పరిచయమే పరవశమై 💘 – 3
Engaged ?? ఆ ఒక్క పదం తన గుండెని వెయ్యి ముక్కలు చేసింది అన్విక ఆర్యన్ వైపు చూసి
రేపే నా ఎంగేజ్మెంట్ ఆర్య మా నాన్న బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇది నా ఇష్టం తో అయితే కాదు కానీ నా ఫ్యామిలీ కోసం నేను కాదనలేకపోయాను. You are a wonderful person… seriously. నా లైఫ్ లో నీలా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తిని చూడలేదు. ఈవెన్ మా డాడ్ కూడా నీ అంతలా నన్ను అర్తం చేసుకోలేదు ……….
అన్విక బీ సీరియస్ నువ్వు నాతో ప్రాంక్ చేయాలి అనుకుంటున్నావా ……… ??
కమాన్ ఆర్యన్ ఇలాంటి విషయాల్లో ఎవరైనా ప్రాంక్ చేస్తారా నేను సీరియస్ గానే అంటున్నా రేపు నా ఎంగేజ్మెంట్ నిన్ను ఇన్వైట్ చేయడానికే ఇక్కడ వెయిట్ చేయమన్నాను……..
ఇన్నాళ్ళ మన పరిచయం లో నా ప్రేమ నీకు ఎందుకని అర్తం కాలేదు అన్విక ఇన్నాళ్ళు నువ్వే నా ప్రపంచం అనుకుని బ్రతుకా ఐ రియల్లీ లవ్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ……..
ఆర్యన్ ప్లీస్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంతే ఇంతకు మించి నేను నిన్ను ఎపుడు వేరేలా చూడలేదు రేపు మా ఇంటికి రా… యాస్ ఎ ఫ్రెండ్ గా నా ఎంగేజ్మెంట్‌కి నువ్వు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ రాకుండా ఉండకు అని అన్విక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆర్యన్ అక్కడే అలాగే నిలబడిపోయాడు తన ప్రేమ తనకు దొరికింది అనుకునే లోపే, తన చేతుల్లోంచి జారిపోయింది అని ఆర్యన్ బాధగా అక్కడే మోకాళ్ల మీద కూలబడిపోయాడు కింద పడిన తన స్కెచ్ మీద అన్విక కన్నీటి బొట్టు పడ్డం చూసి తను ప్రపోజ్ చేయాలనుకున్న క్షణం.. తన జీవితంలోనే అత్యంత విషాదకరమైన క్షణంగా మారిపోతుంది అని తను అసలు అనుకోలేదు……..
అన్విక వెళ్ళిపోయాక ఆర్యన్ బారమైన అడుగులతో తన రూమ్ కి వెళ్ళి చాలా డల్ గా కూర్చుంటాడు తను గీసిన ఆ స్కెచ్ మీద అన్విక కన్నీటి చుక్క పడటం చూసి ఆర్యన్ గుండెల్లో తెలియని పెయిన్ నేను ఇంతలా ప్రేమిస్తే కేవలం నన్ను ఫ్రెండ్ అని ఎలా అంటుంది అనే ప్రశ్న తనను పీస్ఫుల్ గా ఉండన్నివడం లేదు అన్విక కళ్ళల్లో తన మీదున్న ప్రేమను చాలా సార్లు చూసాడు కానీ అన్విక ఇలా తనను ఫ్రెండ్ మాత్రమే అంటుంటే తన గుండెను ఎవరో రెండుగా చీల్చినంత పెయిన్ గా ఉంది కాసేపటికి ఏదో డిసైడ్ అయ్యి సైడ్ స్మైల్ తో అన్విక ఇచ్చిన ఇన్విటేషన్ కార్డ్ వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు…….
అది హైదరాబాద్ లోనే లగ్జరీ కన్వెన్షన్ గ్రాండ్ వెన్యూ హాల్ ఎంట్రన్స్ లో ప్యూర్ వైట్ అండ్ పింక్ కలర్ ఎగ్జోటిక్ ఫ్లార్స్ తో డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర ఉన్న పెద్ద క్రిస్టల్ చండీలైర్స్ నుంచి వచ్చే లైట్ హాల్ మొత్తాన్ని ఒక గోల్డెన్ గ్లో తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది తో అన్విక స్టేజ్ మీద తన ఫియాన్సి వర్ధన్ పక్కన నుంచుని గెస్ట్స్ తో మాట్లాడుతూ ఉంది కానీ తన కళ్ళు మాత్రం ఆర్యన్ కోసం వెతుకుతున్నాయి ……. తనకు తెలుసు ఆర్యన్ తప్పకుండా వస్తాడని అందుకే తన కళ్లు ఎంట్రన్స్ వైపే చూస్తున్నాయి……
అన్విక గెస్ట్స్ ఇక్కడ మాట్లాడుతుంటే ఏంటి అటు వైపు చూస్తున్నావ్??
ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై ఫ్రెండ్ వర్ధన్ అంటూ ఉండగానే ఆర్యన్ హాల్ లోకి ఎంటర్ అవ్వడం చూసి అన్విక చిరు నవ్వుతో హి ఈజ్ కమింగ్ అంటూ ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది ఆర్యన్ కూడా అన్విక ను అపుడే చూసి నవ్వుతూ స్టేజ్ మీద కు వెళ్ళి బొకే ఇస్తూ విషెస్ చెప్తాడు
ఆర్యన్ దగ్గరకు రాగానే అన్విక చిన్న చిరునవ్వుతో వచ్చావా? నువ్వు రావేమో అని చిన్న డౌట్ ఉండేది థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆర్యన్
డౌట్ ఎందుకు అన్విక? నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను బై ది బై స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని చేతిలోని గిఫ్ట్ ప్యాక్ అన్విక చేతిలో పెడతాడు
థాంక్ యూ సో మచ్ ఆర్యన్ అంటూ వర్ధన్ హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్యన్ అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేస్తుంది వర్ధన్ తన చేతికి ఉన్న కాస్ట్లి వాచ్‌ను వేసుకున్న సూట్ ని సరిచేసుకుంటూ ఆర్యన్‌ని డ్రెస్సింగ్ ను చూసి తక్కువగా చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు…..
ఓహ్.. ఇతనేనా ఆర్యన్ అంటే? చూస్తుంటే చాలా నార్మల్ గా ఉన్నాడు అన్విక, నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఇంత యావరేజ్ గా ఉంటుందని ఎక్స్పెక్టెడ్ చేయలేదు లుక్ ఎట్ దిస్ ఆర్యన్ ఈ డెకరేషన్, క్రౌడ్, వెన్యూ , ఎంగేజ్మెంట్ రింగ్స్… ఇవన్నీ నా స్టేటస్‌కి సింబల్స్. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్ ద కాస్ట్ ఆఫ్ ది సింగిల్ ఈవెనింగ్
ఆర్యన్ చిన్న స్మైల్ తో వర్ధన్ కళ్ళల్లోకి చూస్తూ వై నాట్ వర్ధన్ ఈ డెకరేషన్ చాలా కాస్ట్లీ అవ్వచ్చు బట్ బాండ్స్ కాస్ట్ మీద కాదు వాల్యూ మీద డిపెండ్ అవుతాయి You are showing your bank balance but I am showing my heart.,……
ఆర్యన్ & వర్ధన్ మాటలు విన్న అన్విక కు వర్ధన్ మాటల్లో ఉన్న అహంకారం ఆర్యన్ మాటల్లో ఉన్న లోతు అన్వికకు అర్థమవుతున్నాయి. వర్ధన్ ఆమెను తన స్టేటస్‌కి ఒక ఆర్నమెంట్ లా చూస్తుంటే, ఆర్యన్ మాత్రం ఆమెను ఒక ప్రాణం లా చూస్తున్నాడని అన్విక కు అర్థమైంది……
ఆర్యన్ మాటలకు వర్ధన్ కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ ఫిలాసఫీలు చెప్పడం ఈజీ ఆర్యన్ బట్ ఇన్ ది రియల్ వరల్డ్ స్టేటస్ మ్యాటర్స్ అన్వికకు కావాల్సిన లగ్జరీ నేను ఇవ్వగలను ……. అంతకంటే ఇంకేం కావాలి తను నాతో హ్యాపీగా రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంది యూ నో వాట్ మా ఎంగేజ్మెంట్ రింగ్స్ స్పెషల్ & రేర్ డైమండ్స్ తో బెల్జియం నుండి తెప్పించా అంటూ గొప్పగా చెప్తూ ఉంటాడు…….
