…….
వాట్…… ?? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా ఫిక్స్ చేసారు డాడ్ నా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు
నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్విక ఎలాగో నీ స్టడీస్ నెక్స్ట్ మంత్ ఫినిష్ అవుతాయి సో నో ప్రాబ్లెమ్ గెట్ రెడీ ఫర్ యూర్ ఎంగేజ్మెంట్ అని తాను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాడు……..
అన్విక తన ఫాదర్ డెసిషన్ కి షాక్ అవుతుంది కానీ తన ఫాదర్ కి ఎదురు చెప్పే ధైర్యం చేయదు అందుకే బాధగా తన రూమ్ కి వెళ్ళిపోతుంది………
పీస్ఫుల్ ఈవెనింగ్ టైమ్ కాలేజ్ టెర్రస్ మీద సూర్యాస్తమయం వేళ ఫెస్ట్ అయిపోయిన వన్ వీక్ తరువాత ఆర్యన్ మనసంతా ఒకటే అలజడి ఇవాళ ఎలాగైనా అన్విక కు నా మనసులో మాట చెప్పి ప్రపోజ్ చేయాలి అనుకుని తన కోసం ఒక అందమైన హ్యాండ్ డ్రాన్ పెయింటింగ్ (అన్విక పెయింటింగ్ వేస్తున్నట్టుగా ఆర్యన్ గీసిన స్కెచ్) ని గిఫ్ట్ పేపర్ తో ర్యాప్ చేసి తీసుకువస్తాడు………
ఒక చిన్న రోజ్ & తను వేసిన పెయింటింగ్ తీసుకుని అన్విక కోసం టెర్రస్ పైన వెయిట్ చేస్తుంటాడు ఆర్యన్ కాసేపటికి అన్విక వచ్చింది… ఎప్పటిలాగే అందంగా చాలా గ్రేస్ఫుల్ గా ఉంది బట్ తన కళ్లలో ఏదో తెలియని దిగులు క్లియర్ గా కనిపిస్తుంది…….
ఆర్యన్ అన్విక వైపు చూస్తూ కొంచెం నెర్వస్‌గా ఫీల్ అవుతూ హే… వచ్చావా! నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకుని వచ్చాను
ఏంటా సర్ప్రైజ్? అన్నట్టు చూస్తుంది అన్విక
ఆర్యన్ తన కళ్లలోకి చూస్తూ నీతో ఈ కొద్ది రోజులు గడిపిన టైమ్ నా లైఫ్ లో ది బెస్ట్ టైం నిన్ను చూసిన ఫస్ట్ రోజే నా మనసు నీ దగ్గరే ఉండిపోయింది ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ బట్ I really love you. నీకు లైఫ్ లాంగ్ నీకు తోడుగా నీ చిన్న చిన్న ఇష్టాలను తీరుస్తూ నీతోనే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అన్విక Will you be mine forever? అంటూ రోజ్ తనకి ఇస్తుంటే, తన ముఖంలో సిగ్గు /నవ్వు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆర్యన్ తన కళ్లలో నీళ్లు తిరిగడం తో అయోమయంగా అవుతూ చూస్తున్నాడు……
అన్విక ఒక్క అడుగు వెనక్కి వేసి వణికిపోతున్న గొంతుతో I’m… I’m so sorry. ఆర్యన్ నేను నీకు ఇది ముందే చెప్పాల్సింది ఇట్స్ మై మిస్టేక్ యాక్చువల్లీ I’m already engaged అంటూ బాధగా చెప్పగానే ఆర్యన్ చేతిలో ఉన్న రోజ్ కింద పడిపోయింది ఒక్క క్షణం తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది……..
continues 💖
Swipe left/right or tap the sides to turn pages