హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, శివ ఒక ప్రైవేట్ టాక్సీ మాట్లాడుకుని సాహిత్యను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. హైవేపై జరిగిన ఆ భయంకరమైన యాక్సిడెంట్, ఆ తర్వాత వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ ఇద్దరి మనసుల్లోనూ ఒక తెలియని భయాన్ని నింపాయి. కానీ శివ బయటకు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. సాహిత్య గదికి చేరుకోగానే, ఆమెను లోపల దించి జాగ్రత్తలు చెప్పాడు.