New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 3

పులి పంజా 🐯 – 3

భాగం – 3

తనలోని భయాన్ని బయట పెట్టక మెల్లిగా అంటున్న రాము మాటలకి, “భయం వేస్తుంది రాము నిజంగా నాన్నకి ఏం కాలేదు కదా.”

“నీ మాటలతో నన్ను భయపెట్టకు రా ఇప్పటికే నాన్న అల్లారం మోగించాడు అంటే కచ్చితంగా ఏదో ఆపద ఉంది అనే అర్థం అదేంటో తెలియక భయంతో చచ్చేలా ఉన్నాను నేను. 
ఇప్పుడు మామ కూడా అక్కడే ఉన్నాడు అంటే నా ఆలోచనలు సరిగ్గా పని చేయవు అందుకే మనం ఆలస్యం చేసే కొద్ది మన భయాలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్పితే తరగవు. 
అందుకే గమ్మున ముందుకు నడువు” ఇంకొక సెకండ్ అలానే మాట్లాడితే ఎక్కడ లేని పోని ఆలోచనలు వచ్చేస్తాయో ఏమో అన్న భయంతోనే గట్టిగా అరిచి మరి ముందుకు నడిపించాడు సోముని… 
అదేంటో ప్రకృతి అమ్మ ఎవరు చెప్పినా చెప్పకపోయినా తన పని తాను ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది కదా. 
అలానే సోము గుండెలో మొదలైన గుబులు ముందుకి ఒక్కొక్క అడుగు వేసే కొద్ది ఇంకా ఇంకా రెట్టింపు అవుతూనే ఉందే తప్పే తగ్గటం లేదు. 
ఎంత దాన్ని తగ్గించుదామన్న తన వల్ల కావడం లేదు. 
లోపల జపిస్తున్న జపాన్ని మాత్రం మరవలేదు, విడువలేదు. 
తన నాన్నకి ఏం కాకూడదు ఏం కాకూడదు అని జెపిస్తూనే ముందుకు నడిచాడు. 
వారి వెంట తెచ్చుకున్న దిక్సూచి ఆధారంతో అడవిలో చిక్కుకుపోయిన ఆ ముగ్గురి లో నుంచి ఒకరి దగ్గరికి ఒక జంట చేరితే ఇంకొకరి దగ్గరికి ఇంకొక జంట చేరారు.
వాళ్లని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పని అయ్యి ఆ ప్రాంతంలో ఇంకొక్క క్షణం కూడా ఉండలేక ఆ కుర్రాళ్ళ సహాయంతో సుబ్బడు, రంగయ్య తిరిగి వాళ్ళ ఊరిని చేరుకున్నారు. 
తిరిగి వచ్చిన వారి భర్తలను చూస్తే గాని వాళ్ళ ఒంటిలో ఊపిరి ఆడలేదు వాళ్ళ భార్యలకి.
వెళ్లిన వారిలో ఇద్దరు వచ్చేసారు మిగిలిన ఇద్దరూ అలాగే రాము, సోము ఇంకా రాలేదు అని తెలుస్తుంటేనే సోమయ్య భార్య అయిన నీరజ గుండె లబ్ డబ్ లబ్ డబ్ మంటూ తెగ కొట్టేసుకుంటుంది. 
వీరయ్య అల్లారం ఆధారంగా దిక్సూచి తో ఆ ప్రాంతాలు అన్నిటినీ పరీక్షిస్తూనే మొత్తానికి తాను దాగున్న చిన్ని గుహ దగ్గరికి చేరుకునే సమయానికి, తెల్లవారబోతున్న ఆ సమయంలో మెల్లిగా వినిపించాయి పెద్ద పులి అడుగులు. 
ఆ అడుగులు విన్న రాము, సోము అది వీళ్ళకి దగ్గరలోనే ఉంది అని సూచనలు తెలుస్తుంటేనే పరుగున వెళ్లి ఆ పక్కనే ఉన్న చిన్ని రాళ్ల పొదల్లో దాచేసుకున్నారు. 
పులి అడుగుల చప్పుడు విన్న వీరయ్య అప్పటి వరకు భారంగా పీలుస్తున్న ఊపిరిని కొన్ని క్షణాల పాటు ఉగ్గ బట్టాడు.
సోమయ్య శవాన్ని ఈడ్చుకుంటూ వస్తున్న పులిని చూడగానే సోము గుండె పగిలిపోయి, “నాన్న….” అంటూ ఆత్రంగా బయటికి రాబోతుంటేనే బలంగా తన నోటిని మూసేసి, 