ఆర్యన్ చిన్నగా నవ్వి స్టేటస్ గివ్స్ కంఫర్ట్ బట్ నాట్ పీస్ ఎనీ వే ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాక అన్విక వైపు చూస్తూ తనకు మాత్రమే వినిపించేలా ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ప్రేమ నిజమైతే కాలమే మళ్లీ మనల్ని కలుపుతుంది. ఐ ఆమ్ నాట్ వర్రీడ్ అబౌట్ దిస్ ఎంగేజ్మెంట్ బికాస్ ట్రూ లవ్ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఇట్ అంటూ అక్కడి నుండి చిరు నవ్వుతో వెళ్ళిపోతాడు ఆర్యన్ స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే అన్విక కళ్లు తననే ఫాలో అవుతున్నాయి అన్విక గుండెల్లో ఏదో తెలియని సఫోకేషన్ అందుకు రీసన్ అన్విక కు కూడా తెలియడం లేదు………
ఆర్యన్ వెళ్ళగానే వర్ధన్ ఒక వెటకారపు నవ్వు నవ్వి తన సూట్ సరిచేసుకుంటూ అన్విక వైపు చూసి చూశావా అన్విక? వీడేనా నీ బెస్ట్ ఫ్రెండ్? కనీసం నా కళ్లలోకి చూసి గట్టిగా వాదించే దమ్ము కూడా లేదు వీడికి స్టేటస్ మ్యాటర్స్ బేబీ వాడు జస్ట్ Idealist గాలిలో మేడలు కట్టే రకం నేనేంటో చూశాడు కాబట్టే తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు స్టుపిడ్ అలాంటి వాళ్ళతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకో డియర్ దే ఆల్ ఆర్ డర్టీ లో క్లాస్ పీపుల్……
అన్విక ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ తను తోక ముడిచి వెళ్ళలేదు వర్ధన్… తన మీద తనకు ఉన్న నమ్మకంతో వెళ్ళాడు.
వర్ధన్ కోపంగా అన్విక చేయి పట్టుకుని ఏంటి? వాడికి సపోర్ట్ చేస్తున్నావ్ Look at this ring అన్విక! ఇది నార్మల్ రింగ్ కాదు దీని వాల్యూ నీ ఫ్రెండ్ లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. Respect the status you are getting!
వర్ధన్ తన స్టేటస్ గురించి గొప్పలు చెబుతుంటే అన్వికకు ఆర్యన్ మాటలు గుర్తొస్తున్నాయి రింగ్స్ కెన్ బీ ఎక్స్ చెంజేడ్ బట్ సోల్స్ కెనాట్ అన్న మాటలే వినిపిస్తున్నాయి
తన చుట్టూ ఉన్న ఆ గ్రాండ్‌నెస్ కాస్ట్లీ డెకరేషన్ అంతా ఇప్పుడు అన్విక కు ఒక ప్రిజన్ లా అనిపిస్తోంది…..
అన్విక ఆర్యన్ గురించే ఆలోచిస్తూ ఆర్యన్ ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు తన కళ్లలో ఒక చిన్న భయం కూడా లేదు. ఎందుకు? తన మీద తనకు అంత నమ్మకం ఏంటి అని వర్ధన్ బిహేవియర్ చిరాకు పుట్టించడం తో అసహనంగా ఫీల్ అవుతూ ఆర్యన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది……..
బయట పార్కింగ్ ఏరియాలో ఆర్యన్ తన బైక్ దగ్గర నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగి ఫంక్షన్ హాల్ వైపు చూశాడు తన ఫ్రెండ్ రిషి కంగారుగా ఆర్యన్ ను చూసి దగ్గరకు వచ్చాడు……
ఆర్యన్! ఏంట్రా ఇది? లోపల వాడేమో అంతలా రెచ్చిపోతుంటే నువ్వు సైలెంట్‌గా వచ్చేస్తున్నావ్? అన్విక నీకు దక్కదని భయం వేయడం లేదా?
ఆర్యన్ చిరు నవ్వుతో బైక్ స్టార్ట్ చేస్తూ భయం ఎందుకు రా? భయం అనేది అబద్ధానికి ఉంటుంది కానీ నిజానికి కాదు. వర్ధన్ దగ్గర డబ్బు ఉంది అందుకే వాడు అంత యారోగెంట్ గా ఉన్నాడు బట్ నా దగ్గర ప్రేమ ఉంది అందుకే నేను పీస్ఫుల్ గా ఉన్నాను. నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ బ్యాలెన్సింగ్ థింగ్స్ ఎంగేజ్మెంట్ రింగ్ అన్విక ఫింగర్ కి ఉండచ్చు కానీ తన మనసులో ఉన్న నా పేరును వర్ధన్ ఎరేస్ చేయలేడు అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు……..
continues 💖
Swipe left/right or tap the sides to turn pages