పెళ్లి చూపులు -24
“ఎవరో..!” అని రాగం తీస్తూ తల ఎత్తి చూసిన సిరికి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి “”వీడా..” అని రాగం తీసింది.
“అదేంటే వీడా అని అంటున్నావ్.. అతను నీకు ముందే తెలుసా?” అని రమ్య అడిగింది
“తెలుసా ఏంటి?? అతనే నా పెళ్లి చూపులకి వచ్చిన నెంబర్ 50” అని అన్నది
“ఏంటి..!” అని ఇప్పుడు రమ్య రాగం తీయడం
“దొంగ సచ్చినోడు అక్కడ పెళ్లి చూపులకు వచ్చి మా ఇంటి పరువు తీసింది కాక ఇక్కడ నేను ఎంతో హోప్స్ పెట్టుకున్న టీం లీడర్ పొజిషన్ కూడా లాక్కున్నాడా!” అని పళ్ళు నూరుతూ వైష్ణవ్ వైపు చూస్తూ ఉంది సిరి