New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మగువ మనసు 🔥 – 2

మగువ మనసు 🔥 – 2

ఏం చేస్తావు గీతూ……

 

ఏం చేస్తాను చూస్తూ ఉండండి…..అని కన్నింగ్ గా నవ్వుతూ ఉంటుంది….

 

భూమి టెన్షన్ గా బస్ ఎక్కుతుంది…..టైమ్ అయిపోతుంది అనే టెన్షన్ భూమి లో…..

 

బస్ కాలేజ్ దగ్గర ఆగుతుంది….

 

భూమి టెన్షన్ పడుతూ హడావిడిగా దిగుతూ కాలేజ్ లో కి వెళ్తుంది అనగా కొందరు అబ్బాయిలు భూమి నీ పక్కకి తీసుకువెళ్ళిపోతారు….

 

హేయ్ ఎవరు మీరు వదలండి…..వదలండి నన్ను అని గింజుకుంటూ ఉండగా…

 

ఏయ్ నిరుముయ్యి నిన్ను మేము ఏమి చెయ్యము….అయిన నిన్ను నువ్వు చూసుకో ఎలా ఉన్నావో….నిన్ను పట్టుకోవడం కూడా మాకు ఇష్టం లేదు…..

 

నన్ను వదలండి ప్లీజ్ నాకు ఎగ్జామ్ కి లేట్ అయిపోతుంది…..అని ఏడుస్తూ అడుగుతుంది….

 

నువ్వు ఎగ్జామ్ రాయకూడదు అనే కదా నిన్ను అడ్డుకుంది….అని నవ్వుతూ అంటారు వాళ్లు…

 

వాళ్ళు అలా అనగానే భూమి అర్థమైపోతుంది….వాళ్ళని ఎవరు పంపించారు అని….

 

భూమి కి చెప్పలేనంత కోపం వస్తుంది…..కళ్ళు నిప్పుల చెలరేగి వాళ్ళని చూస్తూ నా జీవితం అంతే ఆటలా మీకు నవ్వులాటగా ఉంది కదా మీకు అని తన బ్యాగ్ తో అందరిని కొడుతూ ఉంటుంది….

 

భూమి అలా రియాక్ట్ అవుతుంది అని తెలియక వాళ్ళు షాక్ లో ఉండగా భూమి వాళ్ళను లేవకుండా పక్కనే ఉన్న రాడ్డు తీసుకుని కొడుతూ ఉంటుంది….

 

అంతే కదా ఆడది ఊరుకున్నంత సేపు అబల లా చూస్తారు….

 

అదే ఆడది ఒక్కసారి తిరగబడింది అంటే అమ్మవారి లా చూస్తారు….

 

వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోతారు…..

 

భూమి తన కన్నీళ్లు తుడుచుకుని కాలేజ్ కి పరిగెడుతుంది….తనకి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది….

 

తన శరీరం సహకరించకపోయినా సరే తను జీవితం లో ఓడిపోకూడదు అని తన శక్తి కి మించి పరుగుపెడుతూ తన క్లాస్ రూం కి చేరుకుంటుంది….

 

ఆయాసపడుతూ ఇన్విజిలేటర్కి తన హాల్ టిక్కెట్ ఇస్తుంది….

 

ఆవిడ హాల్ టికెట్ చూసి ఎగ్జామ్ కి అలో చేస్తుంది…

 

అప్పుడు కానీ భూమి ఊపిరి పీల్చుకోదు….

 

వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుని తన ఆయాసం తీర్చుకుంటూ ఉండగా …వాటర్ బాటిల్ తన ముందు పెడుతుంది….తన ఫ్రెండ్ అయిన లావణ్య….

 

థాంక్స్ లవ్….అని వాటర్ మొత్తం తాగేస్తుంది….

 

ఎంటే అంతలా పరుగెత్తావు…..

