సంక్రాంతి పండగ ముగిసింది. పల్లెటూరి ప్రశాంతతను వదిలి శివ, సాహిత్య ఇద్దరూ సిటీకి ప్రయాణమయ్యారు. శివ తన సొంత కారులోనే ప్రయాణాన్ని ప్లాన్ చేశాడు. కారు వెనుక సీట్లో పెద్దవాళ్లు సర్దిపంపిన పల్లెటూరి పిండివంటలు, కొత్త ఆవకాయ పచ్చడి జాడీలు ఉన్నాయి. డ్రైవింగ్ సీట్లో శివ కూర్చోగా, పక్కనే ఉన్న కోపంతో బుంగమూతి పెట్టిన సాహిత్య కూర్చుంది. ఊరి నుంచి బయలుదేరేటప్పుడు జానకమ్మ ఇద్దరికీ హారతి ఇచ్చి, “జాగ్రత్తగా వెళ్లండిరా. ఆరు నెలల్లోగా మీ పెళ్లి జరగాలి, గుర్తుంచుకోండి” అని గట్టిగా హెచ్చరించింది.