మాల్ నుండి బయటపడిన శివ, సాహిత్యలు ఎలాగోలా కార్ పార్కింగ్ ఏరియాకు చేరుకున్నారు. శివ కడుపునొప్పి, రంగా ఇచ్చిన గుద్దు వల్ల ఇంకా అల్లాడిపోతున్నాడు. సాహిత్య కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమెకు డ్రైవింగ్ వచ్చు కానీ, సిటీ ట్రాఫిక్‌లో నడపడం చాలా అరుదు. అయినా బావ పరిస్థితి చూసి ధైర్యంగా స్టీరింగ్ పట్టుకుంది. కార్‌ను ఎలాగోలా శివ హైదరాబాద్ ఫ్లాట్‌కు తీసుకొచ్చింది.