 

తర్వాత చెప్తాను ముందు ఎగ్జామ్ రాయాలి……

 

అందరికీ క్వశ్చన్ పేపర్ ఇస్తారు….భూమి దానిని తీసుకుని రాస్తూ ఉంటుంది….

 

లావణ్య తన వైపు ఒకసారి చూసి ఎగ్జామ్ అయిపోయాక అడగొచ్చులే అనుకుంటుంది…..

 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

 

గంభీరంగా కూర్చుని ఉంటారు వీరేంద్ర వర్మ గారు…..

 

టెన్షన్ గా చూస్తూ ఉంటారు అతని భార్య వైదేహి గారు….

 

అమ్మ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటావు…..అని తన తల్లి నీ అడుగుతుంది స్వాతి….

 

ఏమో నే నాకు అదే కంగారు గా ఉంది అని అంటారు వైదేహి గారు….

 

ఈరోజు కచ్చితంగా మా అన్నయ్య పని అయిపోయినట్టే మా హిట్లర్ చేతిలో పాపం అన్నయ్య అని వల్ల అన్నయ్య కోసం బాధపడతాడు…ఆదిత్య…

 

ఈరోజు పెద్ద గా ఏదోఒకటి జరుగుతుంది అని ఆనందంగా ఎదురు చూస్తారు వీరేంద్ర వర్మ గారి చెల్లెలి కుటుంబం…..

 

చెల్లి రాజ్యం వల్ల ఆయన మాధవరావు కూతురు వర్ష కొడుకు రాజేష్….

 

చెల్లి అన్న కొడుక్కి కూతుర్ని ఇచ్చి ఈ ఆస్తి పై హక్కు సాధించాలి అని కోరిక….

 

వర్ష కి తన బావ నీ చేసుకుంటే రాక్ స్టార్ భార్య అనే భార్య హోదా కోసం ఆశ….

 

ఇక మాధవరావు, రాజేష్ మొత్తం ఆస్తి పై కన్ను వేస్తారు దాని కోసం గుంట కాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారు….

 

ఇవన్నీ క్రిష్ కి తెలుసు కానీ తండ్రి బాధపడతాడు అని చెప్పడు…

 

ఇప్పుడు వీరేంద్ర గారు క్రిష్ పై కోపంగా ఉంటారు…..

 

వీళ్ళు ఇలా ఎవరి లోకం లో వాళ్ళు ఉండగా వస్తాడు క్రిష్ అతని ఫ్రెండ్ విజయ్…..

 

రేయ్ అంకుల్ మంచి కాక మీద ఉన్నట్టున్నారు రా…..

 

రేయ్ నువ్వు ఇంకా నన్ను బెదరగొట్టకు….అని ఇద్దరు లోపలికి వెళ్తారు…..

 

అగు క్రిష్..

 

చెప్పండి డాడీ….

 

ఎక్కడికి వెళ్ళావు…..

 

డాడీ అది….కాన్సెప్ట్ చెయ్యడానికి….

 

అసలు నిన్ను ఏమనాలి క్రిష్…మన వర్మ ఇండస్ట్రీస్ కి వారసుడివి….అవి హ్యాండోవర్ చేసుకుని ముందుకు నడిపించాల్సినవాడివి…..కానీ ఏం చేస్తున్నావు….

 

డాడీ నేను కాదు అనడం లేదు నా ఫ్యాషన్ వేరు….నాకు కొంచెం టైం ఇవ్వండి నేను కచ్చితంగా బిజినెస్ చూసుకుంటాను….

 

నేను కూడా కాదు అనడం లేదు….నీ ఫ్యాషన్ నీ….బిజినెస్ తో పాటు అది కూడా చూసుకో….

 

అసహనంగా నిస్సహాయంగా చూస్తాడు క్రిష్….

 

చూడు క్రిష్…..రేపే నువ్వు బిజినెస్ హ్యాండోవర్ చేసుకుంటున్నావు…..

 

డాడీ….

 

ఇంకేం చెప్పకు….

 

మౌనంగా మారిపోతాడు క్రిష్….

