New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 1

మౌనం వీడవే సఖి 💝 – 1

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో తెల్లని పట్టు బట్టలలో చుక్కల్లో చంద్రుడు లాగ వెలిగిపోతున్నాడు వికృత్….అలియాస్ వికృత్ వీర మాచినేనీ……మాచినేని ఎంపైర్స్ కి వన్ అండ్ ఓన్లీ కింగ్…

చిలక పచ్చ రంగు పట్టు చీరలో సింపుల్ గా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి చేతిలో అందంగా అలంకరించిన కొబ్బరి బొండా పట్టుకొని మండపం మీదకి వెళ్లి వికృత్ పక్కన కూర్చుంది అతనికి కాబోయే భార్య అక్షర….

వికృత్ పెదవుల చివరగా ఒక సన్నని నవ్వి అలా వచ్చి ఇలా మాయం అయిపోయింది అక్షర నీ చూడగానే……అక్షర కూడా ఒకసారి తనకి కాబోయే భర్త నీ చూసి చిన్నగా నవ్వి పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంది..

అప్పటివరకు అక్షర ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన వికృత్ ఇప్పుడు తన పక్కన ఉన్న అక్షర నీ చూస్తూ ఉంటే ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది….ఎందుకో అతను ఇంతవరకు వెయిట్ చేసింది అక్షర కోసం కాదు ఏమో అని అనిపిస్తుంది అతని మనసుకి..తన మనసు ఎందుకో అక్కడ లేదు.


ఒక పక్క అక్షరానీ పెళ్లి చేసుకుంటున్న సంతోషం ఉన్నా కూడా ఎందుకో తెలియదు అతని మనసు గందర గోళంగా అనిపిస్తూ ఉంది..

అదే ఫీలింగ్స్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు….అన్నీ సాంప్రదాయపథంగా జరిపించి ఒక గంట తర్వాత వికృత్ చేతికి తాళి బొట్టు ఇచ్చి పెళ్లి కూతురు మెడలో కట్టమని చెప్పాడు పంతులు..

తను ప్రేమించిన అమ్మాయి ఇప్పటి నుంచి తన భార్య స్థానం లోకి రాబోతుంది అని ఒక పక్క సంతోషంగా ఉన్నా ,  ఎక్కడో కొంచం వెలితిగా అనిపిస్తూ ఉంటే అప్పటికి ఆ ఫీలింగ్ పక్కన పెట్టీ……సంతోషంగా తాళిని తీసుకొని అక్షర మెడలో కట్టాడు.

కానీ అప్పుడు వికృత్ కి తెలియదు అతను ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ఇద్దరు ఒక్కరే కాదు అని…..ఆ నిజం తెలిసినప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో మరి…

ఒక్కసారిగా పూల వర్షం కురినట్టు వాళ్ళు ఇద్దరి మిద అక్షింతల వర్షం కురిసింది.

ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మిద అక్షింతల వర్షం కురుస్తూ ఉంటే అక్కడే ఒక పక్కన నిలబడి ఉన్న అమ్మాయి కంట్లో కన్నీళ్లు జల జలా కారిపోతూ ఉంటాయి..

ఆ అమ్మాయి పక్కన ఉన్న తన ఫ్రెండ్ ఆ అమ్మాయి నీ చూస్తూ ” ఎంటే మీ అక్కకి పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్లిపోతుంది అని ఏడుస్తున్నవా…?? ”  అని ఆడింది.

ఆ అమ్మాయి మాత్రం ఏమి మాట్లాడకుండా పీటల మీద కూర్చుని ఉన్న వికృత్, అక్షర నీ చూస్తూ ఉంది కల్ల నిండా నీళ్ళతో…ఇలా ఒక రెండు గంటల తర్వాత పెళ్లి తంతు , ఫోటోలు , గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ అంతా అయిపోయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కి అరుంధతి నక్షత్రం కూడా చూపించి అప్పగింతలు స్టార్ట్ చేసారు.


అక్షర వాళ్ళ అమ్మ తనని హగ్ చేసుకొని ఏడుస్తూ ” జాగర్త తల్లి…… అత్తగారి ఇంట్లో ఎవరూ ఏం అన్నా కూడా నువ్వు ఎదురు చెప్పకు….మంచి కోడలిగా పేరు తెచ్చుకో అని చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పారు.

అక్షర  తన చెల్లి అభిజ్ఞ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ తనని హగ్ చేసుకొని”  మిస్ యూ రా ”  అని చెప్పింది..

ఆ మాటకు అప్పటివరకు కంట్లో కష్టంగా దాచుకున్న కన్నీళ్లు ఇంకా ఆగను అంటూ బయటకి వస్తె పెద్దగా అక్కా అని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది.

అక్షర కూడా  అభి అని పెద్దగా ఏడుస్తూ అభిజ్ఞని వదలలేదు..

అభిజ్ఞా నీ అందరు ముద్దుగా అభి అని పిలుస్తారు…

ఆ అక్క చెల్లి అనుబంధం చూసిన అక్కడ వాళ్ళందరికీ చాల ముచ్చటగా అనిపించింది..

వికృత్ కూడా వాళ్ళని అలా చూస్తూ ఉంటాడు…. వికృత వాళ్ళ అమ్మ గారు జానకి గారు వెళ్లి ఇద్దరి తల మిద చెయ్యి వేసి నిమురుతూ ” మీ అక్క చెల్లి ఇద్దరి ప్రేమ చూస్తూ ఉంటే చాల ముద్దుగా ఉంది….నాకే కానీ ఇంకో కొడుకు ఉండి ఉంటే మీ అక్క చెల్లి ఇద్దరినీ నా ఇంటికి కొడల్లుగా చేసుకునేదాన్ని ” అని చెప్పారు..

