New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 1

విధి కలిపిన బంధం – 1

ఒక అమ్మాయి రోడ్ మీద ఏడుస్తూ వెళ్తూ ఉంది…. అసలు తను ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎటు వెళ్తుందో తెలియదు ఎందుకు వెళ్తుందో తెలియదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు…..

 

 

 

ఆ అమ్మాయి కట్టు బట్టలతో ఉంది చేతిలో బ్యాగ్ కాదు కదా ఒక ఫోన్ కూడా లేదు అర్ద రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గాలి వాన బీబత్సంగా కురుస్తుంది….

 

 

 

అసలు ఎక్కడో ఒకరు ఇద్దరు తప్ప రోడ్ మీద ఎవరు మనుషులు లేరు ఏడుస్తూ వెళ్తూనే ఉంది… అనుకోకుండా ఒక ఆటో అతను వచ్చి మేడం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు….

 

 

 

అతని వైపు ఒకసారి చూసి ఏమి లేదు అని తల ఊపింది….మేడం రండి మేడం పర్లేదు అన్నాడు అతను అయినా సరే ఎక్కలేదు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది…

 

 

 

అయినా పర్లేదు రండి అనేసరికి ఇంక ఆ అమ్మాయికి భయం వేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ వాన లో పిచ్చి దానిలాగా పరిగెత్తింది…. ఎక్కడా ఆగలేదు వాన కాళ్ళకి చెప్పులు కూడా లేవు తెగిపోయాయి….

 

 

 

అలా పరిగెత్తి పరిగెత్తి ఒక బస్ స్టాప్ దగ్గర కొంతమంది మనుషులు ఉండేసరికి అక్కడ కూర్చుంది అలుపు తీర్చుకుంటూ…. అంతలో ఎలా వచ్చారో ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు కానీ పోలీసులు వచ్చారు….

 

 

 

ఎవరమ్మా నువ్వు ఎందుకు అలా పరిగెత్తావు అనుకుంటూ…. ఆ అమ్మాయి భయపడి ఏమి లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళబోయింది…. ఈ సారి గట్టిగ అడిగి జీప్ ఎక్కమన్నారు ఇంక తప్పక వేరే దారి లేక ఎక్కేసింది….

 

 

 

ఆ అమ్మాయి జీప్ ఎక్కాక జీప్ ముందుకు పోతూ ఉంది… అందులో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక ఎస్.ఐ ఉన్నారు ఆ అమ్మాయిని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు…. కానీ తను ఏమి చెప్పడం లేదు ఇంక వాళ్ళకి విసుగు వచ్చి….

 

 

 

ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని మిగతా స్టేషన్స్ కి కూడా ఇన్ఫోర్మ చేసి ఎవరైనా తన కోసం వస్తే ఈ స్టేషన్ లో ఉంది అని ఇన్ఫోర్మ చేయండి వాళ్ళకి అని చెప్పారు….

 

 

 

ఇంక అలా తనని స్టేషన్ కి తీసుకెళ్లి బయట ఉండే ప్లేస్ లో కూర్చోబెట్టారు…. ఆ అమ్మాయి భయపడుతూ సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను నన్ను పంపండి సార్ అని బతిమిలాడింది….

 

 

నువ్వు కూర్చోమ్మ మీ వాళ్ళు వస్తే నేనే పంపిస్తాను అని చెప్పారు….అలా అమ్మాయి అక్కడే కూర్చుంది భయపడుతూ ఏడుపుని ఆపుకుంటూ…. ఇంతలో తెల్లవారుతూ ఉంది….

 

 

అప్పుడప్పుడే కొంచెం కొంచెం గా వాన వెలిసింది…. ఇంతలో ఆ స్టేషన్ ముందుకి ఒక కార్ వచ్చి ఆగింది…. అందులో నుంచి ఒక అతను బ్లేజర్ వేసుకొని స్పెక్ట్స్ సరిచేసుకుంటూ నడుచుకుంటూ స్టేషన్ లోపలకి వచ్చి నుంచొని ఎస్క్యూజ్ మీ సార్ అని అన్నాడు….

 

 

 

అతనిని చూసి ఎస్ మీరు ఎవరు అని అడిగారు…. మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి లోపలికి వస్తారా అని అడిగాడు…. హ పదండీ అని చెప్పి లోపలికి వెళ్లి కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి అని అడిగారు….

 

 

 

ఆ బయట కూర్చున్న అమ్మాయి ఉంది కదా తను నా మరదలు నా మేనత్త కూతురు అని చెప్పాడు ఆ వచ్చిన అతను…. అది విని మీరు చెప్తుంది నిజమేనా మీకు తనకి నిజగా రిలేషన్ ఉంది అని మేము ఎలా నమ్మాలి అని అడిగారు….

 

 

అతను నవ్వుతు తన మొబైల్లో ఉన్న ఫోటో తీసి చూయించాడు…. హో ఓకే తను ఎదో ప్రాబ్లెమ్ లో ఉంది కొంచెం అదేంటో తెలుసుకోండి రాత్రి ఎవరో వెంట పడ్డారు కూడా కొంచం జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చి ఇంక మీరు వెళ్లొచ్చు అని అన్నారు ఎస్.ఐ….

