మౌనం వీడవే సఖి 💝 – 2
ఆయన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా అక్కడే ఏడుస్తూ నిలబడి ఉన్న అభిజ్ఞా చెయ్యి పట్టుకొని ఈడ్చుకుంటూ పైన ఉన్న తన రూంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు వికృత్….
వికృత్ తన చెల్లి మెడలో తాళి కట్టాడు అని మాట వినగానే అక్షర ప్రపంచం ఆగిపోయింది….అలా షాకింగ్ గా తన చెల్లిని మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ వెళ్తున్న వికృత్ నీ చూస్తూ ఉండిపోయింది అక్షర..
అక్కడ ఉన్న అందరు వికృత్ బిహేవియర్ చూసి అయోమయంలో ఉంటే జానకి గారు బాధగా వికృత్ రూం వైపు ఒక సారి చూసి అక్కడే షాకింగ్ గా నిలబడి ఉన్న అక్షర దగ్గరికి వెళ్లి ” అమ్మా అక్షర ” అని తన భుజం మీద చెయ్యి వేసి పిలిచింది.
అక్షర కళ్ళల్లో నీళ్ళు తన పర్మిషన్ లేకుండా జల జలా కారిపోతూ ఉంటే ఏమి మాట్లాడలేక నిజానికి అసలు తను చూసిన సంఘటనకి తనకి మాటలు రాక అక్కడ నుంచి ఫాస్టుగా తన రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంది..
జానికి గారు ఎంత పిలుస్తున్న కూడా అసలు పలకలేదు అక్షర.
హాల్ లోనే ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ అందరు అసలు వికృత్ ఎందుకు అలా చేశాడో అర్ధంకాక అయోమయంలో ఉంటే అప్పుడే వికృత్ రూం నుంచి ఒక అరుపు వినిపించింది.
ఆ అరుపు వినగానే అందరు ఒక్కసారిగా భయంగా పైన ఉన్న వికృత్ రూం దగ్గరికి పరుగుపెడతారు.
వాళ్ళు పైకి వెళ్ళే కొద్దీ ప్లీస్ వొద్దు….ప్లీస్ అని అభిజ్ఞ ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్న అరుపులు ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉంటే అందరు వెళ్ళి వికృత్ రూం డోర్ కొడుతూ ఉంటారు.
లోపల ఉన్న అభిజ్ఞ ఏడుస్తూ వికృత్ దగ్గరికి వెళ్లి రక్తం కారిపోతూ ఉన్న అతని చేతిని పట్టుకోబోతు ఉంటే ” ఆగు…..ఒక్క అడుగు ముందుకి వేశావో ఏం చేస్తానో నాకే తెలియదు….వెనక్కి వెళ్ళు…. ” అని పెద్దగా బేస్ వాయిస్ లో అరిచాడు వికృత్….
( అభిజ్ఞా మిద ఉన్న కోపాన్ని అంతా గోడ మిద చూపించి తన చేతిని గోడకు గట్టిగా కొట్టుకున్నాడు వికృత్….)
అభిజ్ణ ధారాళంగా కారుతు ఉన్న రక్తం చూస్తూ ఏడుస్తూ వెన్నక్కి వెళ్లి గోడకి ఆనుకొని అలాగే కిందకి ఒరిగిపోతు ” ప్లీస్ అండి…….మీరు ఇలా చెయ్యకండి ప్లీస్….రక్తం చూడండి ఎలా కారిపోతుందో ప్లీస్…..” అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది….
” ఇష్టపడిన నువ్వు నా గుండెకి చేసిన గాయం కంటే ఇది అంటూ ఎర్రగా రక్తం కారుతూ ఉన్న తన చేతిని చూపిస్తూ…..ఇది ఏం ఎక్కువ బాధ నీ ఇవ్వడం లేదు…” అని చెప్పాడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే అభిజ్ఞ నీ చూస్తూ…..
ఆ మాటలకి అభిజ్ఞా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటె ” అయ్యి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు……?? నీ వల్ల మోసపోయిన నేను కదా ఎడవాలి ….
నిన్ను పిచ్చిగా ప్రేమించి నిజంగా ఇప్పుడు అందరి ముందు పిచ్చోడిని అయింది నేను కదా…….మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ” అని ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా అభిజ్ఞా నీ చూస్తూ అరిచాడు వికృత్.
లోపల వికృత్ అండ్ అభిజ్ఞా మాట్లాడుకే మాటలు అన్నీ బయట డోర్ దగ్గర నిలబడి ఉన్న అందరికీ వినిపిస్తూ ఉంటాయి.
వాళ్ళ మాటలు వింటున్న అందరిలో ఒకేటే ప్రశ్న కదులుతుంది…..అసలు అభిజ్ఞా వికృత్ నీ మోసం చెయ్యడం ఎంటి….?? అసలు వికృత్ ప్రేమించింది అక్షరణా…?? లేకపోతే అభిజ్ఞానా….??