అప్పుడు ఆవిడకి తెలియదు కదా నిజంగానే అక్క చెల్లి ఇద్దరు తన ఇంటి కొడల్లే అవుతారు అని…..తెలిస్తే అలా అనేవారు కాదు ఏమో.


ఎట్టకేలకు అప్పగింతలు అన్నీ పూర్తి చేసుకొని వర్జం వచ్చే లోపు అక్కడ నుంచి ఇంటికి బయలుదేరారు నవ వధూవరులు….గంట తర్వాత పెద్ద విల్లా ముందు కార్ ఆగింది… వికృత్ ఫస్ట్ కార్ దిగి అతని చేతిని అందించి అక్షర నీ కూడా కార్ దింపి తనతో కలిసి ఇంటి గుమ్మం వరకు వెళ్ళాడు.


అక్కడ వికృత్ చెల్లెళ్ళు ముగ్గురు హారతి పల్లెం పట్టుకొని వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు….వాళ్ళు గుమ్మం ముందు వెళ్లి నిలబడగానే ఇద్దరికీ హారతి ఇచ్చి ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రమ్మని చెప్పారు.

నేను నా భార్య అలకనంద ( అలియాస్ అక్షర) తో కలిసి వచ్చాను అని చెప్పాడు వికృత్…

( వికృత్ తను లవ్ చేసిన అమ్మాయికి పెట్టుకున్న ముద్దు పేరు అలకనంద….అంటే ఎప్పుడు అలుగుతూ ఉంటుంది అని తనకి ఆ పేరు పెట్టుకున్నాడు)

అలకనంద అని చెప్పేసరికి అక్షర అయోమయంగా వికృత్ నీ చూస్తూ ఉంటె ” ఎంటి అలా చూస్తున్నావ్…..?? నేను నీకు పెట్టిన పేరు మర్చిపోయావా ఏంటి…? అని చిన్నగా నవ్వుతూ అడిగాడు వికృత్.

” మీరు నాకు పేరు ” అని అక్షర మాట్లాడుతూ ఉండగా రాహుకాలం వస్తుంది త్వరగా పేర్లు అవి చెప్పి  కొత్త పెళ్లి కూతురు తో ఇంట్లోకి వెళ్లి దీపారాధ చేయించండి అని వికృత్ నాన్న గారు చెప్పే సరికి ఇంకా అక్షర తో వికృత్ పేరు చెప్పించి ఇద్దరినీ ఇంట్లోకి ఆహ్వానించి…..

దేవుడి గదిలో దీపం పెట్టించి , కిచెన్ లో ఒక స్వీట్ ప్రిపేర్ చేయించి దాన్ని అక్షర చేతనే అందరికీ పంచి అప్పుడు రెస్ట్ తీసుకోమని ఇద్దరినీ వేరు వేరు రూమ్స్ కి పంపించారు.

అక్షర తనకి ఇచ్చిన  రూంకి వెళ్లి చీర , నగలు , ముఖ్యంగా పూల జడ చిరాకుగా అనిపిస్తూ ఉంటే దాన్ని పీకి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూంలోకి వెళ్ళిపోయింది.

ఫ్రెష్ అయ్యి వచ్చి ముందు రోజు నిద్రలేకపోవడం వల్ల ఫుల్ గా  నిద్ర వస్తూ ఉంటె అలానే బెడ్ మిద వాలిపోయి రెండు నిమిషాలకి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది.

అలా నిద్రపోయిన అక్షర సాయంత్రం 4 గంటల టైం లో లేచి బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు ఎవరివో మాటలు పెద్ద పెద్ద గా వినిపిస్తూ ఉంటే…..ఏం జరిగిందో ఏంటో అని రూం నుంచి బయటికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అయ్యింది.

తన చెల్లి అభిజ్ఞా మెడలో పచ్చని పసుపు తాడుతో ఏడుస్తూ హాల్ మధ్యలో  నిలబడి ఉంటే తనకి కొంచం దూరంలో వికృత్ కోపంగా వాళ్ళ అమ్మ , చెల్లి , బామ్మ మిద అరుస్తూ ఉంటాడు.

” పొద్దున అక్క నీ పెళ్లి చేసుకొని సాయంత్రం కి చెల్లిని కూడా పెళ్లి చేసుకొని తీస్కొని వచ్చావు ఎంటి రా నువ్వు చేసిన పని ” అని వికృత్ వాళ్ళ నాన్న రఘు రాం గారు అడిగితే.

ఆయన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడే ఏడుస్తూ నిలబడి ఉన్న అభిజ్ఞా చెయ్యి పట్టుకొని ఏడ్చుకుంటూ పైన ఉన్న తన రూంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు వికృత్….

వికృత్ తన చెల్లి మెడలో తాళి కట్టాడు అని మాట వినగానే అక్షర ప్రపంచం ఆగిపోయింది….అలా షాకింగ్ గా తన చెల్లిని మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ వెళ్తున్న వికృత్ నీ చూస్తూ ఉండిపోయింది అక్షర…

To be continued…….

అక్క నీ పెళ్లి చేసుకున్న సాయంత్రానికి చెల్లిని కూడా చేస్కొని తన చెల్లిని తనకి సవతిని చేసిన తన భర్త గురించి ఇప్పుడు అక్షర అభిప్రాయం ఎంటి….?

అసలు ఈ వికృత్ , అభిజ్ఞా , అక్షర స్టోరీ ఎంటి…?