 

 

 

ఆ అమ్మాయికి అంతా అయోమయం గా ఉంది కానీ సర్లే ఇప్పటికి అయితే ఇక్కడ నుంచి వెళ్దాం తర్వాత అతనిని దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ ఇంటికి తిరిగి సేఫ్ గా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంది…

 

 

అతను ఆ అమ్మాయికి చేయి ఇచ్చాడు ఇంక వెళ్దామా అని ఆ అమ్మాయి అయిష్టంగానే ముందుకు కదిలింది…. ఒక్క నిమిషం అన్నారు వెళ్లే వాళ్ళని ఎస్.ఐ గారు ఇద్దరు ఆగి వెనక్కి తిరిగి చూసారు….

 

 

మీ పేర్లేంటి అని అడిగారు…. దానికి ఇద్దరు ఆదర్ష్ అంకిత అని ఇద్దరు ఒకేసారి వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్తారు…. అది విన్న ఎస్.ఐ గారు కూడా చాలా బాగున్నాయ్ ఇద్దరు కూడా చక్కని జంట లా ఉన్నారు అని అంటారు….

 

 

 

ఇద్దరు ఇబ్బందిగా నవ్వుకొని అక్కడ నుంచి కార్ ఎక్కి వెళ్ళిపోతారు…. అలా వాళ్ళు వెళ్లిన ఒక్క పది నిమిషాలకి ఇంకో జంట బండి మీద వచ్చారు స్టేషన్ కి అందులో ఒక ఆమె ఏడుస్తూ లోపలికి వచ్చింది….

 

 

 

అది చూసి ఎవరమ్మా నువ్వు ఎందుకు బాధ పడుతున్నావ్ అని అడిగారు…. మా చెల్లి ఏదీ అంటూ అడిగింది…. మీ చెల్లా ఎవరు అని అడిగారు…. అదే మీకు ఒక అమ్మాయి దొరికింది అంట కదా నిన్న నైట్ మేము వేరే దగ్గరికి వెళ్లి చెప్తే ఇక్కడ ఉంది అని చెప్పి వెళ్లామన్నారు….

 

 

 

ఏదీ సార్ మా చెల్లి దానిని చూడాలి అని ఏడుస్తూనే ఉంది ఆమె వాళ్ళకి వింతగా అనిపించి ఇందాకే కదా ఒక అతను వచ్చి తన ఫోటో చూయించి ఇది నా మరదలు అని చెప్పి తీసుకొని వెళ్ళాడు అని అన్నారు….

 

 

 

మరదలు అంటూ వచ్చాడా నేను రాలేదే నేను ఇప్పుడే కదా నీతో వచ్చాను అని అన్నాడు పక్కన ఉన్న అతను…. మీరు కాదు ఇంకో అతను వచ్చాడు మా మేనత్త కూతురు అని చెప్పి తన ఫోటో కూడా చూయించాడు అందుకనే పంపించాం అని అన్నారు….

 

 

 

లేదు అది ఈ ఊరికి కొత్త నా దగ్గర కొన్నిరోజులు ఉండిద్ది అని కాలేజీ హాలిడేస్ అయితే తీసుకోచ్చాను…. ఈ ఊరు కాదు తనది అని చెప్పేసరికి పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు….

 

 

ఇక్కడ ఆదర్ష్ అంకిత ఇద్దరు కార్లో వెళ్తూ ఉన్నారు…. అంకిత బయటకు చూస్తూ ఎదో ఆలోచిస్తూ ఉంది…. ఆదర్ష్ మాత్రం అంకిత ని మధ్య మధ్యలో చూస్తూ డ్రైవ్ చేస్తు ఉన్నాడు….

 

 

ఆదర్ష్ సడన్ గా కార్ ఆపాడు అది చూసి అంకిత మనం ఎందుకు అండి ఇక్కడ ఆగాం అనింది చుట్టూ చూస్తూ చెప్తా ముందు దిగు అన్నాడు…. అంకిత బయపడుతూనే దిగింది….

 

 

ఆదర్ష్ అంకిత దగ్గరికి వచ్చి లాగిపెట్టి ఒకటి కొట్టాడు…. అది ఊహించని అంకిత షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయింది….

 

 

 

అసలు ఈ అంకిత ఎవరు తను ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసింది….?

ఆదర్ష్ ఎవరు అంకిత తన మరదలు అని చెప్పి ఎందుకు తీస్కోచ్చాడు….?

ఇప్పుడు ఆదర్ష్ వల్ల అంకిత కి ఏమైనా ప్రమాదం ఉందా….?

అసలు అంకిత ని ఎందుకు కొట్టాడు…?

ఇప్పుడు పోలీసులు ఏమి చేయబోతున్నారు దొరుకుతారా లేదా….?

 

ఇవన్నీ తెలియాలి అంటే నెక్స్ట్ అప్డేట్ కై వేచి ఉండండి…

అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ని ఇంక సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….

 

మీ 

లక్ష్మి అవినాష్.