వికృత్ మాటలు వింటూ ఉంటే వికృత్ ప్రేమించింది అభిజ్ఞానీ ఏమో అని అనిపిస్తుంది…..కానీ వికృత్ ఏ కదా తను ప్రేమించింది అక్షర నీ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మరి అక్షర నీ పెళ్లి చేసుకున్నాడు…?? మరి ఇప్పుడు ఎంటి ఇలా….??
ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్ళ బుర్రల్ని తొలిచేస్తూ ఉంటే ఒకరిని ఒకరు చూసుకుంటూ లోపల వికృత్ వాళ్ళు మాటలు వింటూ ఉంటారు సైలెంట్ గా….
” ఎంత పిచ్చిగా ప్రేమించానే నిన్ను….నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో నాకు తెలుసు….నీ కోసం అని మన పెళ్ళికి ముందే ఎన్ని చీరలు, నగలు తెప్పించి పెట్టానో తెలుసా…..!
మన పెళ్లి అయిన తరువాత నేను ఆఫీసుకి వెళ్ళిపోతే నువ్వు ఇంట్లో ఉంటావు అని నిన్ను కూడా నాతో పాటు ఆఫీసుకి తీసుకొని వెళ్ళాలి అని నా పి ఏ నీ కూడా పనిలో నుంచి తీసేసి ఆ పోస్ట్ నీ కోసం కాలిగా ఉంచాను.
నువ్వు నా పి ఏ గా జాయిన్ అయితే నీకు నీ కాళ్ళ మిద నిలడ్డాను అనే గౌరవం ఉంటుంది అలాగే నాకు కూడా నిన్ను ఎప్పుడు నా కళ్ళ ముందు చూసుకే అదృష్టం ఉంటుంది అని ఎంతగానో మురిసిపోయాను..
నీ కోసం…కేవలం నీ కోసం నీకు ఇష్టం అయిన నేను ఒక్కడినే చార్మినార్ దగ్గరికి వెళ్లి అక్కడ నీకు ఇష్టం అయిన మట్టి గాజులు , జుంకిలు ( చెవి దుద్దులు) ఇంకా నీకు నచ్చే జ్యువలరీ అంతా నేనే ఒక్కడినే షాపింగ్ చేసి భద్రంగా నా దగ్గర దాచుకున్నా….
నువ్వు ఎప్పుడు ఎప్పుడు నా లైఫ్ లోకి వస్తావా….?? నీ కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో నీకు చెప్పి…..నువ్వు ఆశ పడినట్టు మన మొదటి రాత్రి రోజు నీకు ఇష్టం అయిన మట్టి గాజులు ఇచ్చి నీకు ప్రపోజ్ చేసి , నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాలి అని ఎన్ని కలలు కన్నానో నాకు మాత్రమే తెలుసు….
నేను మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత కోపంగా ఉన్నా కూడా నీ దగ్గరికి వచ్చే సరికి అలా ఉండకూడదు అని నా కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు…..
నీకోసం ఇన్ని చేసినా నన్ను నువ్వు మోసం చేసావు….ఇప్పటి నుంచి నీ ప్రేమ కోసం మార్చుకున్న నా కేరక్టర్ నీ మళ్ళీ నార్మల్గా చేసుకొని అసలు పాత వికృత్ ఎలా ఉంటాడో….?? అసలు సిసలైన వికృత్ వీర మాచినేని అంటే ఏంటో నీకు ఇప్పటి నుంచి చూపిస్తాను…..
ఇప్పటి నుంచి నీ మిద నాకు ఉన్న ప్రేమ చచ్చిపోయింది…..ఇప్పటి నుంచి నీ మిద నాకు ఉన్న ఫీలింగ్ ఒక్కటే అది అసహ్యం , కోపం…
నిన్ను , నీ అక్క నీ అసలు ప్రశాంతంగా ఉండనివ్వను…ముఖ్యంగా నన్ను మోసం నిన్ను అసలు వదిలిపెట్టను….” అని కోపంగా పిడికిలి బిగించి చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ నిలబడి ఉన్న ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్ గా మెట్లు దిగి బయటికి వెళ్లి కార్ స్టార్ట్ చేసుకొని స్పీడుగా వెళ్ళిపోయాడు వికృత్….
ఇంతలో కింద హాల్ లోనుంచి ” అమ్మ గారు….అమ్మాయి గారు ” అంటూ పని మనిషి అరుపు విని అక్షర కి ఏం అయ్యింది అని కంగారుగా అందరు కిందకి వెళ్ళారు….
To be continued…..
అక్షర కి ఏం అయ్యింది….?
అసలు తను ప్రేమించిన వికృత్ కి వాళ్ళ అక్కకి పెళ్ళి జరిగితే అభిజ్ఞా ఎందుకు ఆ పెళ్లి ఆపలేదు….??
అభిజ్ఞా అసలు నిజంగా వికృత్ నీ ప్రేమించిందా…?
తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చెయ్యండి…
స్టోరీ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి….
Swipe left/right or tap the sides to turn pages