వద్దన్నా వదిలేస్తానా @17 “అదేంట్రా నువ్వు వాడి కోసం ఎదురు చూడ్డం దేనికి..?“ “ఎందుకంటే అంకుల్.. తను వెళ్లేప్పుడు నాకు చెప్పి వెళ్ళాడు ఇక్కడికే వచ్చి నాతో కలిసి భోజనం చేస్తానని చెప్పాడు”. అర్థం కాలేదు జనార్ధన్కి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ.. “అంటే విరాట్ ఇక్కడకి వచ్చాడా పొద్దున్న..?” “అదే అంకుల్ ఉదయం అంటీ బిర్యానీ చేసిందట కదా… నా కోసం బిర్యాని తీసుకొచ్చాడు.. నువ్వు తిన్నావా విరాట్ అని అడిగితే… లేదే మధ్యాహ్నం ఇద్దరం కలిసి…