అర్జున్ ప్లాన్ విన్న శ్రీ అర్జున్‌తో కలిసి తను ఉంటున్న చిన్న ఇంటికి వెళ్తుంది………. !!
ముందే నవీన్ వాళ్ల అమ్మకి విషయం చెప్పడంతో కొత్తగా పెళ్లైన జంటను ఇంట్లోకి వెల్‌కమ్ చేయడానికి కావాల్సిన హారతి, పూలు అన్ని ఏర్పాట్లు రెడీ చేసి ఉంచారామె………… !! అర్జున్ భట్టాచార్యతో కలిసి వచ్చిన శ్రీని చూసిన చుట్టుపక్కల వారంతా ఒక్క క్షణం షాక్ అయ్యారు………. !! అంత పెద్ద రాయల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇంటి అమ్మాయి, ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో కాపురం చేయడానికి రావడం అందరికీ షాకింగ్ గా అనిపించింది………. !! కానీ ఎలాంటి ఈగో లేకుండా చిరునవ్వుతో నిలబడిన శ్రీని అర్జున్ తన పక్కన నిలబెట్టుకున్నాడు……….. !! నవీన్ వాళ్ల అమ్మ ఇద్దరికీ దిష్టి తీసి హారతి ఇచ్చాక ఇద్దరూ కుడి కాలు అడుగు పెట్టీ రండి అని చెప్పగానే శ్రీ నవ్వుతూ అర్జున్ తో కలిసి ఇంట్లోకి అడుగుపెడుతుంది………. !! తను ముందే ఒకసారి వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఆ ఇల్లు చాలా నీట్‌గా, డెకరేటివ్‌గా ఉంది………… !! శ్రీ కోసం అర్జున్ కొన్ని కొత్త Home Appliances కూడా కొని పెట్టాడు……… !! ఫ్రెండ్స్ కోసం ఇంట్లోనే గ్రాండ్‌గా లంచ్ ఏర్పాటు చేసిన అర్జున్ ప్రతీ క్యూట్ మోమెంట్‌ని తన మొబైల్‌లో వీడియో తీస్తూ ఉన్నాడు……….. !! అరే ఎందుకు షూట్ చేస్తున్నావ్ అర్జున్ అని శ్రీ సరదాగా అడిగితే దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ మోమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ బుజ్జి ప్రతి క్షణాన్ని స్వీట్ మెమోరీగా దాచుకోవాలి…………. !! ఫ్యూచర్‌లో మన పిల్లలకి చూపించి చూడండి మీ అమ్మ ఎంత ముద్దుగా ఉందో అని చెప్పాలి కదా అని నవ్వుతూ కొంటెగా కన్ను కొడతాడు………. !!
ఆఫ్టర్నూన్ శ్రీకి వాళ్ల అమ్మ ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగినప్పుడు ఫ్రెండ్‌తో ఉన్నాను అమ్మ ……….. !! ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యేసరికి ఈవెనింగ్ అయిపోతుంది అది అవ్వగానే వచ్చేస్తాను……….. !! అని వడివడిగా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది వాళ్ళ అమ్మ తో మాట్లాడినప్పటి నుండి శ్రీ లో కొంచెం Nervousness స్టార్ట్ అవుతుంది………… !! మొత్తానికి ఈవెనింగ్ ఆరు అవుతూ ఉండగా శ్రీజ నిలయం అనే ఆ పెద్ద బంగళా ముందు కొత్తగా పెళ్లైన జంట నిలబడింది………. !!