New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 1

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 1

ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నుంచొని పదే పదే టైం చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కారణం అప్పటికే రాత్రి 11 అవ్వొస్తుంది ఆ దారి గుండా ఒక్క మనిషి కూడా ఉండడు జన సంచరమే ఎక్కువ గా తిరగని చోటు అది అందుకే ఆ అమ్మాయి కంగారు పడుతూ ఏదైనా ఆటో కానీ లేక ఎవరైనా లిఫ్ట్ కానీ ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండిద్ది.

 

ఇంతలో  ఆ అమ్మాయి ఫోన్ మొగుతూ ఉండిద్ది తన బ్యాగ్ లో నుంచి ఫోన్ తీసి విసుక్కుంటూ కొంచెం కంగారు పడుతూ కచ్చితంగా ఇది అమ్మే అయ్యి ఉండిద్ది అనుకుంటూ ఫోన్ లో వచ్చిన పేరు చూసి హమ్మయ్య ఇది అమ్మ కాదు అనుకుని కొంచెం ఊపిరి పీల్చుకొని ఫోన్ ఎత్తి హలో చెప్పరా అని అడిగిద్ది.

 

అటు వైపు నుంచి మాట్లాడుతూ హలో అక్క ఎక్కడ వున్నవే ఇక్కడ అమ్మ కంగారు పడుతుంది అసలు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు ఇబ్బంది ఏమి లేదు గా అని ఆ అమ్మాయికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు ఎంత అడిగిన ఏమి అడిగిన సమాధానం చెప్పక పోయేసరికి అక్క ఉన్నావా అని అడుగుతాడు.

 

అప్పుడు ఆ అమ్మాయి రేయ్ లైన్ లోనే ఉన్నారా అసలు నువ్వు నన్ను మాట్లాడానిస్తే కదా నీ పాటికి నువ్వు ప్రశ్నలు వేస్తూనే ఉన్నావు నన్ను ఎక్కడ చెప్పనిస్తున్నావ్ అని చెప్పి నేను సేఫ్ గానే ఉన్నాను ఆఫీస్ లో లేట్ అయ్యింది అందుకే ఈ టైం అయ్యింది నేను జాగ్రత్త గానే ఉన్నా మీరేమి టెన్షన్ పడకండి ఏదైనా ఆటో రాగానే అది ఎక్కేసి వచ్చేస్తా అమ్మ కి చెప్పు నేను బానే ఉన్నా ఒక గంట అరగంట లో వచ్చేస్తన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ధి.

 

అది విన్న ఆ అబ్బాయి ఫోన్ ఆపి వాళ్ళ అమ్మ వైపు చూసి విన్నావు కదా ఇలా లేట్ అయ్యింది అంట త్వరగానే వస్తాను అని చెప్పింది అని ఆ అమ్మాయి చెప్పినట్టు గా చెప్తాడు దానికి వాళ్ళ అమ్మ కొంచెం భయ పడుతూ కంగారు పడకుండా ఎలా ఉండాలి రా అది అసలే ఆడపిల్ల అందులోను రోజులు బాలేవు అని చెప్పి కన్నీరు పెట్టుకుంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ వేడుకునిద్ది.

 

ఇక్కడ ఆ అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతూ ఒక్కటి కూడా రావడం లేదు చా అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండిద్ది ఇంతలో తన భయాన్ని ఇంకా రెట్టింపు చేసేలా అప్పుడే బండి మీద అక్కడికి కొంతమంది తాగి బండి అటు ఇటు ఊపుతూ కరెక్ట్ గా వచ్చి అక్కడ ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి ముందుకు వచ్చి ఆగి పోయిద్ది.

 

సడన్ గా ఆలా వచ్చిన వాళ్ళని చూస్తూ భయంతో ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళ వైపు కంగారు కంగారుగా చూస్తూ ఉండిద్ది ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు వెంటనే పైకి లేచి బండిని పక్కకి పెట్టి వచ్చి మొత్తం ముగ్గురు ఉన్నారు వాళ్లలో ఒకడు రేయ్ మన అదృష్టం పండింది రా మన మందులోకి మంచి మంచింగ్ దొరికింది రా ఈ రోజు మనకి పండగే ఇంకా అని ఇంకొక అతని వైపు చూస్తూ అంటాడు.

 

దానికి మిగిలిన ఇద్దరు కూడా పెద్దగా నవ్వుతు అవును రా మామ ఇంకెందుకు ఆలస్యం దారా పట్టకెళ్లి ఎంజాయ్ చేద్దాం అని అంటూ దగ్గరికి వస్తూ ఉండగా ఆ అమ్మాయి అడుగులు వెనక్కి వేస్తూ ఉండిద్ది భయం భయంగా చూస్తూ బతిమిలాడుతూ ఉండిద్ది.

 

అన్న వద్దు అన్న ప్లీజ్ అన్న నన్ను ఏమి చేయకండి అని చెప్పి భయం గా అక్కడ పక్కనా ఉన్నా ఒక అతన్ని పక్కకి నెట్టి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయిద్ది అది చూసిన ముగ్గురు రేయ్ మనల్నే తోసి వెళ్ళిపోతుంది రా పట్టుకుందాం పద అని చెప్పి వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనుక పరిగెడతారు.

 

అంతలో వాళ్ళు వస్తున్నారు ఏమో అని వెనక్కి తిరిగి చూసుకుంటూ చూసుకుంటూ పరిగెడుతూ కింద ఏముందో చూసుకోక ఒక బండ ని తగిలి తట్టుకొని పడిపోతది అంతే ఇంకా ఈ లోపు వాళ్ళు చుట్టూ ముట్టేస్తారు అంతే ఇంకా వాళ్ళని ఆలా చూసి భయం తో కింద కూర్చునే వెనక్కి జరుగుతూ వెళ్తాది.

 

ఇంకా అంతే వాళ్ళు వచ్చి చుట్టూ చేరి వాళ్లలో ఒకడు ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపి ఏంటే ఎంత పొగరే నీకు నన్నే నెట్టేసి పారిపోతావా అని చెప్పి జుట్టుని పిడికిలితో గట్టిగ బిగించి పట్టుకొని కిందకి తోసి మీద పడిపోతుండగా ఆ అమ్మాయి వద్దు నన్ను ఏమి చేయొద్దు ప్లీజ్ అన్న అని మళ్ళీ బ్రతిమిలాడుతూ చేతులు జోడించి అడిగిద్ది.

 

అయినా సరే వాళ్ళు వదలక చుట్టూ చేరి తిరుగుతూ చూస్తూ ఉంటారు ఇలా అంటాడు ఒకడు ఒరేయ్ ఈ రోజు మనం దీనితో ఎంజాయ్ చేసాక వదిలేస్తే ఇది ఎవరి దగ్గర అయినా చెప్పద అంటాడు ఆ మాటకి ఇంకొకడు ఒరేయ్ పిచ్చోడా ఎవడైనా ఇల చేసాక వదిలేస్తారా చంపేయడమే అని అంటాడు.

 

అది విన్న ఆ అమ్మాయి ఏడుస్తూ లోపల బాధ పడుతూ ఇలా అనుకుంటూ ఉండిద్ధి ఇంకా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మా తమ్ముడు గుర్తొస్తు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఇదే నాకు చివరి రోజు అని అనుకుంటూ బాధ పడుతూ ఉంటది.

 

ఈ లోపు ఆ ముగ్గురు లో ఒకడు వచ్చి ఇప్పటికే చాల లేట్ చేసాం ఇంకా నా వాళ్ళ కాదు రావే అని చెప్పి ఇద్దరు కాళ్ళు ఇంకా మిగిలిన అతను చేతులు రెండు కలిపి పట్టుకొని మోసకెళ్తూ ఉంటారు ఆ అమ్మాయి అరుస్తూ వదలమని ఎంత గింజకున్న వదలకుండా గట్టిగ పట్టుకొని తీసుకెళ్తున్న టైంకి ఆ అమ్మాయి ఊపిరి బలం గా తీసుకొని వదిలి గట్టిగ బలాన్ని అంత కూడ తీసుకొని కాళ్ళని గట్టిగ విదిలించి వాళ్ళలో ఒకడిని గట్టిగ ఒక చోట బలం గా తన్నీద్ది అంతే ఇంకా అతను ఆ అమ్మాయి ని వదిలేసి తన్నిన చోట పట్టుకొని కింద పడి నొప్పికి అరుస్తూ ఉంటాడు.

 

మిగిలిన ఇద్దరు ఆ అమ్మాయి ని వదిలేసి ఆ పడిన అతని దగ్గరికి వేళ్ళి లేపుతు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి అదే అదును అనుకోని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అనుకొని నెమ్మదిగా పైకి లేచి పడిపోయిన బ్యాగ్ తీసుకొని మళ్ళీ పరిగెత్తిద్ది.

