మార్నింగ్ బద్దకంగా నిద్రలేచి నెమ్మదిగా ఒళ్లు విరుచుకుంటూ పైకి లేచి కూర్చుని మమ్మీ కాఫీ ప్లీజ్ అంటూ ……….. !! కళ్లు తెరిచిన శ్రీకి ఎదురుగా తననే చూస్తూ చెంపపై చేయి పెట్టుకుని కూర్చుని కనిపిస్తాడు అర్జున్ భట్టాచార్య……… !! నిద్ర కళ్ళతో అర్జున్ ను చూసిన కొన్ని క్షణాల తర్వాత నిన్నే తమ ఇద్దరి పెళ్లి జరిగిన విషయం శ్రీ కి గుర్తుకురాగానే ముఖంలో అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది……….. !! గుడ్ మార్నింగ్ మై డియర్ హస్బెండ్ అంది శ్రీ నవ్వుతూ అర్జున్ శ్రీ కు దగ్గరకు జరిగి నువ్వెప్పుడు నిద్రలేస్తావా అని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా బుజ్జీ………?? నన్ను చూసి ఇంత సింపుల్‌గా ఒక విష్ చెప్పేసి సరిపెట్టేస్తావా బుజ్జి అన్నాడు కొంటెగా………. !! మరి ఇంకా ఎలా విష్ చేయాలి అని అమాయకంగా అడుగుతున్న శ్రీ ను చూసి ……… !! ఒక చేత్తో శ్రీ మెడ చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని బూరెల్లాంటి బుగ్గల మీద పెదవులు అద్దుతూ……….. !! ఇదిగో ఇలా ఇంత స్వీట్‌గా విష్ చేయాలి ఒకే నాకు ఎవ్రీ డే ఇలాంటి విష్ తోనే నా డే స్టార్ట్ కావాలి……….. !!