New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Mr. రాక్షాస్ – 1

Mr. రాక్షాస్ – 1

నగరం అంతా కూడా జోరుగా కురుస్తున్న వర్షం లో ఒక కార్ మాత్రం వేగంగా దూసుకుని వెళ్తుంది

నేరుగా సిటీలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది కార్

కార్ దిగి స్టైల్ గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు అతను

నేరుగా లిఫ్ట్ లోకి వెళ్లి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి పాకెట్ లో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి అందులో నుంచి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేయడం స్టార్ట్ చేశాడు

ఇక లిఫ్ట్ ఆగగానే బయటకి వచ్చి నేరుగా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు అతను

అదే రూమ్ లో భయంగా బిక్కు బిక్కు మంటూ ఉంది ఒక అమ్మాయి అతను లోపలికి వెళ్ళి ఆమె వైపు కొన్ని క్షణాలు చూశాడు

ఆమె లో అతని పట్ల ఏ మాత్రం కూడా ఆసక్తి లేనట్టు అతనికోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు ఏ కోసానా కనిపించకపోవడంతో అతని దవడలు బిగుసుకున్నాయి చేతి నరాలు పచ్చగా ఉబ్బి బయటకి కనిపిస్తూ చూసేవాడిని బెదిరిపోయేలా చేస్తూ ఉన్నాయి

అతను వచ్చింది కూడా పట్టించుకోకుండా దీక్షనంగా ఆలోచిస్తున్నా ఆమె వైపు చూస్తూ ఉంటే అంతకంతకు అసహనం పెరిగిపోతుంది

రెండు అడుగుల్లో ఆమెను చేరి ఆమె రెక్క పట్టుకొని పైకి లాగాడు అతను

హౌ డేర్ యు ఫస్ట్ నైట్ గదిలో మొగుడు గురించి కాకుండా ఎవరి గురించి ఆలోచిస్తున్నావే అడిగాడు ఆమె గొంతు మీద పట్టు పెంచుతూ

నేను నేను అంటూ మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ మాట గొంతు దాటి బయటికి రావడం లేదు

యు బ్లడీ నిజంగా నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు నీ మొగుడ్ని నా గురించి ఆలోచించడం మానేసి నేను వస్తాను అని చెప్పాను నువ్వు ఏ డ్రెస్ లో ఉండాలో కూడా నీకు చెప్పాను అయినా కూడా నీకోసలు పట్టింపలేదు కదా అడిగాడు అతను

అది … అది … అంటూ అతని చేతి మీద కొడుతూ ఉంది ఆమె

ఒక రెండు నిమిషాలకి ఆమెని మంచం మీద పడేశాడు

గొంతు దగ్గర పట్టుకుని దక్కుతూ లేచి కూర్చుని అతని వైపు చూస్తూ ఉంది

మీరు ఇచ్చిన డ్రెస్ నేను ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలేదు నాకు అలాంటి బట్టలు నచ్చవు అంది ఆమె భయంగా

నేనేమైనా నిన్ను వాడుకొని వదిలేస్తాను అనుకుంటున్నావా నేను నీ మొగుడిని అర్థమవుతుందా నీ మొగుడ్ని నేను నిన్ను ఎలా కోరుకుంటున్నానో అలా ఉండడం మాత్రమే నీ డ్యూటీ నీ డ్యూటీకి మించి ఎక్స్ట్రా ఒక్క పని చేసినా నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అంటూ విసురుగా తన కట్టుకున్న చీరని బలవంతంగా తన నుంచి దూరం చేసేసాడు అతను

జనని జనని ఏమైంది ఏమైంది అంటూ తనని కలుపుతూ అడిగింది ఆమె ఫ్రెండ్ 

అంటే ఇప్పటివరకు నేను కన్నది మొత్తం కళా దేవుడా ఎంత దరిద్రమైన కళ అది అనుకుంటూ నుదుటికి పట్టిన చమటలు తుడుచుకుంటూ ఉంది ఆ అమ్మాయి 

అసలేమైంది ఏం కల వచ్చింది అడిగింది ఆ అమ్మాయి ఫ్రెండ్ తన వైపు చూస్తూ 

ఏం లేదులే అంటూ మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసి పడుకుండిపోయింది జనని 

ఏదో అయింది పిల్లకి అనుకుంటూ తను కూడా లైట్ తీసుకుని పడుకుండిపోయింది 

కానీ తను పడుకున్న తర్వాత నిద్రలేచిన జనని తన ఫోన్ తీసుకొని మెసేజెస్ చెక్ చేస్తూ ఉంది 