 

అది గమనించిన ఒకడు రేయ్ అది పారిపోతుంది రా అని అరుస్తూ చూపిస్తాడు ఇంకా మిగిలిన ఇద్దరు కూడా ఆ వైపు చూసి రేయ్ అది తప్పించుకోవడానికి వీళ్ళేదు అని కష్టం గా పైకి లేచి వాళ్ళ వైపు చూస్తూ చెప్తాడు మిగిలిన ఇద్దరు సరే రా ఈ రోజు అది మన చేతిలో చావాల్సిందే అని చెప్పి ఆవేశం గా ముగ్గురు పరిగెడతారు.

 

వాళ్ళు రావడం చూసినా ఆ అమ్మాయి ఇంకా వేగం గా తన పరుగుని అందుకునిద్ది కానీ ఆ అమ్మాయి కి అప్పటికే ఓపిక ఐపోయి అడుగులు తడబడుతూ పరిగెత్తిద్ధి అయినా సరే వాళ్ళు వస్తున్నా వేగం చూసి ఎలాగ అయినా తప్పించుకోవాలి అని చెప్పి మనసులో దేవుడికి ప్రార్ధించిద్ది.

 

దేవుడా ఎలాగ అయినా నన్ను రక్షించు స్వామి ప్లీజ్ అమ్మ తమ్ముడు నాకోసం ఎంత ఎదురు చూస్తున్నారో ఎంత కంగారు పడుతున్నారో ఎలాగ అయినా నేను క్షేమంగా ఇంటికి వెళ్లి వాళ్ళని కలుసుకునేలా చూడు స్వామి అని మనసులో వేడుకుంటూనే పరిగెడుతూనే ఉంది.

 

వెనకాల వాళ్ళు మాత్రం లేడి పిల్ల కోసం వెంటాడే క్రూర మృగల్లాగ వెంట వస్తున్నారు ఇంతలో తను ఒకచోట ఎదో చూసి ఆగిపోయిద్ది వెంటనే కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఇంకా నా పని ఐపోయినట్టేనా స్వామి ఎందుకు అయ్యా నన్ను ఇలాంటి పరిస్థితికి తీస్కోచ్చావు నేను తెలిసి కానీ కనీసం తెలియక కూడా ఎవరికి ఏ అపాయం తల పెట్టలేదు కదా స్వామి నన్ను ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంచావు అని కన్నీరు కారుస్తూ ఒక చోట నక్కి కూర్చుని ఉండిద్ది.

 

అప్పుడే సడన్ గా వాళ్ళు కూడా అక్కడికే వచ్చి వెతుకుతూ రేయ్ అది కచ్చితంగా ఇక్కడే ఉండిద్ది రా ఎటు వెళ్లే దారి అయితే లేదు అని చెప్పి కోపం గా వెతుకుతూ ఉంటారు వాళ్ళ మాటలు అన్ని ఆ అమ్మాయికి వినపడుతూనే ఉంది.

 

ఎటువంటి సౌండ్ రాకూడదు అని నోటి మీద చేయి వేసుకొని భయ పడుతూ చూస్తూ ఉండిద్ది ఇంతలో ఆ అమ్మాయి ఫోన్ మొగిద్ది ఇంకా అంతే దాన్ని ఆపాలని టెన్షన్ లో ఏదేదో నొక్కుతుంది కానీ అది ఆగడం లేదు ఇంతలో కరెక్ట్ గా నొక్కి ఆపింది అప్పుడే పక్కన నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు దొరికావే ఎక్కడికి వెళ్తావు అని చెప్పి చేయి పట్టి లాగి పక్కకి తీసుకోస్తారు.

 

అక్కడ వాళ్ళని చుసిన ఆ అమ్మాయి భయపడుతూ ప్లీజ్ నన్ను వదిలేయండి నేను ఎవరికి చెప్పాను ప్లీజ్ అని బతిమిలాడుతూ ఉండగా ఇంకా దానితో మాటలు ఏందీ రా ముందు చంపేయి ఆ తర్వాత అయినా ఎంజాయ్ చేయొచ్చు అని అంటాడు.

 

అది విన్న రౌడీ అవును రా నిజమే అని చెప్పి కత్తి తీసుకొని పొడవడానికి దగ్గరకు వస్తూ ఉండగా అప్పుడే కత్తి పొట్ట దాకా వచ్చింది అది చుసిన ఆ అమ్మాయి భయం తో గట్టిగ కళ్ళు మూసుకునిద్ది…

 

 

 

మీ విలువైన రేటింగ్స్ ని కామెంట్స్ ని ఇచ్చి నన్ను ప్రోత్సాహరిస్తారు అని ఆశిస్తూ

 

మీ

లక్ష్మి అవినాష్.