 

విజయ్ వైపు చూసి నువ్వు కూడా రేపటి నుండి ఆఫీస్ కి వస్తున్నావు….

 

అంకుల్ నేనా….

 

నువ్వే….అన్నిటిలో వాడికి తోడు గా ఉంటావు కదా మరి ఇక్కడ ఉండవా….

 

ఇంకేమి మాట్లాడడు విజయ్….

 

క్రిష్ వైదేహి గారి వైపు చూసి తన గదికి వెళ్ళిపోతాడు అసహనంగా….

 

నీ ఫ్రెండ్ కి చెప్పు విజయ్ రేపు 9 కి ఆఫీస్ లో ఉండాలి…

 

సరే అంకుల్….

 

వీరేంద్ర గారు అక్కడి నుండి తన గదికి వెళ్లిపోగానే కంగారుగా క్రిష్ గదిలోకి వెళ్తారు….

 

విజయ్ వైదేహి గారు క్రిష్ దగ్గర కి వెళ్తారు…

 

క్రిష్ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఎందుకు వచ్చావు మమ్మీ…..

 

క్రిష్ మీ నాన్న చెప్పేది కూడా నీ మంచికే కదా నాన్న….

 

అందుకే నేను ఎదిరించలేదు మమ్మీ…..

 

చూడు నాన్న మీ డాడీ నీ ఫ్యాషన్ నీ వదులుకోమని చెప్పలేదు….బిజినెస్ కూడా చూసుకోమంటున్నారు….నా బంగారం ఒంటి చేత్తో అన్ని హ్యాండిల్ చేస్తాడు వాడికి ఆ సత్తా ఉంది….

 

ఎలాంటి మాటల తో నన్ను మాయ చెయ్యలేవు మమ్మీ అని నవ్వుతూ అంటాడు….

 

మాయ కాదు నాన్న నిజం….

 

ఒరేయ్ నీతో పాటు నేను కూడా రా….అని అంటాడు విజయ్….

 

ఏం చేసినా కలిసే చేశాము కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు….అని విజయ్ మెడ చుట్టూ చేతులు వేస్తాడు…..

 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

 

రాజ్యం వెళ్ళి మీ అన్నయ్య నీ అడుగు మన వర్ష నీ క్రిష్ కి చేసుకోమని….

 

అబ్బా రోజూ అడుగుతూనే ఉన్నాను….కానీ మా అన్నయ్య నా మాట వినడం లేదు….వాడి ఇష్టం అంటున్నాడు….

 

అమ్మ ఎలా అయినా బావ నా మొగుడు కావాలి లేకపోతే నా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది…

 

నేను అందరి ముందు రాక్ స్టార్ క్రిష్ నా బావ అతనే నా కాబోయే భర్త అని అందరిని గొప్పలు చెప్పాను….

 

ఎన్ని జరిగినా వాడే నీ మొగుడు అవుతాడు లే కంగారు పడకు వర్ష అని అంటాడు రాజేష్….

 

అవును ఆ స్వాతి నీ నీకు ఆ క్రిష్ నీ వర్ష కి చేస్తే ఆస్తి మొత్తం మన చేతిలో ఉంటుంది….

 

డాడీ మరి ఆ ఆదిత్య గాడు ఉన్నాడు కదా….

 

ఇవన్నీ జరిగితే వాడు ఉండడు అని కన్నింగ్ గా నవ్వుతాడు మాధవరావు…..

 

అది చూసి అందరూ క్రూరంగా నవ్వుకుంటూ ఎవరి ప్లాన్ లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు….

 

ఇంకా ఉంది…..

 

తర్వాతా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అయిపోండి మన మగువ మనసు 🔥 

 

ఈ ఎపిసోడ్ నచ్చితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రోత్సహించండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….

 

ప్లీజ్ కామెంట్స్ యార్ 😔 

 

థాంక్స్ ఫర్ రీడింగ్ 😊