రేపు రాత్రికి  @@@@ హోటల్ కి రా అని ఉన్న మెసేజ్ చూసి ఒక్కసారిగా మీరు కారిపోయింది తన ఫ్రెండ్ పూర్తిగా పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు తన మెడలో దాచిన తాళిబొట్టు బయటకి తీసింది జనని 

తనకి అప్పటికే పెళ్లి అయ్యి రెండు వారాలు అవుతుంది ఆ తాళిబొట్టుని తిరిగి తన డ్రెస్ లోపల దాచేస్తూ రేపు వాడిని చేస్తాడు ఏంటో అనుకుంటూ భయపడుతూ ఉంటే 

వాడు ఏం చేసినా అన్నిటికీ భరించాలి ఓర్చు కోవాలి అని సిద్ధపడే కదా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది మళ్లీ ఇప్పుడు నువ్వు భయం పెట్టుకోవడంలో అర్థం లేదు జనని అంటూ తన అంతరంగం తనని ప్రశ్నిస్తూ ఉండడంతో 

ఏం చేయను తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు కానీ వాడితో జీవితాంతం ఉండాలి అంటేనే నాకు భయంగా ఉంది వాడితో ఒక్క గంట నాకు చాలా భయంకరంగా గడిచింది అలాంటిది ఇంకా జీవితాంతం అంటే నా వల్ల కాదు అనుకుంది జనని మనసులో 

ఇప్పుడు నీ దగ్గర ఇది కాకుండా వేరే ఆప్షన్ ఉందా అంటూ తన అంతరంగం తనని మళ్లీ ప్రశ్నించడంతో 

లేదు అనుకుంది

నువ్వు భూమ్మీద ఎక్కడ దాక్కున్నా సరే వాడికున్న ఇన్ఫ్లుయెన్స్ తో నిన్ను గంటలో వాడి దగ్గరికి తెచ్చుకుంటాడు అలాంటి వాడి దగ్గర నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడం తప్పించుకోవడం అంటే అది చందమామ కథలు లాంటిది నువ్వు అస్సలు ఆ ఆలోచన కూడా చేయకు హోప్స్ పెరుగుతాయి తప్ప నీకు ఒక సొల్యూషన్ దొరకదు అంటూ తన ఇన్నర్ తనతో మాట్లాడుతూ ఉంటే 

మరేం చేయాలి వాడితో జీవితాంతం నా బ్రతుకి ఇంతే అనుకొని సర్దుకుపోవాలా అనుకుంది మనసులో 

మరి తప్పదు అని బదిలించింది తన అంతరంగం

దేవుడా అసలేంటి నాకి బాధ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి 

కొంచెం సేపటికి తల మొత్తం బరువుగా అనిపిస్తూ ఉంటే ఫోన్ పక్కన పెట్టేసి పడుకుండిపోయింది జనని 

@@@@@@@ 

అదే సిటీలో ఉన్న పెద్ద బిల్డింగ్ లో 25th ఫ్లోర్ 

ఆ రూమ్లో ఒక నలుగురు వెధవలు మోకాళ్ళ మీద నిలబడి చేతులు పైకి ఎత్తి భయం భయంగా చూస్తూ ఉంటే వాళ్ల ముందు ఆరడుగుల అందగాడు కూర్చొని ఉన్నాడు ఒక చేతిలో ఇంకొక చేతిలో సిగరెట్ పట్టుకొని సిగరెట్ స్మోక్ చేస్తూ తిప్పుతూ చాలా కూల్ గా ఉన్నాడు కానీ అతని కళ్ళు మాత్రం దానికి భిన్నంగా మండే అగ్నిగోళంలా ఎర్రగా భగభగ మండుతూ ఉన్నాయి 

ఏరా మీకు నా పెళ్ళాం కావాల్సి వచ్చిందా అది కాలేజీకి వెళ్తుంటే ఏడిపిస్తున్నారు మీ ఎవ్వరికి బ్రతికే హక్కు లేదురా ఈ రానా గాడి పెళ్ళాన్ని టచ్ చేసిన తర్వాత కూడా మీరు బ్రతికున్నట్టు ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది అందుకే ఈసారికి చచ్చిపోండే అంటూ ఒక్క నిమిషంలోనే నలుగురి తలలోకి బుల్లెట్ కాల్చేశాడు మన విలన్ బాబు 

గన్ సౌండ్ విన్నా ఒక రెండు నిమిషాల లోపే అక్కడికి వచ్చారు పదిమంది బాడీగార్డ్స్ 

వాళ్ల వైపు చూస్తూ క్లియర్ ఎవ్రీథింగ్ చిన్న రక్తం చుక్క కూడా కనపడడానికి వీల్లేదు అంటూ ఆర్డర్ పాస్ చేసి అక్కడి నుంచి స్టైల్ గా బయటకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు రానా 

————-continues……..

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