“సోము సోము దయచేసి గట్టిగా అరవకు రా అది చూసిందంటే ప్రాణాలు పోతాయి” నిర్జీవంగా మారిన తన మామ శరీరాన్ని చూసిన అతని కళ్ళు శోకసంద్రులు అవుతుంటే ఏడుస్తూనే బలవంతంగా పలికాడు ఆ పలుకులని. 
“రేయ్ రేయ్ నాన్న రా నాన్న అది నాన్నని చంపేసింది” తనలోని ఎమోషన్స్ తన మాట వినక అన్ని బయటికి కట్టలు తెంచుకుంటుంటేనే బలవంతంగా తనని కట్టడి చేశాడు రాము. 
చిన్నగా అలికిడి వినిపించిన పులికి ముందుకు వేస్తున్న తన అడుగులని ఆపేసి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా మెల్లిగా పరికించింది. 
రాళ్ల పొదల్లో దాగుని మిత్రుడిని కట్టడి చేస్తున్న రాము కంటికి ఊపిరిని ఉగ్గబట్ట లేక కష్టంగా ఊపిరిని వదులుతున్న తన నాన్న ఆ పులికి దగ్గరలో ఉన్న గుహ లో కనిపించి ఒక్క క్షణం గుండె అదిరి, 
చాలా సేపటి వరకు ప్రయత్నించాడు ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో తాము బయటకు వద్దాం అని కానీ ఎంత సేపటికి అది కదలక చుట్టూ అంతా పరికిస్తున్న దాని కంటికి వీరయ్య ఉన్న ఆ చిన్ని గుహ కనపడగానే అటు వైపుగా దాని అడుగులని మళ్లించడం చూసి, 
అప్పటికే తన మామని పొట్టన పెట్టుకున్న ఆ పులి పై పీకల దాకా కోపం వస్తున్న రాము తన తండ్రిని కూడా బలి తీసుకోవటానికి వెళ్తుంటే సహించలేక, “రేయ్ సోము సిద్ధంగా ఉండు రా. ఇది చచ్చింది ఇవాళ మన చేతిలో.”
అప్పటి వరకు తనని ఆపిన మిత్రుడు అంత సడన్గా ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అని ఉబికి వస్తున్న కన్నీళ్ళతోనే అటుగా చూసిన తన కంటికి భారంగా శ్వాస తీసుకుంటున్న తన మామ వైపే, 
రాక్షసంగా తన తండ్రి శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్న ఆ పులి కనిపించి, బాధ ప్లేస్ లో కోపం రావటం ఆలస్యం.
వస్తున్న కోపం నషాలానికి ఎక్కి రాము వైపు తిరగగానే కళ్ళతోనే సోము కి సైగలు చేశాడు రాము. 
ఆ సైగలు అర్థం చేసుకున్న సోము తన కాలికి ఉన్న చెప్పులని అక్కడే వదిలేసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పులికి వెనుకగా తాను వెళ్తే, 
ఆ పులి పక్కగా రాము వెళ్ళాడు. 
సరిగ్గా ఆ పులి రక్తపు వాసనని పసిగడుతూ వీరయ్య ఉన్న ఆ చిన్ని గుహ లోపలికి వెళ్లే ఒక్క సెకండ్ ముందు సరిగ్గా అనుకున్న సమయానికి వారి చేతిలో ఉన్న తుపాకీలని దాని వైపుగా ఎక్కు పెట్టి, 
వెనుక నుంచి సోము పక్క నుంచి రాము ఒక్క సారిగా ఇద్దరు బులెట్లు ఒకే సారి దాని శరీరంలోకి దించేశారు. 
అస్సలు ఊహించని ఆ ప్రక్రియకి సోమయ్య శరీరాన్ని నోటి నిండా బంధించిన ఆ పెద్ద పులి ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది ఉన్న చోటనే… 
ఇంకా ఉంది…
నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేయరా.
ఇట్లు
మీ కీర్తి💕