ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 3
ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరికీ టెన్షన్ ఎక్కువ అయ్యి బయటకు లోపలికి తిరుగుతూ ఉంటారు.
అమ్మ:పార్వతి
తమ్ముడు :అరవింద్
నాకెందుకో భయం గా ఉంది రా టైం ఒకటి అవ్వొస్తుంది గంటలో వస్తానని చెప్పింది ఇప్పటికి రెండు గంటలు అయ్యింది చెప్పి కూడా ఏమి అయ్యిందో ఏమో నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు రా అని భయ పడుతూ అంటది.
అది విని అరవింద్ అమ్మ అక్క కి ఏమి కాదు నువ్వేమి టెన్షన్ పడకు ఇలా వచ్చి కూర్చో నేను అక్కకి కాల్ ట్రై చేస్తున్న కానీ ఎందుకో కలవడం లేదు అని మళ్ళీ డయల్ చేస్తూ అంటాడు ఇంతలో రింగ్ అయ్యిద్ది కానీ ఎత్తదు ఈ లోపే ఫోన్ కట్ అయినట్టు వచ్చిద్ది వెంటనే ఇదిగో రింగ్ అయ్యి ఫోన్ కట్ అయ్యింది అంటే కచ్చితంగా జాగ్రత్త గానే ఉండి ఉండిద్ది దారిలో ఉందేమో అని చెప్తాడు.
అప్పుడు పార్వతి గారు అదేంటి రా దారిలో ఉంటే ఒకమాట ఫోన్ ఎత్తి ఇలా వచ్చేస్తున్నా దారిలో ఉన్నా అని అయినా చెప్పాలి కదా ఆలా కట్ చేయడం ఏంటి అని కోపం గా కొంచెం కంగారు గా అడుగుతారు ఇంకా అరవింద్ అబ్బా అమ్మ ఒకవేళ ఫోన్ ఎత్తడం కుదరక కట్ చేసింది ఏమో అని సద్ది చెప్పాలని చూస్తాడు.
కానీ నిజానికి అరవింద్కి కూడా ఒక మూల భయం వేస్తూనే ఉండిద్ది ఎందుకు కట్ చేయడం ఒకసారి ఎత్తి చెప్పొచ్చు కదా పోనీ ఎత్తడం కుదరక పొతే కనీసం మెసేజ్ అయినా చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు ఆ విషయాన్నీ చెప్తూ అరవింద్ కూడా కంగారు పడ్డాడు అంటే ఎక్కడ వాళ్ళ అమ్మ కి ఇంకా టెన్షన్ ఎక్కువ అయ్యిద్ది అని ఆలా కప్పి పూచ్చుతాడు.
ఆలా ఎదురు చూస్తూ చూస్తూనే తెల్లవారి పోయిద్ది అయినా ఎంత సేపటికి ఆ అమ్మాయి జాడ తెలియదు ఇంకా వీళ్ళు ఇలా కాదు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి అని నిర్ణయించుకుంటారు ఇంకా పార్వతి గారు అరవింద్ ఇద్దరు రెడీ అయ్యి ఏడింటికల్లా స్టేషన్ కి వెళ్తారు.
అక్కడికి వెళ్లి si గారిని కలవాలి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కాన్స్టేబుల్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు అది విని సార్ ఇంకా రాలేదు టైం ఉంది రావడానికి ఒక గంటలో వస్తారు అప్పటి వరకు ఎదురు చూడగలిగితే చూడండి లేకపోతే వెళ్లి గంట తర్వాత మళ్ళీ రండి అని చెప్తాడు.
ఇంక అరవింద్ పార్వతి గారి వైపు చూస్తాడు ఆమె ఇంక లేదు అప్పటి వరకు ఇక్కడే ఎదురు చూద్దాం అని చెప్పిద్ది ఆ మాటకి అరవింద్ కూడా సరే అని మేము ఇక్కడే ఉంటాం అప్పటి వరకు అని చెప్తాడు కాన్స్టేబుల్ తో సరే మీ ఇష్టం వెళ్లి అక్కడ కూర్చోండి అని si గారు వచ్చాక నేను వచ్చి చెప్తాను అని అంటాడు.
అప్పుడు వాళ్ళు సరే సార్ అని చెప్పి వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చుంటారు కానీ వల్ల మనసు మాత్రం ముందు రోజు నవ్వుతు వెళ్లిన ప్రణతి మొఖమే గుర్తొస్తది ఇంకా ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఎలాగ అయినా అక్క దొరికేస్తే బాగుండు అనుకుంటూ టైం చూస్తూ si ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు.
ఇంతలో స్టేషన్ ముందు ఒక జీప్ వచ్చి ఆగిద్ది అది చూసి కాన్స్టేబుల్స్ అందరు లేచి నుంచుంటారు ఇంతలో ఒక మధ్య వయసు ఉన్నా అతను లోపలికి వస్తూ ఉంటే అందరు సెల్యూట్ కొడుతూ ఉంటారు.
వాళ్ళు ఆలా లేవడం చుసిన వాళ్ళకి అర్ధం అవుతాది si వచ్చారు అని వెంటనే వీళ్ళు కూడా లేచి నుంచొని చూస్తూ ఉంటారు si వీళ్ళ ముందు నుంచే లోపలికి వెళ్తాడు ఇంక వాళ్ళు కూర్చుని ఎప్పుడు పిలుస్తారా అని చూస్తూ ఉండగా.
వాళ్ళని చుసిన కాన్స్టేబుల్ వెంటనే si దగ్గరికి వెళ్లి సార్ మీకోసం ఎవరో వచ్చారు పొద్దున్న నుంచి అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి వల్ల వైపు చూపిస్తాడు ఏంటి అంట ప్రాబ్లెమ్ అని అడుగుతాడు దాని కాన్స్టేబుల్ రంగా మిస్సింగ్ కంప్లైంట్ అంట సార్ అని చెప్పి చెప్తాడు.
సరే వాళ్ళని రమ్మను అని చెప్పి ఎదో ఒక ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటాడు రంగా వెళ్లి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్తాడు వెంటనే అరవింద్ పార్వతి గారు లేచి లోపలికి వెళ్ళి నమస్తే సార్ అని చెప్పి నుంచుంటారు వాళ్ళని చుసిన si శివ కుమార్ కూడా నమస్తే అని చెప్పి చైర్ చూయించి ఇద్దరినీ కూర్చోమని చెప్తాడు.
వాళ్ళు కూర్చున్నాక ఇప్పుడు చెప్పండి ఏంటి మీ సమస్య అని అడుగుతాడు ఇంక అరవింద్ మాట్లాడుతూ మా అక్క కనిపించడం లేదు సార్ అని అంటాడు ఎప్పటి నుంచి అడిగితె నిన్న నైట్ నుంచి నిన్న ఉదయం ఆఫీస్ కి వెళ్ళింది వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్ళింది ఈ రోజు కొంచెం ఓటీ ఉంది నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు కంగారు పడకండి అని చెప్పి వెళ్ళింది.
దయచేసి అందరు మీ విలువైన రేటింగ్స్ ని సమీక్షలని ఇచ్చి నన్ను ప్రోత్సాహరిస్తారు అని ఆశిస్తూ
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages