New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 3

మౌనం వీడవే సఖి 💝 – 3

ఇప్పటి నుంచి నీ మిద నాకు ఉన్న ప్రేమ చచ్చిపోయింది…..ఇప్పటి నుంచి నీ మిద నాకు ఉన్న ఫీలింగ్ ఒక్కటే అది అసహ్యం , కోపం…
నిన్ను , నీ అక్క నీ అసలు ప్రశాంతంగా ఉండనివ్వను…ముఖ్యంగా నన్ను మోసం నిన్ను అసలు వదిలిపెట్టను….” అని కోపంగా పిడికిలి బిగించి చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ నిలబడి ఉన్న ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్ గా మెట్లు దిగి బయటికి వెళ్లి కార్ స్టార్ట్ చేసుకొని స్పీడుగా వెళ్ళిపోయాడు వికృత్….
ఇంతలో కింద హాల్ లోనుంచి ” అమ్మ గారు….అమ్మాయి గారు ” అంటూ పని మనిషి అరుపు విని అక్షర కి ఏం అయ్యింది అని కంగారుగా అందరు కిందకి వెళ్ళారు….
అక్షర రూం లో నుంచి ఏదో వస్తువు పగిలిన సౌండ్స్ వినిపిస్తూ ఉంటే అందరు కంగారుగా డోర్ నీ బాదుతూ అక్షర….అమ్మా అక్షర…. ఒక్కసారి తలుపు తీయమ్మ….అని జానకి గారు , రఘు రాం గారు పిలుస్తూ ఉంటే 
“ప్లీస్……..అందరు వెళ్ళిపొండి అని అరిచింది అక్షర.
“అది కాదమ్మా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా…..”అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు జానకి గారు…
ఇప్పుడు మీ అందరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా నన్ను ఈ ఫ్లవర్ వాస్ గాజు ముక్క నీ పొట్టలో పొడుచుకొని చచ్చిపొమ్మంటార ” అని బెదిరించింది అక్షర…
“వొద్దు…నువ్వు ఏమి చేసుకోవద్దు తల్లి….మేము వెళ్తున్నాం ” అని చెప్పి అందరి తీసుకొని వెళ్ళిపోయారు రఘు రాం గారు….
వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత చేతిలో ఉన్న ముక్క నీ బెడ్ మీదకి విసిరి అలాగే ఏడుస్తూ నేల మిద కూర్చుంది అక్షర….
………………..
కోపంగా బయటికి వెళ్లిన వికృత్ డైరెక్ట్ గా ఒక బార్ కి వెళ్లి అక్కడ ఒక వైన్ ఆర్డర్ చేసుకొని ఎత్తిన బాటిల్ దించకుండా తాగేశాడు….
అలా ఒకదాని తర్వాత మరొకటి తాగుతూ….. అభిజ్ఞా చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా కోపంగా మారిపోతూ బాటిల్ మిద బాటిల్ కాళి చేసి పక్కన పడేస్తున్నాడు…
అలా ఫుల్ గా స్పృహ తప్పిపోయేంత వరకు తాగి బిల్ పే చేసి తూలుతూ కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు….అప్పుడే అతని మొబైల్ కి అతని ఫ్రెండ్ మాధవ్ నుంచి కాల్ వస్తుంది…
కళ్ళు మూస్తూ తెరుస్తూ, ముందుకి వెనక్కి తూలుతూ….కాల్ లిఫ్ట్ చేసి హలో ” అని అంటాడు…
వికృత్ మాటల్లోని తేడాగా కనిపెట్టిన మాధవ్ ” ఏం అయ్యింది రా…..వాయిస్ ఎంటి అలా ఉంది…ఎక్కడ ఉన్నావు నువ్వు….? అని అడిగాడు.
Xxxx బార్ లో ఉన్నాను….అని చెప్పి మత్తుకి స్పృహ తప్పి అలాగే కార్ లో పడిపోయాడు వికృత్….
మాధవ్ వెంటనే ఆఫీసు నుంచి ఆ బార్ దగ్గరికి స్టార్ట్ అయ్యి మధ్యలో అతని ఫ్రెండ్ సాగర్ నీ పిక్ చేసుకొని ఇద్దరు కలిసి అరగంటలో ఆ బార్ ముందు కార్ ఆపి కంగారుగా కార్ దిగి చుట్టూ చూస్తూ ఉంటే ఒక మూల వికృత్ కార్ పార్క్ చేసి కనిపిస్తే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఆ కార్ దగ్గరికి వెళ్ళారు….
కార్ లో డ్రైవింగ్ సీట్ లో అడ్డంగా పడి ఉన్న వికృత్ నీ చూసి షాక్ అయ్యి ఇద్దరు కలిసి అతన్ని పట్టుకొని వెళ్లి మాధవ్ కార్ లో కూర్చోబెట్టి….. వికృత్ కార్ నీ సాగర్ నీ తీసుకొని రమ్మని చెప్పి…..మాధవ్ , వికృత్ నీ తీసుకొని అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు…
వికృత్ కార్ లో కూర్చున్న సాగర్ కి సీట్ మిద అంతా ఎర్రగా రక్తం మరకలు కనిపిస్తూ ఉంటే అసలు ఏం జరిగిందో అర్థంకాక కార్ స్టార్ట్ చేసుకొని అతను కూడా మాధవ్ కార్ వెనక వెళ్ళాడు….
………………
ఎందుకు యాంగ్రీ బర్డ్ నువ్వు ఇలా చేస్తున్నావు….?? నువ్వు నన్ను అసహ్యించుకుంటూ ఉంటే నేను భరించలేను…..
నీ కోసమే నేను నీకు దూరం అవ్వాలి అనుకున్నాను…. నా గురించి నా గతం గురించి తెలిస్తే నా మిద కనీసం ఈ కోపం , అసహ్యం అనే ఫీలింగ్స్ కూడా ఉండవు  నీకు  అని బాధగా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అభిజ్ఞా….
To be continued……
( అభిజ్ఞా , వికృత్ నీ యాంగ్రీ బర్డ్ అని పిలుస్తుంది….అలా పిలవడానికి రీసన్ ఎంటి అంటే అభిజ్ఞా ఒకసారి తన ఫ్రెండ్ నీ కలిసి స్కూటీ మిద ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే తనకి ఆపోజిట్ సైడ్ రోడ్డు లో వికృత్ వస్తూ ఉంటాడు….
ఒక లారీ డ్రైవర్ ఫుల్ గా తాగి ఒక ఆక్సిడెంట్ చెయ్యడం వాళ్ళ అక్కడ ట్రాఫిక్ అంతా జాం అయ్యి గొడవ జరుగుతూ ఉంటుంది….
అభిజ్ఞా అక్కడ అంతా జనం గుమ్ముగుడి ఉండడం చూసి , ఏం జరుగుతుందో అనుకుంటూ స్కూటీ పక్కన పెట్టీ ……..
జనాలని తోసుకుంటూ వెళ్లి ,  అక్కడ తల నుంచి రక్తం కారుతూ ఉన్న ఒక పాప నీ చూసి , పాపం అని పిస్తూ ఉంటే ……
ఆ పక్కనే ఉన్న ఆ పాప తండ్రి తో లారి డ్రైవర్ అండ్ అతని అసిస్టెంట్ గొడవ పడుతూ ఉంటాడు…అది చూసిన అభిజ్ఞా కి ఆ లారి డ్రైవర్ మిద చాల కోపం వస్తుంది…
కోపంగా అలా ముందుకి ఒక్క అడుగు వేసేసరికి అప్పుడే అటు నుంచి వికృత్ వచ్చి ఆ లారి డ్రైవర్ నీ ఒక్కటి పీకి రోడ్డు కి కిస్ ఇచ్చేలా చేసి….అతని అసిస్టెంట్ కి కూడా ముక్కు మూతి ఏకం అయ్యేలా చేసి…..
ఆ పక్కన ఉన్న ఆ పాప తండ్రి నీ కూడా లాగి పెట్టీ ఒక్కటి పీకి ” నడి రోడ్డు లో ఎంటి ఈ న్యూసెన్స్….కొంచం కూడా సెన్స్ లేదా…. రోడ్డు మీద తీరిగ్గా వాడితో గొడవ పడుతూ ఉన్నావు ఇడియట్ ” అని అరిచి ఆ పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నీ చూసి దగ్గరికి రమ్మని పిలిచి….
అతని చెంపలు కూడా వాయించి ” ఇక్కడ ఇంత న్యూసెన్స్ జరుగుతూ ఉంటే క్లియర్ చెయ్యకుండా ఏం చేస్తున్నావు…? అని కోపంగా అడిగాడు…
వీర మాచినేని ఫ్యామిలీ  అంటే ఇండియాలో టాప్ టెన్ ఫేమస్ ఫ్యామిలీస్ లో వాళ్ళది ఒకటి…వాళ్ళకి చాల బిజినెస్లు అండ్ సినిమా థియేటర్లు అండ్ పెద్ద పెద్ద మాల్స్ అన్నీ ఉన్నాయి….వన్ ఆఫ్ ద రిచ్చేస్ట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా…….
సో అంత సూపర్ బాగ్రౌండ్ ఉన్న వీర మాచినేనీ వారసుడికి ఎదురు తిరి మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు సో అందుకే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ సైలెంట్ గా ఉన్నాడు….
తల దించుకోవడం కాదు ముందు ఇక్కడ అంతా క్లియర్ చెయ్….అని అరిచి అక్కడే ఫోన్ లో వీడియోలు అవి తీస్తున్న వాళ్ళని చూసి వాళ్ళ మిద కూడా అరిచి అక్కడ నుంచి విసుగ్గా తన కార్ లోకి వెళ్లి కూర్చున్నాడు….
వికృత్ అలా అందరి మిద అరవడం , కొట్టడం అన్నీ చూసిన అభిజ్ఞా కళ్ళు ఇంత ఇంతా చేసుకొని మరి చూసి వికృత్ వెళ్లిపోయిన తర్వాత ఇంతను ఎంటి మరి ఇలా ఉన్నాడు… తప్పు చేసిన వాళ్ళ మిద అరవడం ఒకే కానీ మిగిలిన వాళ్ళ మిద కూడా ఇలా ఫైర్ అవ్వడం ఎంటి….?
బాబు గారికి ముక్కు మిద ఉంటుంది ఏమో కోపం అని అనుకుంటూ యాంగ్రీ బర్డ్ అని అంటూ క్లియర్ అయిన ట్రాఫిక్ నీ చూసి అక్కడ నుంచి తన స్కూటీ దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది…) 
ఇది అంతా చెప్పడానికి రీసన్ అభి ఎందుకు వికృత్ నీ యాంగ్రీ బర్డ్ అని పిలుస్తుంది మీ అందరికీ చెప్పడానికి..
అదే అభిజ్ఞా అండ్ వికృత్ ఫస్ట్ మీట్….అక్కడ అభిజ్ఞా వికృత్ నీ చూసింది కానీ అతను చూడలేదు….
ఈ ఫస్ట్ మీట్ దగ్గర ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అండి అది ఇప్పుడు కాదు ముందు ముందు ఎపిసోడ్స్ లో చెప్తా….
స్టొరీ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి…